యెహోషువ 19:1-51

  • షిమ్యోను గోత్రానికి వచ్చిన భూమి (1-9)

  • జెబూలూను గోత్రానికి వచ్చిన భూమి (10-16)

  • ఇశ్శాఖారు గోత్రానికి వచ్చిన భూమి (17-23)

  • ఆషేరు గోత్రానికి వచ్చిన భూమి (24-31)

  • నఫ్తాలి గోత్రానికి వచ్చిన భూమి (32-39)

  • దాను గోత్రానికి వచ్చిన భూమి (40-48)

  • యెహోషువకు వచ్చిన భూమి (49-51)

19  తర్వాత రెండో చీటి వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం షిమ్యోనుకు అంటే షిమ్యోను గోత్రానికి+ వచ్చింది. వాళ్లకు వారసత్వంగా వచ్చిన భూమి యూదా భూభాగంలో ఉంది.+  వాళ్లకు వారసత్వంగా వచ్చినవి ఏవంటే: షేబతోపాటు బెయేర్షెబా,+ మోలాదా,+  హజర్షువలు,+ బాలా, ఎజెము,+  ఎల్తోలదు, బేతూలు, హోర్మా,  సిక్లగు,+ బేత్‌-మర్కాబోతు, హజర్సూసా,  బేత్‌-లెబాయోతు,+ షారూహెను; మొత్తం 13 నగరాలు, వాటి పల్లెలు.  అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను;+ నాలుగు నగరాలు, వాటి పల్లెలు.  వాటితోపాటు బాలత్బెయేరు, అంటే దక్షిణపు రామా వరకు ఉన్న వీటి చుట్టుపక్కల పల్లెలన్నీ. వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం షిమ్యోను గోత్రానికి వారసత్వంగా వచ్చిన భూమి ఇది.  షిమ్యోను వంశస్థులకు వారసత్వంగా వచ్చిన భూమి యూదాకు కేటాయించిన భూమిలో నుండి తీసుకోబడింది. ఎందుకంటే యూదాకు వాటాగా వచ్చిన భూమి వాళ్లకు చాలా ఎక్కువైంది. అందుకే షిమ్యోను వంశస్థులు యూదా భూభాగంలోనే భూమిని పొందారు.+ 10  తర్వాత మూడో చీటి+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం జెబూలూను వంశస్థులకు+ వచ్చింది, వాళ్లకు వారసత్వంగా వచ్చిన భూమి సరిహద్దు శారీదు వరకు విస్తరించింది. 11  వాళ్ల సరిహద్దు పైకి పడమటి దిశలో మరలా వరకు వెళ్లి, దబ్బాషతు మీదుగా యొక్నెయాము ఎదుట ఉన్న లోయకు* విస్తరించింది. 12  తర్వాత అది శారీదు నుండి సూర్యోదయ దిశలో తూర్పు వైపుగా కిస్లోత్తాబోరు పొలిమేరల వరకు సాగి, అక్కడి నుండి దాబెరతుకు,+ తర్వాత పైకి యాఫీయ వరకు వ్యాపించింది. 13  అది తూర్పు వైపుగా సూర్యోదయ దిక్కులో గత్‌-హెపెరు+ వరకు సాగి, ఇత్కాచీను, రిమ్మోను మీదుగా నేయా వరకు విస్తరించింది. 14  ఉత్తరం వైపు సరిహద్దు చుట్టూ తిరిగి హన్నాతోనుకు వెళ్లి, యిప్తాయేలు లోయ దగ్గర ఆగింది. 15  వాటితో పాటు కట్టాతు, నహలాలు, షిమ్రోను,+ ఇదలా, బేత్లెహేము;+ మొత్తం 12 నగరాలు, వాటి పల్లెలు. 16  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం జెబూలూను వంశస్థులు+ వారసత్వంగా పొందిన భూమి ఇది. ఈ నగరాలు, వాటి పల్లెలు వాళ్లకు వచ్చాయి. 17  నాలుగో చీటి+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఇశ్శాఖారుకు+ అంటే ఇశ్శాఖారు వంశస్థులకు వచ్చింది. 18  వాళ్ల సరిహద్దు యెజ్రెయేలు,+ కెసుల్లోతు, షూనేము,+ 19  హపరాయిము, షీయోను, అనహరాతు, 20  రబ్బీతు, కిష్యోను, అబెసు, 21  రెమెతు, ఏన్గన్నీము,+ ఏన్హద్దా, బేత్‌-పస్సెసు వరకు ఉంది. 22  ఆ సరిహద్దు తాబోరు,+ షహచీమా, బేత్షెమెషు వరకు వెళ్లింది. వాళ్ల సరిహద్దు యొర్దాను దగ్గర ఆగిపోయింది; మొత్తం 16 నగరాలు, వాటి పల్లెలు. 23  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రంవాళ్లు+ వారసత్వంగా పొందిన భూమి ఇది. ఈ నగరాలు, వాటి పల్లెలు వాళ్లకు వచ్చాయి. 24  తర్వాత ఐదో చీటి+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఆషేరు గోత్రానికి+ వచ్చింది. 25  వాళ్ల సరిహద్దు హెల్కతు,+ హలి, బెతెను, అక్షాపు, 26  అలమ్మేలెకు, అమాదు, మిషెయలు వరకు ఉంది. అది పడమటి వైపు కర్మెలు+ వరకు, షీహోర్లిబ్నాతు వరకు వ్యాపించింది. 