యోబు 27:1-23

  • యోబు యథార్థంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు (1-23)

    • “నా యథార్థతను విడిచిపెట్టను” (5)

    • భక్తిహీనులకు ఆశ ఉండదు (8)

    • “ఇంత వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు?” (12)

    • దుష్టులకు చివరికి ఏమీ ఉండదు (13-23)

27  యోబు కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు:  2  “నాకు న్యాయం చేయని దేవుని+ జీవం తోడు,నాకు ఎంతో దుఃఖం కలిగించిన సర్వశక్తిమంతుని+ జీవం తోడు,  3  నా ఊపిరి నాలో ఉన్నంతవరకు,దేవుని జీవశక్తి* నా ముక్కు రంధ్రాల్లో ఉన్నంతవరకు,+  4  నా పెదాలు చెడ్డమాటలు పలకవు;నా నాలుక మోసపు మాటలు మాట్లాడదు!  5  నేను మిమ్మల్ని నీతిమంతులుగా అస్సలు ప్రకటించలేను! చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!*+  6  నేను నా నీతిని కాపాడుకుంటాను, దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టను;+నేను జీవించినంత కాలం నా హృదయం నన్ను తప్పుపట్టదు.*  7  నా శత్రువు దుష్టునిలా,నా మీద దాడిచేసేవాడు అవినీతిపరునిలా శిక్షించబడాలి.  8  భక్తిహీనుడు* నాశనం చేయబడినప్పుడు,+దేవుడు అతని ప్రాణాన్ని తీసేసినప్పుడు అతనికి ఏ ఆశ ఉంటుంది?  9  అతని మీదికి విపత్తు వచ్చినప్పుడుఅతను పెట్టే మొరను దేవుడు వింటాడా?+ 10  అతను సర్వశక్తిమంతుణ్ణి బట్టి సంతోషిస్తాడా? అన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థిస్తాడా? 11  దేవుని శక్తి గురించి* నేను మీకు బోధిస్తాను;సర్వశక్తిమంతుని గురించి ఏదీ దాచను. 12  మీరంతా దర్శనాలు చూసివుంటేఇంత వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? 13  దుష్టునికి దేవుడు ఇచ్చే వాటా,+దౌర్జన్యం చేసేవాళ్లకు సర్వశక్తిమంతుడు ఇచ్చే స్వాస్థ్యం ఇదే: 14  అతని కుమారుల సంఖ్య పెరిగితే, వాళ్లు కత్తిచేత చంపబడతారు,+అతని వంశస్థులకు సరిపడా ఆహారం ఉండదు. 15  అతని తర్వాత మిగిలినవాళ్లు తెగులు వల్ల పాతిపెట్టబడతారు,వాళ్ల భార్యలు వాళ్ల కోసం ఏడ్వరు. 16  అతను ధూళి అంత విస్తారంగా వెండిని పోగుచేసుకున్నా,బంకమట్టి అంత విస్తారంగా శ్రేష్ఠమైన వస్త్రాల్ని సమకూర్చుకున్నా, 17  సమకూర్చుకునేది అతనే గానీ,నీతిమంతుడు వాటిని వేసుకుంటాడు,+నిర్దోషులు అతని వెండిని పంచుకుంటారు. 18  అతను కట్టే ఇల్లు చిమ్మెట గూడు అంత బలహీనమైనది,కావలివాడు వేసుకునే గుడిసె+ లాంటిది. 19  అతను ధనవంతునిగా పడుకుంటాడు కానీ అతని సంపద నిలవదు;అతను కళ్లు తెరిచినప్పుడు ఏమీ ఉండదు. 20  భయం వరదలా అతన్ని ముంచెత్తుతుంది;రాత్రివేళ తుఫాను అతన్ని ఎత్తుకుపోతుంది.+ 21  తూర్పు గాలి అతన్ని తీసుకెళ్లిపోతుంది, అతను ఇక ఉండడు;అది అతని నివాసం నుండి అతన్ని తుడిచిపెట్టేస్తుంది.+ 22  దాని బారి నుండి తప్పించుకోవడానికి అతను ఎంత ప్రయత్నించినా,+అది ఏమాత్రం జాలి లేకుండా అతని మీద విరుచుకుపడుతుంది.+ 23  అది అతన్ని చూసి చప్పట్లు కొడుతుంది,తన స్థానం నుండి ఈల వేస్తుంది.*+

అధస్సూచీలు

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “కాపాడుకుంటాను!”
లేదా “నిందించదు.”
లేదా “మతభ్రష్టుడు.”
లేదా “దేవుని చేతితో” అయ్యుంటుంది.
లేదా “అవి అతన్ని చూసి చప్పట్లు కొడతాయి, తమ స్థలంలో నుండి ఈల వేస్తాయి” అయ్యుంటుంది.