యెహెజ్కేలు 48:1-35

  • దేశాన్ని విభాగించడం (1-29)

  • నగరం 12 ద్వారాలు (30-35)

    • నగరం పేరు “యెహోవా అక్కడ ఉన్నాడు” (35)

48  “ఇవి, ఉత్తర కొనతో మొదలుపెట్టి గోత్రాల పేర్లు: దాను భూభాగం+ హెత్లోను మార్గం మీదుగా లెబో-హమాతు* వరకు,+ హసరేనాను వరకు, హమాతు+ పక్కన ఉత్తరం వైపు దమస్కు సరిహద్దు వరకు ఉంటుంది; అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  ఆషేరు భూభాగం+ దాను సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  నఫ్తాలి భూభాగం+ ఆషేరు సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  మనష్షే భూభాగం+ నఫ్తాలి సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  ఎఫ్రాయిము భూభాగం మనష్షే సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  రూబేను భూభాగం ఎఫ్రాయిము సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  యూదా భూభాగం రూబేను ​సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.  యూదా సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు మీరు ఒక కానుకను ప్రత్యేకించాలి. దాని వెడల్పు 25,000 మూరలు* ఉండాలి.+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఈ భూభాగం పొడవు, వేరే గోత్రాల భూభాగాల పొడవుతో సమానంగా ఉంటుంది. దాని మధ్యలో పవిత్రమైన స్థలం* ఉంటుంది.  “మీరు యెహోవా కోసం ప్రత్యేకించాల్సిన కానుక 25,000 మూరల పొడవు, 10,000 మూరల వెడల్పు ఉంటుంది. 10  ఇది యాజకుల కోసం పవిత్రమైన కానుకగా ఉంటుంది.+ ఇది ఉత్తరం వైపు 25,000 మూరలు, దక్షిణం వైపు 25,000 మూరలు, తూర్పు వైపు 10,000 మూరలు, పడమటి వైపు 10,000 మూరలు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా పవిత్రమైన స్థలం ఉంటుంది. 11  ఈ భూభాగం సాదోకు కుమారులైన ప్రతిష్ఠిత యాజకులకు చెందుతుంది;+ ఇశ్రాయేలీయులు, లేవీయులు పక్కదారి పట్టినప్పుడు+ వాళ్లు నన్ను విడిచిపెట్టకుండా నా విషయంలో తమకున్న బాధ్యతల్ని నిర్వర్తించారు. 12  కానుకగా ఇవ్వబడిన భూమిలో లేవీయుల సరిహద్దును ఆనుకొని వాళ్లకు ఒక భూభాగం ఉంటుంది, అది అతి పవిత్రమైనదిగా ప్రత్యేకించబడుతుంది. 13  “యాజకుల ప్రాంతం పక్కనే లేవీయులకు ఒక భూభాగం ఉంటుంది, దాని పొడవు 25,000 మూరలు, వెడల్పు 10,000 మూరలు ఉంటుంది. (దాని మొత్తం పొడవు 25,000 మూరలు, వెడల్పు 10,000 మూరలు.) 14  వాళ్లు దేశంలోని ఈ శ్రేష్ఠమైన భూమిలో కొంచెం కూడా ఎవరికీ అమ్మకూడదు, మార్పిడి చేసుకోకూడదు, బదిలీ చేయకూడదు; ఎందుకంటే అది యెహోవాకు పవిత్రమైనది. 15  “25,000 మూరల సరిహద్దును ఆనుకొని 5,000 మూరల వెడల్పు ఉన్న మిగతా భూమి నగర సాధారణ ఉపయోగం కోసం+ అంటే ఇళ్ల కోసం, మేతస్థలాల కోసం ఉంటుంది. నగరం దాని మధ్యలో ఉంటుంది.+ 16  ఇవి ఆ నగరం కొలతలు: ఉత్తర సరిహద్దు 4,500 మూరలు, దక్షిణ సరిహద్దు 4,500 మూరలు, తూర్పు సరిహద్దు 4,500 మూరలు, పడమటి సరిహద్దు 4,500 మూరలు. 17  నగరం పచ్చిక మైదానం ఉత్తరం వైపు 250 మూరలు, దక్షిణం వైపు 250 మూరలు, తూర్పు వైపు 250 మూరలు, పడమటి వైపు 250 మూరలు ఉంటుంది. 18  “మిగిలిన భూభాగం పొడవు పవిత్రమైన కానుకకు సమానంగా ఉంటుంది,+ అంటే తూర్పు వైపు 10,000 మూరలు, పడమటి వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పవిత్ర​మైన కానుకకు సమానంగా ఉంటుంది, దానిలో పండే పంట ఆ నగరానికి సేవ చేసేవాళ్లకు ఆహారం అవుతుంది. 