యోబు 16:1-22

  • యోబు జవాబు (1-22)

    • “మీరు నన్ను ఓదార్చే బదులు నా బాధను పెంచుతున్నారు!” (2)

    • దేవుడు తనను గురిగా పెట్టుకున్నాడని చెప్పడం (12)

16  అప్పుడు యోబు ఇలా అన్నాడు:  2  “నేను ఇలాంటివి చాలా విన్నాను. మీరు నన్ను ఓదార్చే బదులు నా బాధను పెంచుతున్నారు!+  3  వ్యర్థమైన మాటలకు అంతే లేదా? నువ్వు* ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?  4  నేనూ మీలా మాట్లాడగలను. మీరు నా స్థానంలో ఉంటేనేనూ మిమ్మల్ని విమర్శించగలను,మిమ్మల్ని చూసి తల ఆడించగలను.+  5  కానీ నేనలా చేయను.బదులుగా నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను, నా ఓదార్పు మాటలు మీకు ఉపశమనాన్నిస్తాయి.+  6  నేను మాట్లాడినా, నా బాధ పోదు,+మాట్లాడడం ఆపినా, నా బాధ తగ్గదు.  7  కానీ ఇప్పుడు ఆయన నన్ను అలసిపోయేలా చేశాడు;+నా ఇంటివాళ్లందర్నీ నాశనం చేశాడు.  8  అంతేకాదు నువ్వు నన్ను పట్టుకున్నావు, ప్రజలు దాన్ని చూశారు;కాబట్టి బక్కచిక్కిన నా శరీరమే నాకు వ్యతిరేకంగా లేచి, నా ముఖం మీదే సాక్ష్యం చెప్తోంది.  9  ఆయన కోపంతో నన్ను ముక్కలుముక్కలుగా చీల్చేశాడు, నా మీద పగ పెంచుకుంటున్నాడు.+ నన్ను చూసి పళ్లు కొరుకుతున్నాడు. నా శత్రువు తన కంటి చూపుతో నన్ను పొడుస్తున్నాడు.+ 10  వాళ్లు నన్ను మింగడానికి పెద్దగా నోరు తెరిచారు,+ఎగతాళి చేస్తూ నా చెంపల మీద కొట్టారు;పెద్దసంఖ్యలో నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు.+ 11  దేవుడు నన్ను యువకుల మూకకు అప్పగిస్తున్నాడు,దుష్టుల చేతుల్లోకి నెడుతున్నాడు.+ 12  హాయిగా ఉన్న నన్ను ఆయన ముక్కలుముక్కలు చేశాడు;+నా మెడ పట్టుకుని నన్ను నలగ్గొట్టాడు;నన్ను తన గురిగా పెట్టుకున్నాడు. 13  ఆయన విలుకాండ్రు నన్ను చుట్టుముడుతున్నారు;+ఆయన నా మూత్రపిండాల్ని పొడిచాడు,+ నా మీద ఏమాత్రం కనికరపడట్లేదు;నా పైత్యరసాన్ని నేలమీద పారబోస్తున్నాడు. 14  గోడను బద్దలు కొట్టినట్టు, ఆయన నన్ను పదేపదే విరగ్గొడుతున్నాడు;యోధునిలా నామీదికి దూసుకొస్తున్నాడు. 15  నా చర్మాన్ని కప్పుకోవడానికి నేను గోనెపట్ట కుట్టుకున్నాను,+నా ఘనతను* మట్టిలో పాతిపెట్టాను.+ 16  ఏడ్చీఏడ్చీ నా ముఖం ఎర్రబడింది,+నా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు* ఏర్పడ్డాయి, 17  నా చేతులు ఏ దౌర్జన్యం చేయకపోయినా,నా ప్రార్థన స్వచ్ఛంగా ఉన్నా నాకీ పరిస్థితి వచ్చింది. 18  భూమీ, నా రక్తాన్ని కప్పేయకు!+ నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి! 19  ఇప్పటికీ నా సాక్షి పరలోకంలో ఉన్నాడు;నా తరఫున సాక్ష్యమిచ్చే వ్యక్తి ఎత్తైన స్థలాల్లో ఉన్నాడు. 20  నేను దేవుని ముందు కన్నీళ్లు విడుస్తూ ఉంటే,*+నా సహచరులేమో నన్ను ఎగతాళి చేస్తున్నారు.+ 21  మనిషికీ, మనిషికీ మధ్య ఉన్నట్టు,నాకూ, దేవునికీ మధ్య ఒక మధ్యవర్తి ఉండాలి.+ 22  కొన్ని సంవత్సరాలు గడిచాకనేను తిరిగిరాలేని దారిలో వెళ్లిపోతాను.+

అధస్సూచీలు

అంటే, ఎలీఫజు.
లేదా “బలాన్ని.” అక్ష., “కొమ్మును.”
లేదా “మరణఛాయ.”
లేదా “నా కళ్లు నిద్రలేకుండా దేవుని వైపు చూస్తూ ఉంటే” అయ్యుంటుంది.