27  అది వెనక్కి తూర్పు వైపుగా బేత్‌-దాగోనుకు వెళ్లి జెబూలూను సరిహద్దును, యిప్తాయేలు లోయ ఉత్తరం వైపును తాకుతూ బేతేమెకు, నెయీయేలు వరకు సాగి కాబూల్‌ ఎడమవైపుకు విస్తరించి, 28  ఎబ్రోను, రెహోబు, హమ్మోను, కానా మీదుగా మహా సీదోను+ వరకు వ్యాపించింది. 29  ఆ సరిహద్దు వెనక్కి వచ్చి రామా మీదుగా ప్రాకారంగల తూరు నగరం+ వరకు విస్తరించింది. ఆ తర్వాత అది వెనక్కి హోసాకు వెళ్లి, అక్జీబు ప్రాంతంలో ఉన్న సముద్రం దగ్గర ఆగిపోయింది. 30  వాటితోపాటు ఉమ్మా, ఆఫెకు,+ రెహోబు;+ మొత్తం 22 నగరాలు, వాటి పల్లెలు. 31  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఆషేరు గోత్రంవాళ్లు+ వారసత్వంగా పొందిన భూమి ఇది. ఈ నగరాలు, వాటి పల్లెలు వాళ్లకు వచ్చాయి. 32  ఆరో చీటి+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం నఫ్తాలి వంశస్థులకు వచ్చింది. 33  వాళ్ల సరిహద్దు హెలెపు దగ్గర, జయనన్నీములోని పెద్ద చెట్టు+ దగ్గర మొదలై అదామెనెకెబు, యబ్నెయేలు మీదుగా లక్కూము వరకు విస్తరించింది; అది యొర్దాను దగ్గర ఆగిపోయింది. 34  ఆ సరిహద్దు వెనక్కి పడమటి వైపుగా అజ్నోత్తాబోరుకు వెళ్లి అక్కడి నుండి హుక్కోకు వరకు విస్తరించింది. అది దక్షిణం వైపు జెబూలూనును, పడమటి వైపు ఆషేరును, తూర్పు వైపు యొర్దాను దగ్గర యూదాను తాకింది. 35  ప్రాకారాలుగల వాళ్ల నగరాలు ఏవంటే: జిద్దీము, జేరు, హమాతు,+ రక్కతు, కిన్నెరెతు, 36  అదామా, రామా, హాసోరు,+ 37  కెదెషు,+ ఎద్రెయి, ఏన్హాసోరు, 38  ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేతనాతు, బేత్షెమెషు;+ మొత్తం 19 నగరాలు, వాటి పల్లెలు. 39  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం నఫ్తాలి గోత్రంవాళ్లు వారసత్వంగా పొందిన భూమి ఇది. ఈ నగరాలు, వాటి పల్లెలు వాళ్లకు వచ్చాయి. 40  ఏడో చీటి వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం దాను గోత్రానికి+ వచ్చింది. 41  వాళ్లు వారసత్వంగా పొందిన భూమి సరిహద్దు జొర్యా,+ ఎష్తాయోలు, ఇర్షెమెషు, 42  షెయల్బీను, అయ్యాలోను,+ ఇత్లా, 43  ఏలోను, తిమ్నా, ఎక్రోను,+ 44  ఎత్తెకే, గిబ్బెతోను,+ బాలాతు, 45  యెహుదు, బెనేబెరకు, గత్రిమ్మోను,+ 46  మేయర్కోను, రక్కోను; యొప్పే+ ఎదుట ఉన్న సరిహద్దు. 47  అయితే, దాను గోత్రానికి ఇచ్చిన ప్రాంతం వాళ్లకు చాలా ఇరుకైపోయింది.+ కాబట్టి వాళ్లు లెషెము+ మీదికి యుద్ధానికి వెళ్లి దాన్ని ఆక్రమించుకొని కత్తితో దానిలోని ప్రజల్ని చంపారు. తర్వాత వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని దానిలో స్థిరపడ్డారు. వాళ్లు ఆ నగరానికి తమ పూర్వీకుడైన దాను పేరు పెట్టారు. వాళ్లు దాని పేరును లెషెము నుండి దానుగా మార్చారు. 48  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం దాను గోత్రంవాళ్లు వారసత్వంగా పొందిన భూమి ఇది. ఈ నగరాలు, వాటి పల్లెలు వాళ్లకు వచ్చాయి. 49  ఆ విధంగా వాళ్లు, స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేశాన్ని ప్రాంతాలుగా విభజించే పని పూర్తిచేశారు. తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు తమ మధ్య స్వాస్థ్యాన్ని ఇచ్చారు. 50  యెహోవా ఆదేశించినట్టు, వాళ్లు అతను అడిగిన నగరాన్ని, అంటే ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో ఉన్న తిమ్నత్సెరహు+ నగరాన్ని అతనికి ఇచ్చారు. అతను ఆ నగరాన్ని మళ్లీ కట్టి అందులో స్థిరపడ్డాడు. 51  షిలోహులో+ యెహోవా ఎదుట, ప్రత్యక్ష గుడారపు+ ప్రవేశ ద్వారం దగ్గర యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల పెద్దలు చీట్లు వేసి పంచి ఇచ్చిన స్వాస్థ్యాలు ఇవే. అలా వాళ్లు దేశాన్ని పంచిపెట్టడం పూర్తి చేశారు.

అధస్సూచీలు

లేదా “వాగుకు.”