యెహెజ్కేలు 15:1-8

  • యెరూషలేము పనికిరాని ద్రాక్షచెట్టు (1-8)

15  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర వేరే చెట్ల కర్ర కన్నా, అడవిలోని చెట్ల కొమ్మల కన్నా శ్రేష్ఠమైనదా?  దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? దాంతో ఎవరైనా వస్తువుల్ని వేలాడదీసే మేకును తయారుచేస్తారా?  ఇదిగో! దాన్ని వంటచెరకుగా అగ్నిలో వేస్తే, దాని రెండు కొనలు నిప్పులో కాలిపోతాయి, దాని మధ్యభాగం మాడిపోతుంది. అప్పుడది దేనికైనా పనికొస్తుందా?  అగ్నిలో వేయకముందే అది ఎందుకూ పనికిరానిదిగా ఉంటే, అగ్ని దాన్ని కాల్చేసి, మాడ్చేసిన తర్వాత అది ఇక దేనికి పనికొస్తుంది?”  “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అడవిలోని చెట్ల మధ్య ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలాగైతే వంటచెరకుగా ఇచ్చానో, యెరూషలేము నివాసుల్ని కూడా అలాగే ఇచ్చాను.+  నేను నా ముఖాన్ని వాళ్లకు వ్యతిరేకంగా తిప్పుకున్నాను. వాళ్లు అగ్ని నుండి తప్పించుకున్నారు, కానీ అగ్ని వాళ్లను కాల్చేస్తుంది. నేను నా ముఖాన్ని వాళ్లకు వ్యతిరేకంగా తిప్పుకున్నప్పుడు, నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”+  “ ‘వాళ్లు నమ్మకద్రోహం చేశారు+ కాబట్టి నేను దేశాన్ని నిర్జనంగా చేస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”

అధస్సూచీలు