యెహెజ్కేలు 42:1-20

  • భోజనశాలలు (1-14)

  • ఆలయం నాలుగు వైపుల్ని కొలవడం (15-20)

42  అతను నన్ను ఉత్తరం వైపుగా బయటి ప్రాంగణంలోకి తీసుకొ​చ్చాడు.+ తర్వాత అతను ఖాళీ ప్రదేశం పక్కన, భవనానికి ఉత్తరం వైపున్న+ భోజనశాల+ దగ్గ​రికి నన్ను తీసుకొచ్చాడు.  ఉత్తర ప్రవేశం దగ్గర దాని పొడవు 100 మూరలు,* వెడల్పు 50 మూరలు.  అది లోపలి ప్రాంగణానికీ, బయటి ప్రాంగణం దారికీ మధ్యలో ఉంది. ఈ లోపలి ప్రాంగణం వెడల్పు 20 మూరలు.+ ​భోజనశాల వరండాలు ఒకదానికొకటి ఎదు​రెదురుగా, మూడు అంతస్తుల్లో ఉన్నాయి.  భోజన​శాల గదుల ముందు నడవడానికి ఒక దారి ఉంది;+ దాని వెడల్పు 10 మూరలు, పొడవు 100 మూరలు.* ఆ గదుల గుమ్మాలు ఉత్తరం వైపుకు ఉన్నాయి.  వరండాల వల్ల భవనం పై అంతస్తులో ఉన్న భోజనాల గదులు కింది, మధ్య అంతస్తుల్లో ఉన్న భోజనాల గదుల కన్నా కాస్త ఇరుకుగా ఉన్నాయి.  ఎందుకంటే అవి మూడు అంతస్తుల్లో ఉన్నాయి, కానీ ప్రాంగణాలకు ఉన్నలాంటి స్తంభాలు వాటికి లేవు. అందుకే పై అంతస్తుల్లోని గదులు, కింది అంతస్తుల్లోని గదుల కన్నా తక్కువ స్థలంలో కట్టబడ్డాయి.  బయటి ప్రాంగణం వైపున్న భోజనాల గదుల పక్కన ఉన్న రాతిగోడ 50 మూరల పొడవు ఉంది, ఆ గోడ ఇతర భోజనాల గదులకు ఎదురుగా ఉంది.  ఎందుకంటే, బయటి ప్రాంగణం వైపున్న భోజనాల గదుల వరుస 50 మూరల పొడవు ఉంది, కానీ పవిత్రమైన స్థలం వైపున్న భోజనాల గదుల వరుస 100 మూరల పొడవు ఉంది.  బయటి ప్రాంగణంలో నుండి ఆ భోజనాల గదుల్లోకి రావడానికి వాటికి తూర్పు వైపున ఒక ప్రవేశమార్గం ఉంది. 10  ప్రాంగణం రాతిగోడ లోపలివైపు,* తూర్పున ఖాళీ ప్రదేశానికీ భవనానికీ పక్కన కూడా కొన్ని భోజనాల గదులు ఉన్నాయి.+ 11  ఉత్తరం వైపున్న భోజనాల గదులకు ఉన్నట్టే వాటి ముందు కూడా నడవడానికి ఒక దారి ఉంది.+ వాటి పొడవు, వెడల్పు, బయటికి వెళ్లే దారులు, నమూనాలు కూడా మిగతావాటిలాగే ఉన్నాయి. వాటి ప్రవేశాలు 12  దక్షిణం వైపు గుమ్మాలు ఉన్న భోజనాల గదుల ప్రవేశాల్లా ఉన్నాయి. తూర్పు వైపున, రాతిగోడ ముందున్న దారి ప్రారంభంలో ఒక ప్రవేశమార్గం ఉంది, ​దానిగుండా లోపలికి వెళ్లవచ్చు.+ 13  తర్వాత అతను నాతో ఇలా అన్నాడు: “ఖాళీ ప్రదేశం పక్కన ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఉన్న భోజనాల గదులు+ పవిత్రమైన భోజనాల గదులు. యెహోవాను సమీపించే యాజకులు అక్కడ అతి పవిత్రమైన అర్పణలు తింటారు.+ అది పవిత్రమైన చోటు కాబట్టి వాళ్లు అక్కడ అతి పవిత్రమైన అర్పణల్ని అంటే ధాన్యార్పణల్ని, పాపపరిహారార్థ బలుల్ని, అపరాధ పరిహారార్థ బలుల్ని పెడతారు.+ 14  యాజకులు లోపలికి ప్రవేశించాక, తాము పరిచారం చేస్తున్నప్పుడు వేసుకున్న బట్టలతో పవిత్ర స్థలంలో నుండి బయటి ప్రాంగణంలోకి వెళ్లకూడదు,+ ఎందుకంటే అవి పవిత్రమైన బట్టలు. ప్రజలకు అనుమతి ఉన్న స్థలాల్లోకి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు వేసుకుంటారు.” 15  అతను లోపలి ఆలయ ప్రాంతాన్ని కొలవడం ముగించాక, నన్ను తూర్పు ద్వారం గుండా బయటికి తీసుకొచ్చాడు;+ అతను ఆ ప్రాంతమంతా కొలిచాడు. 16  అతను తూర్పు వైపును కొలకర్రతో* కొలిచాడు. అది ఒకవైపు నుండి ఇంకోవైపు వరకు 500 కొలకర్రల పొడవు ఉంది. 17  అతను ఉత్తరం వైపును కొలకర్రతో కొలిచాడు, అది 500 కొలకర్రల పొడవు ఉంది. 18  అతను దక్షిణం వైపును కొలకర్రతో కొలిచాడు, అది 500 కొలకర్రల పొడవు ఉంది. 19  అతను పడమటి వైపును కొలకర్రతో ​కొలిచాడు, అది 500 కొలకర్రల పొడవు ఉంది. 20  అతను దాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పవిత్రమైన దాన్ని, సాధారణమైన దాన్ని వేరు చేయడానికి+ దాని చుట్టూ ఒక గోడ ఉంది;+ దాని పొడవు 500 కొలకర్రలు, వెడల్పు 500 కొలకర్రలు.+

అధస్సూచీలు

ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
గ్రీకు సెప్టువజింటు ప్రకారం, “100 మూరల పొడవు.” హీబ్రూ మూలపాఠంలో, “ఒక మూర దారి” అని ఉంది. అనుబంధం B14 చూడండి.
అక్ష., “వెడల్పులో.”
అనుబంధం B14 చూడండి.