యోబు 24:1-25

  • యోబు జవాబు కొనసాగుతుంది (1-25)

    • ‘దేవుడు ఎందుకు ఒక తీర్పు రోజును నియమించట్లేదు?’ (1)

    • దేవుడు దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడని అనడం (12)

    • పాపం చేసేవాళ్లకు చీకటి అంటే ఇష్టం (13-17)

24  “సర్వశక్తిమంతుడు ఎందుకు ఒక తీర్పు రోజును నియమించట్లేదు?+ ఆయన గురించి తెలిసినవాళ్లు ఆ రోజును ఎందుకు చూడలేకపోతున్నారు?   ప్రజలు సరిహద్దు రాళ్లను జరుపుతారు;+వేరేవాళ్ల మందల్ని ఎత్తుకెళ్లి తమ పచ్చికబయళ్లలో ఉంచుతారు.   తండ్రిలేని పిల్లల గాడిదను తోలుకెళ్తారు,విధవరాలి ఎద్దును తాకట్టుగా* ​లాక్కుంటారు.+   పేదవాళ్లను దారిలో నుండి తోసేస్తారు;భూమ్మీది నిస్సహాయులు వాళ్లకు కనిపించ​కుండా దాక్కోవాల్సి వస్తుంది.+   పేదవాళ్లు ఎడారిలో అడవి గాడిదల్లా+ ఆహారం వెతుక్కుంటూ తిరుగుతారు;తమ పిల్లల కోసం ఎడారిలో ఆహారం వెతుకుతారు.   వాళ్లు ఇతరుల పొలంలో కోత* కోయాల్సి వస్తుంది,దుష్టుల ద్రాక్షతోటలో పరిగె ఏరుకోవాల్సి వస్తుంది.   బట్టలు లేక రాత్రంతా వాళ్లు దిగంబరంగా పడుకుంటారు;+చలికి కప్పుకోవడానికి వాళ్ల దగ్గర ఏమీ ఉండదు.   పర్వతాల మీద కురిసే వర్షాలకు వాళ్లు తడిసిముద్దౌతారు;నిలువ నీడ లేక బండల్ని కౌగిలించు​కుంటారు.   దుష్టులు తండ్రిలేని పిల్లవాణ్ణి తల్లి రొమ్ము నుండి లాగేస్తారు;+పేదవాడి బట్టల్ని తాకట్టుగా ​తీసుకుంటారు.+ 10  దానివల్ల వాళ్లు బట్టల్లేకుండా దిగంబరంగా తిరగాల్సి వస్తుంది,ఆకలితో అలమటిస్తూ ధాన్యపు పనల్ని* మోయాల్సి వస్తుంది. 11  వాళ్లు ఎండవేళ కొండ ప్రాంతంలో రాతి​గోడల మధ్య కష్టపడతారు;*వాళ్లు ద్రాక్షతొట్లు తొక్కుతారు, అయినా దాహంతోనే ఉంటారు.+ 12  చనిపోతున్నవాళ్లు నగరంలో మూల్గుతూ ఉన్నారు;తీవ్రంగా గాయపడినవాళ్లు సహాయం కోసం అర్థిస్తున్నారు,+కానీ దేవునికి అది తప్పు అనిపించదు.* 13  వెలుగు మీద తిరుగుబాటు చేసేవాళ్లు ఉన్నారు;+వాళ్లు దాని మార్గాల్ని గుర్తించరు,దాని దారుల్లో నడవరు. 14  హంతకుడు ఉదయాన్నే లేస్తాడు;అతను నిస్సహాయుల్ని, పేదవాళ్లను చంపుతాడు,+అయితే రాత్రివేళ దొంగతనాలు చేస్తాడు. 15  వ్యభిచారం చేసేవాడు సంధ్య వెలుగు కోసం ఎదురుచూస్తూ,+‘ఎవరూ నన్ను చూడరు!’ అనుకుంటాడు;+ తన ముఖాన్ని కప్పుకుంటాడు. 16  వాళ్లు చీకట్లో ఇళ్లలోకి చొరబడతారు;పగలు తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు. పగటి వెలుగు అంటే ఏంటో వాళ్లకు తెలీదు.+ 17  వాళ్లకు పగలు కూడా కారుచీకటిలానే అనిపిస్తుంది.కటిక చీకట్లోని భయాల గురించి వాళ్లకు బాగా తెలుసు. 18  కానీ వాళ్లు ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోతారు. వాళ్ల భూభాగం శపించబడుతుంది.+ వాళ్లు తమ ద్రాక్షతోటలకు తిరిగెళ్లరు. 19  వేడి, అనావృష్టి మంచు నీటిని తీసుకు​పోయినట్టే,పాపం చేసినవాళ్లను సమాధి* తీసుకుపోతుంది!+ 20  వాళ్ల తల్లులు వాళ్లను మర్చిపోతారు; పురుగు వాళ్లను ఇష్టంగా తినేస్తుంది. వాళ్లను ఎవ్వరూ గుర్తుచేసుకోరు.+ అవినీతిపరులు చెట్టులా పడగొట్ట​బడతారు. 21  వాళ్లు గొడ్రాళ్లను మింగేస్తారు,విధవరాళ్లను బాధపెడతారు. 22  బలవంతుల్ని నిర్మూలించడానికి దేవుడు* తన శక్తిని ఉపయోగిస్తాడు;వాళ్లు పైకి ఎదిగినా, ప్రాణాలతో ఉంటామనే నమ్మకం వాళ్లకు ఉండదు. 23  దేవుడు* వాళ్లను ధైర్యంగా, సురక్షితంగా ఉన్నట్టు భావించేలా చేస్తాడు,+అయితే ఆయన కళ్లు వాళ్లు చేసే ప్రతీదాన్ని* చూస్తుంటాయి.+ 24  వాళ్లు కొంతకాలం హెచ్చించబడతారు, కానీ తర్వాత ఇక ఉండరు.+ వాళ్లు తగ్గించబడి,+ అందరిలాగే సమకూర్చబడతారు;ధాన్యపు వెన్నుల్లా కోయబడతారు. 25  ఇప్పుడు, నేను అబద్ధికుణ్ణని ఎవరు నిరూపించగలరు?నా మాటల్ని ఎవరు తప్పుపట్టగలరు?”

అధస్సూచీలు

లేదా “జామీనుగా.”
లేదా “వాళ్లు పొలంలో గడ్డి” అయ్యుంటుంది.
లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”
లేదా “నూనె గానుగ ఆడిస్తారు” అయ్యుంటుంది.
లేదా “దేవుడు ఎవర్నీ తప్పుపట్టడు” అయ్యుంటుంది.
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
అక్ష., “ఆయన.”
అక్ష., “ఆయన.”
అక్ష., “వాళ్ల మార్గాల్ని.”