యెహెజ్కేలు 19:1-14

  • ఇశ్రాయేలు ప్రధానుల గురించి శోకగీతం (1-14)

19  “ఇశ్రాయేలు ప్రధానుల గురించి నువ్వు శోకగీతం పాడుతూ  ఇలా అను: ‘మీ అమ్మ ఎలాంటిది? ఆమె సింహాల మధ్య ఆడసింహం లాంటిది. ఆమె బలమైన కొదమ సింహాల మధ్య పడుకుంది, అక్కడే తన పిల్లల్ని పెంచింది.   ఆమె పెంచిన పిల్లల్లో ఒకటి బలమైన కొదమ సింహం అయింది.+ అది వేటాడడం నేర్చుకుని,చివరికి మనుషుల్ని కూడా మింగేసింది.   జనాలు దాని గురించి విని, దాన్ని తమ గోతిలో చిక్కించుకున్నాయి,దానికి కొక్కేలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లాయి.+   దాని తల్లి దానికోసం ఎదురుచూసీ చూసీ, అది ఇక రాదని గ్రహించి, తన పిల్లల్లో ఇంకొకదాన్ని తీసుకొని, దాన్ని బలమైన కొదమ సింహంలా తయారుచేసింది.   అది కూడా సింహాల మధ్య తిరుగుతూ, బలమైన కొదమ సింహం అయింది. అది వేటాడడం నేర్చుకుని చివరికి ​మనుషుల్ని కూడా మింగేసింది.+   అది వాళ్ల పటిష్ఠమైన బురుజుల మధ్య తిరుగుతూ వాళ్ల నగరాల్ని నాశనం చేసింది,అలా నిర్జనమైన ఆ దేశమంతా దాని ​గర్జనతో నిండిపోయింది.+   చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు దానిమీదికి వచ్చి తమ వలను ​విసిరాయి,అది వాళ్ల గోతిలో చిక్కింది.   వాళ్లు దానికి కొక్కేలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి ​తీసుకెళ్లారు. అక్కడ దాన్ని బంధించి, ఇశ్రాయేలు ​పర్వతాల మీద ఇక దాని స్వరం ​వినిపించకుండా చేశారు. 10  మీ అమ్మ, నీళ్ల పక్కన నాటబడిన ​ద్రాక్షవల్లిలా* ఉండేది.+ నీళ్లు సమృద్ధిగా ఉండడంవల్ల అది ​ఫలించింది, దాని నిండా తీగలు వచ్చాయి. 11  దానికి బలమైన కొమ్మలు వచ్చాయి, అవి పాలకుల రాజదండాలకు తగినవి. అది పెరిగి మిగతా చెట్లకన్నా ఎత్తుగా ​ఎదిగింది,అది ఎత్తుగా ఉండడం వల్ల, దానికి ​విస్తారమైన ఆకులు, కొమ్మలు ఉండడం వల్ల దూరం నుండి కూడా ​కనిపించేది. 12  అయితే అది, కోపంతో పెకిలించబడి+ ​నేలమీదికి విసిరేయబడింది,దాని పండ్లు తూర్పు గాలికి ​వాడిపోయాయి. దాని బలమైన కొమ్మలు తెగిపోయి, ​ఎండిపోయాయి;+ అగ్ని వాటిని ​కాల్చేసింది.+ 13  ఇప్పుడు అది ఎడారిలోనీళ్లులేని, ఎండిపోయిన దేశంలో ​నాటబడింది.+ 14  దాని కొమ్మల నుండి అగ్ని వ్యాపించి, దాని రెమ్మల్ని, పండ్లను కాల్చేసింది;ఒక్క బలమైన కొమ్మ గానీ, ​పరిపాలించడం కోసం రాజదండం గానీ మిగల్లేదు.+ “ ‘ఇది శోకగీతం, ఇది శోకగీతంలా వాడుకలోకి వస్తుంది.’ ”

అధస్సూచీలు

అక్ష., “నీ రక్తంలో ద్రాక్షవల్లిలా.”