యోబు 12:1-25

  • యోబు జవాబు (1-25)

    • “నేను మీకన్నా తక్కువవాణ్ణేం కాదు” (3)

    • ‘నన్ను చూసి నవ్వుకుంటున్నారు’ (4)

    • ‘తెలివి దేవుని దగ్గర ఉంది’ (13)

    • దేవుడు న్యాయమూర్తులు, రాజుల కన్నా గొప్పవాడు (17, 18)

12  అప్పుడు యోబు ఇలా అన్నాడు:   “నిజంగా, అన్నీ మీకే తెలుసు,తెలివి మీతోపాటే అంతరించిపోతుంది!   అయితే నాకు కూడా అవగాహన ఉంది. నేను మీకన్నా తక్కువవాణ్ణేం కాదు. ఈ విషయాలు తెలియని వాళ్లెవరు?   జవాబు కోసం దేవునికి మొరపెట్టుకుంటున్న+ నన్ను చూసినా సహచరులు నవ్వుకుంటున్నారు.+ నీతిమంతుణ్ణి, నిందలేనివాణ్ణి చూసి అంతా నవ్వుకుంటారు.   నిశ్చింతగా ఉన్నవాళ్లు విపత్తును హేళన చేస్తారు,అది తడబడేవాళ్ల మీదికే వస్తుందని వాళ్లనుకుంటారు.   దోపిడీ దొంగల డేరాలు నెమ్మదిగా ఉన్నాయి,+దేవునికి కోపం తెప్పించేవాళ్లు క్షేమంగా ఉన్నారు,+వాళ్ల దేవుడు వాళ్ల చేతుల్లోనే ఉన్నాడు.   దయచేసి జంతువుల్ని అడుగు, అవి నీకు ఉపదేశిస్తాయి;ఆకాశపక్షుల్ని అడుగు, అవి నీకు చెప్తాయి.   భూమి గురించి ఆలోచించు,* అది నీకు బోధిస్తుంది;సముద్రంలోని చేపలు నీకు ప్రకటిస్తాయి.   యెహోవా చెయ్యే అవన్నీ చేసిందనివీటిలో దేనికి తెలీదు? 10  ప్రతీ జీవి ప్రాణం, ప్రతీ మనిషి ఊపిరి*ఆయన చేతిలోనే ఉన్నాయి.+ 11  నాలుక* ఆహారాన్ని రుచి చూసినట్టు,చెవి మాటల్ని పరీక్షించదా?+ 12  వృద్ధుల దగ్గర తెలివి ఉంటుంది.+దీర్ఘాయుష్షు వల్ల అవగాహన వస్తుంది. 13  తెలివి, బలం ఆయన దగ్గర ఉన్నాయి,+ఆయన సంకల్పం, అవగాహన గల దేవుడు.+ 14  ఆయన దేన్నైనా పడగొడితే, దాన్ని తిరిగి కట్టడం అసాధ్యం;+ఆయన మూసినదాన్ని ఎవరూ తెరవలేరు. 15  ఆయన వర్షం కురిపించకపోతే, అన్నీ ఎండిపోతాయి;+ఆయన వర్షం కురిపించినప్పుడు, నీళ్లు భూమిని ముంచెత్తుతాయి.+ 16  బలం, తెలివి* ఆయన దగ్గర ఉన్నాయి;+దారితప్పేవాళ్లు, దారి తప్పించేవాళ్లు ఆయన చేతిలో ఉన్నారు; 17  ఆయన, సలహాదారుల్ని వట్టికాళ్లతో నడిపిస్తాడు,*న్యాయమూర్తుల్ని వెర్రివాళ్లను చేస్తాడు.+ 18  రాజుల అధికారాన్ని కొట్టివేసి,+వాళ్లను బానిసలుగా చేస్తాడు. 19  యాజకుల్ని వట్టికాళ్లతో నడిపిస్తాడు,+బలంగా పాతుకుపోయిన వాళ్లను పడదోస్తాడు;+ 20  నమ్మకమైన సలహాదారుల నోళ్లు మూసేస్తాడు,వృద్ధుల* వివేకాన్ని తీసేస్తాడు; 21  ప్రముఖుల్ని అవమానాలపాలు చేస్తాడు,+బలవంతుల్ని బలహీనులుగా చేస్తాడు; 22  చీకట్లోని లోతైన విషయాల్ని వెల్లడిచేస్తాడు,+కటిక చీకటిని వెలుగులోకి తీసుకొస్తాడు; 23  దేశాల్ని గొప్పవిగా చేసి నాశనం చేస్తాడు;దేశాల్ని విస్తరింపజేసి చెరలోకి తీసుకెళ్తాడు. 24  ప్రజల నాయకుల అవగాహనను తీసేసి,వాళ్లు దారులు లేని పనికిరాని ప్రదేశాల్లో తిరిగేలా చేస్తాడు.+ 25  వాళ్లు వెలుగులేని చోట చీకట్లో తడవులాడతారు;+ఆయన వాళ్లను తాగినవాళ్లలా తూలేటట్టు చేస్తాడు.+

అధస్సూచీలు

లేదా “భూమితో మాట్లాడు” అయ్యుంటుంది.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “అంగిలి.”
లేదా “ఆచరణాత్మక తెలివి.”
లేదా “ఏమీ లేనివాళ్లుగా చేస్తాడు.”
లేదా “పెద్దల.”