19  నగరానికి సేవ చేసే ఇశ్రాయేలు గోత్రాల వాళ్లందరూ దీన్ని సాగుచేస్తారు.+ 20  “మొత్తం కానుక 25,000 మూరల పొడవుతో, 25,000 మూరల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంటుంది. మీరు నగర స్వాస్థ్యంతో పాటు దీన్ని పవిత్రమైన కానుకగా ప్రత్యేకించాలి. 21  “పవిత్రమైన కానుకకు, నగర స్వాస్థ్యానికి రెండువైపులా మిగిలిన భూభాగం ప్రధానుడికి చెందుతుంది.+ కానుకకు తూర్పు వైపు, పడమటి వైపు ఉన్న 25,000 మూరల సరిహద్దుల్ని ఆనుకొని అది ఉంటుంది. దాని సరిహద్దు, దాని పక్కనున్న రెండు గోత్రాల సరిహద్దుతో సమానం, అది ప్రధానుడిది అవుతుంది. ఆ భూభాగం మధ్యలో పవిత్రమైన కానుక, మందిర పవిత్రమైన స్థలం ఉంటాయి. 22  “లేవీయుల స్వాస్థ్యం, నగర స్వాస్థ్యం ప్రధానుడికి చెందిన ఈ భూభాగం మధ్యలో ఉంటాయి. ప్రధానుడి ప్రాంతం యూదా సరిహద్దుకు,+ బెన్యామీను సరిహద్దుకు మధ్యలో ఉంటుంది. 23  “మిగతా గోత్రాల విషయానికొస్తే, ​బెన్యామీను భూభాగం తూర్పు సరిహద్దు నుండి ​పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.+ 24  షిమ్యోను భూభాగం బెన్యామీను సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 25  ఇశ్శా​ఖారు భూభాగం+ షిమ్యోను సరిహద్దును ఆనుకొని, తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 26  జెబూలూను భూభాగం ఇశ్శాఖారు సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి ​పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.+ 27  గాదు భూభాగం జెబూలూను సరిహద్దును ఆనుకొని,+ తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 28  దక్షిణ సరిహద్దు గాదు సరిహద్దు మీదుగా తామారు నుండి+ మెరీబాతు-కాదేషు నీళ్ల+ వరకు, అక్కడి నుండి వాగు* వరకు,+ అక్కడి నుండి మహా సముద్రం* వరకు ఉంటుంది. 29  “మీరు ఇశ్రాయేలు గోత్రాలకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వాల్సిన దేశం ఇదే,+ ఇవి వాళ్ల ​భూభాగాలుగా ఉంటాయి”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 30  “నగరం నుండి బయటికి వెళ్లే దారులు ఇవి: ఉత్తర సరిహద్దు 4,500 మూరలు ఉంటుంది.+ 31  “నగర ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టబడతాయి. ఉత్తరం వైపు మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి రూబేను ద్వారం, ఒకటి యూదా ద్వారం, ఒకటి లేవి ద్వారం. 32  “తూర్పు సరిహద్దు 4,500 మూరల పొడవు ఉంటుంది, దానికి మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి యోసేపు ద్వారం, ఒకటి ​బెన్యామీను ద్వారం, ఒకటి దాను ద్వారం. 33  “దక్షిణ సరిహద్దు 4,500 మూరలు ఉంటుంది, దానికి మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి షిమ్యోను ద్వారం, ఒకటి ఇశ్శాఖారు ద్వారం, ఒకటి జెబూలూను ద్వారం. 34  “పడమటి సరిహద్దు 4,500 మూరల పొడవు ఉంటుంది, దానికి మూడు ద్వారాలు ఉంటాయి: ఒకటి గాదు ద్వారం, ఒకటి ఆషేరు ద్వారం, ఒకటి నఫ్తాలి ద్వారం. 35  “దాని చుట్టుకొలత 18,000 మూరలు ఉంటుంది. ఆ రోజు నుండి, ‘యెహోవా అక్కడ ఉన్నాడు’+ అనేది ఆ నగరం పేరుగా ఉంటుంది.”

అధస్సూచీలు

లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
లేదా “ఆలయం.”
అంటే, ఐగుప్తు వాగు.
అంటే, మధ్యధరా సముద్రం.