యోబు 32:1-22
32 యోబు తన దృష్టిలో తాను నీతిమంతుణ్ణి అనుకోవడం చూసి+ ఆ ముగ్గురు అతనికి జవాబిచ్చే ప్రయత్నం మానుకున్నారు.
2 అయితే రాము వంశస్థుడూ, బూజీయుడూ+ అయిన బరకెయేలు కుమారుడు ఎలీహుకు చాలా కోపం వచ్చింది. దేవుణ్ణి కాకుండా తనను నీతిమంతునిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించినందుకు+ యోబు మీద అతని కోపం రగులుకుంది.
3 యోబు ముగ్గురు సహచరులు జవాబు ఇవ్వలేకపోయినందుకు, దేవుణ్ణి చెడ్డవాడని ప్రకటించినందుకు వాళ్ల మీద కూడా అతనికి చాలా కోపం వచ్చింది.+
4 వాళ్లు తనకన్నా వయసులో పెద్దవాళ్లు కాబట్టి,+ యోబు మాట్లాడడం పూర్తయ్యేవరకు ఎలీహు వేచివున్నాడు.
5 ఆ ముగ్గురూ బదులు చెప్పలేకపోవడం చూసి ఎలీహు కోపం మండుకుంది.
6 దాంతో బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు మాట్లాడడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:
“నేను వయసులో చిన్నవాణ్ణి,మీరు పెద్దవాళ్లు.+
అందుకే మీ మీద గౌరవంతో మధ్యలో మాట్లాడలేదు,+నాకు తెలిసింది మీకు చెప్పే సాహసం చేయలేదు.
7 ‘వృద్ధులు మాట్లాడాలి,పెద్ద వయసువాళ్లు తెలివిని ప్రకటించాలి’ అని నేను అనుకున్నాను.
8 కానీ దేవుడిచ్చే పవిత్రశక్తి వల్లే,సర్వశక్తిమంతుని ఊపిరి వల్లే మనుషులకు అవగాహన వస్తుంది.+
9 కేవలం వయసు వల్లే ఒక వ్యక్తి తెలివిగలవాడు అవ్వడు,సరైనదేదో అర్థం చేసుకోగలిగేది వృద్ధులు మాత్రమే కాదు.+
10 కాబట్టి నేను ఏమంటున్నానంటే, ‘నేను చెప్పేది వినండి,నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.’
11 ఇదిగో! నేను మీ మాటల కోసం ఎదురుచూశాను;మాట్లాడేందుకు మీకు మాటలు దొరికేవరకు+మీ తర్కాన్ని వింటూ వచ్చాను.+
12 నేను మీ మాటల్ని జాగ్రత్తగా విన్నాను,కానీ మీలో ఎవ్వరూ యోబును సరిదిద్దలేకపోయారు,*అతని వాదనలకు జవాబు ఇవ్వలేకపోయారు.
13 కాబట్టి, ‘మేమే తెలివిగలవాళ్లం;మనిషి కాదు దేవుడే అతన్ని గద్దిస్తాడు’ అని అనకండి.
14 అతను వాదించింది నాతో కాదు,కాబట్టి మీ వాదనలతో నేను అతనికి జవాబివ్వను.
15 వాళ్లు భయపడిపోయారు, వాళ్ల దగ్గర ఇక జవాబులు లేవు;చెప్పడానికి వాళ్ల దగ్గర ఏమీలేదు.
16 నేను ఎదురుచూశాను, కానీ వాళ్లు మాట్లాడట్లేదు;ఏ జవాబూ చెప్పలేక ఊరికే నిలబడ్డారు.
17 కాబట్టి నేనూ జవాబిస్తాను;నాకు తెలిసింది చెప్తాను,
18 ఎందుకంటే నా నోరు మాటలతో నిండివుంది;పవిత్రశక్తి* నన్ను బలవంతపెడుతోంది.
19 నా అంతరంగం మూసేసిన తిత్తిలోని ద్రాక్షారసంలా,పిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొత్త ద్రాక్షారస తిత్తుల్లా ఉంది.+
20 నన్ను మాట్లాడనివ్వండి, అప్పుడే నాకు కాస్త నెమ్మదిగా ఉంటుంది!
నా పెదాలు తెరిచి నేను జవాబిస్తాను.
21 నేను ఎవరి మీదా పక్షపాతం చూపించను;+ఏ మనిషినీ పొగడ్తలతో ముంచెత్తను,
22 అలా పొగడడం నాకు రాదు;ఒకవేళ నేనలా చేస్తే, నా సృష్టికర్త నన్ను త్వరగా నాశనం చేస్తాడు.