యోబు 17:1-16

  • యోబు జవాబు కొనసాగుతుంది (1-16)

    • “ఎగతాళి చేసేవాళ్లు నన్ను చుట్టుముట్టారు” (2)

    • ‘ఆయన నన్ను సామెతగా చేశాడు’ (6)

    • “సమాధే నా ఇల్లు అవుతుంది” (13)

17  “నా జీవశక్తి* నీరసించిపోయింది, నా రోజులు ముగిసిపోయాయి;సమాధి నాకోసం ఎదురుచూస్తోంది.+   ఎగతాళి చేసేవాళ్లు నన్ను చుట్టుముట్టారు,+నా కన్ను వాళ్ల తిరుగుబాటు స్వభావాన్ని గమనిస్తోంది.   దేవా, దయచేసి నాకు సహాయం చేస్తానని* మాటివ్వు. నువ్వు కాకపోతే ఇంకెవరు నాకు సహాయం చేస్తారు?*+   నువ్వు వాళ్ల హృదయానికి వివేచన దొరకకుండా చేశావు;+అందుకే నువ్వు వాళ్లను హెచ్చించట్లేదు.   ఒకపక్క తన పిల్లల కళ్లు క్షీణిస్తూ ఉంటే,అతను తన స్నేహితుల్ని వాటాలు తీసుకోమని అంటాడు.   ఆయన, దేశదేశాల ప్రజలు నన్ను ఈసడించుకునేలా* చేశాడు,+వాళ్లు నా ముఖం మీద ఉమ్మేస్తున్నారు.+   బాధతో నా కంటిచూపు మందగిస్తోంది,+నా కాళ్లూచేతులు చాలా సన్నబడ్డాయి.   అది చూసి నిజాయితీపరులు ఆశ్చర్యపోతున్నారు,భక్తిహీనుల్ని* చూసి నిర్దోషులు కలవరపడుతున్నారు.   నీతిమంతుడు తన దారిని అంటిపెట్టుకునే ఉంటాడు,+శుద్ధమైన చేతులు గలవాడు ఇంకా బలవంతుడౌతాడు.+ 10  అయినా మీరంతా వచ్చి మీ వాదనను కొనసాగించవచ్చు,ఎందుకంటే, మీలో తెలివిగలవాళ్లు ఒక్కరూ నాకు కనిపించలేదు.+ 11  నా రోజులు ముగిసిపోయాయి;+నా ప్రణాళికలు, నా హృదయ కోరికలు నాశనమైపోయాయి.+ 12  వాళ్లు రాత్రి స్థానంలో పగలును పెడుతూ,‘కాసేపట్లో వెలుగు రాబోతుంది, ఎందుకంటే ఇప్పుడు చీకటిగా ఉంది కదా’ అంటారు. 13  ఇంకాసేపు వేచివుంటే సమాధే* నా ఇల్లు అవుతుంది;+నేను చీకట్లో నా పరుపు వేసుకుంటాను.+ 14  గోతితో,* ‘నువ్వే నా తండ్రివి!’ అని,+ పురుగుతో, ‘నువ్వే నా తల్లివి, సహోదరివి!’ అని అంటాను. 15  నాకు ఇక ఆశ ఎక్కడుంది?+ నాకు మంచి జరుగుతుందని ఎవరికి అనిపిస్తుంది? 16  మనమంతా కలిసి మట్టికి చేరినప్పుడు,+అది* సమాధి* అడ్డగడియల దగ్గరికి దిగిపోతుంది.”

అధస్సూచీలు

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “హామీగా ఉంటానని.”
లేదా “హామీగా ఉంటారు?”
లేదా “నా మీద సామెత చెప్పుకునేలా.”
లేదా “మతభ్రష్టుల్ని.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “సమాధితో.”
అంటే, నా ఆశ.
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.