యోబు 10:1-22
10 “నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది.+
నా బాధంతా నేను వెళ్లగక్కుతాను.
తీవ్రమైన వేదనను బట్టి మాట్లాడతాను!
2 నేను దేవునితో ఇలా అంటాను: ‘నన్ను దోషిగా ప్రకటించకు.
నాతో ఎందుకు పోరాడుతున్నావో చెప్పు.
3 దుష్టుల సలహాను ఆమోదిస్తూనన్ను అణచివేయడం వల్ల,నీ చేతుల పనిని+ నీచంగా చూడడం వల్ల నీకేం వస్తుంది?
4 నీ కళ్లు మనిషి కళ్ల లాంటివా?నువ్వు మనిషి చూసినట్టు చూస్తావా?
5 నీ రోజులు మనిషి రోజుల లాంటివా?నీ సంవత్సరాలు మనిషి సంవత్సరాల లాంటివా?+
6 మరి ఎందుకు నాలో తప్పులు వెదుకుతున్నావు?నా పాపాల కోసం ఎందుకు చూస్తున్నావు?+
7 నేను దోషిని కాదని నీకు తెలుసు;+నీ చేతిలో నుండి ఎవరూ నన్ను కాపాడలేరు.+
8 స్వయంగా నీ చేతులతో రూపొందించి నన్ను తయారుచేశావు,+కానీ ఇప్పుడు నన్ను పూర్తిగా నాశనం చేస్తున్నావు.
9 నువ్వు బంకమట్టితో నన్ను చేశావని+ దయచేసి గుర్తుచేసుకో,అయితే ఇప్పుడు నన్ను తిరిగి మట్టికి చేరేలా చేస్తున్నావు.+
10 నువ్వు పాలలా నన్ను పోశావు కదా?పెరుగులా నన్ను తోడుబెట్టావు కదా?
11 నువ్వు నాకు చర్మాన్ని, మాంసాన్ని బట్టల్లా తొడిగావు,ఎముకలతో, కండరాలతో నన్ను అల్లావు.+
12 నాకు జీవాన్ని ఇచ్చావు, నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించావు;శ్రద్ధతో నా ప్రాణాన్ని* భద్రంగా కాపాడావు.+
13 అయితే నన్నిలా కష్టపెట్టాలని మనసులో అనుకున్నావు.
ఇవన్నీ నువ్వే చేశావని నాకు తెలుసు.
14 ఒకవేళ నేను పాపం చేస్తే, నువ్వు నన్ను గమనిస్తావు,+నా తప్పును క్షమించవు.
15 నేను దోషినైతే, నాకు శ్రమ!ఒకవేళ నేను నిర్దోషినే అయినా, నా తల ఎత్తుకోలేను,+
ఎందుకంటే అవమానాలు, కష్టాలు నన్ను ముంచెత్తుతున్నాయి.+
16 ఒకవేళ నేను తల ఎత్తితే, నువ్వు సింహంలా నన్ను వేటాడతావు+మళ్లీ నామీద నీ శక్తిని ప్రదర్శిస్తావు.
17 నాకు వ్యతిరేకంగా కొత్తకొత్త సాక్షుల్ని తీసుకొస్తావు,నామీద ఇంకా ఎక్కువ కోపం చూపిస్తావు;
ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు నన్ను ముంచెత్తుతున్నాయి.
18 అసలు నన్ను తల్లి గర్భంలో నుండి ఎందుకు బయటికి తీసుకొచ్చావు?+
ఏ కన్నూ నన్ను చూడకముందే నేను చనిపోయుంటే బావుండేది!
19 అప్పుడు నేను ఉనికిలోకే రానట్టు ఉండేది;తల్లి గర్భం నుండి నేరుగా నన్ను సమాధికి తీసుకెళ్లేవాళ్లు.’
20 నా రోజులు ఏపాటివి?+ ఆయన నన్నిలా వదిలేయాలి;ఆయన తన కళ్లను నా మీద నుండి పక్కకు తిప్పుకోవాలి, అప్పుడు నాకు కాస్త ఉపశమనం* దొరుకుతుంది.+
21 ఎందుకంటే, త్వరలోనే నేను తిరిగిరాని చోటికి,+కటిక చీకటి* ఉన్న దేశానికి వెళ్లిపోతాను,+
22 గాఢాంధకారం కమ్ముకున్న దేశానికి,కారుచీకటిగా, అస్తవ్యస్తంగా ఉన్న దేశానికి వెళ్లిపోతాను.అక్కడ వెలుగు కూడా చీకటిలా ఉంటుంది.”
అధస్సూచీలు
^ లేదా “ఊపిరిని.” పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “సంతోషం.”
^ లేదా “చీకటి, మరణఛాయ.”