యెషయా 63:1-19
63 ఎదోము+ నుండి వస్తున్న ఈయన ఎవరు?రంగురంగుల* వస్త్రాలు వేసుకొని బొస్రా+ నుండి వస్తున్న ఈయన ఎవరు?వైభవోపేతమైన దుస్తులు ధరించిమహాబలంతో నడిచి వస్తున్న ఈయన ఎవరు?
“నీతిగల మాటలు మాట్లాడే నేనే,రక్షించే గొప్పశక్తి గల నేనే.”
2 నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి?నీ వస్త్రాలు ద్రాక్షతొట్టి తొక్కేవాళ్ల వస్త్రాల్లా ఎందుకున్నాయి?+
3 “నేను ఒంటరిగా ద్రాక్షతొట్టి తొక్కాను.
జనాల్లో ఎవ్వరూ నాతోపాటు లేరు.
నేను కోపంతో వాళ్లను తొక్కుతూ ఉన్నాను,ఆగ్రహంతో వాళ్లను తొక్కేస్తూ ఉన్నాను.+
వాళ్ల రక్తం నా వస్త్రాల మీద చిమ్మింది,దాంతో వాటన్నిటికీ మరకలు అయ్యాయి.
4 ఎందుకంటే ప్రతీకారం తీర్చుకునే రోజును నేను నిర్ణయించాను,+వీళ్లను తిరిగి కొనే సంవత్సరం వచ్చేసింది.
5 నేను చూశాను, కానీ సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరు;మద్దతు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను.
కాబట్టి నా బాహువే రక్షణను* తీసుకొచ్చింది,+నా ఆగ్రహమే నాకు మద్దతు ఇచ్చింది.
6 నా కోపంలో జనాల్ని తొక్కాను,నా ఆగ్రహంతో వాళ్లను మత్తిల్లజేశాను,+వాళ్ల రక్తాన్ని నేలమీద ఒలికించాను.”
7 యెహోవా మా కోసం చేసిన వాటన్నిటిని బట్టి,+విశ్వసనీయ ప్రేమతో యెహోవా చేసిన కార్యాల్ని నేను ప్రకటిస్తాను,యెహోవాను స్తుతిస్తాను.తన కరుణ వల్ల, తన గొప్ప విశ్వసనీయ ప్రేమ వల్లఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఎన్నో మేలులు చేశాడు.
8 ఎందుకంటే ఆయన, “వాళ్లు నా ప్రజలు, నా పిల్లలు, ఎప్పటికీ నమ్మకద్రోహం చేయరు”+ అనుకున్నాడు.
వాళ్లకు రక్షకుడు అయ్యాడు.+
9 వాళ్ల బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు.+
ఆయన సన్నిధి దూత* వాళ్లను రక్షించాడు.+
తన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన వాళ్లను తిరిగి కొన్నాడు,+పాత రోజులన్నిట్లో వాళ్లను ఎత్తుకొని మోస్తూ వచ్చాడు.+
10 కానీ వాళ్లు తిరుగుబాటు చేశారు,+ ఆయన పవిత్రశక్తిని దుఃఖపెట్టారు.+
దాంతో ఆయన వాళ్లకు శత్రువు అయ్యాడు,+వాళ్లతో పోరాడాడు.+
11 అప్పుడు వాళ్లు పాత రోజుల్ని,అంటే ఆయన సేవకుడైన మోషే రోజుల్ని గుర్తుచేసుకొని ఇలా అన్నారు:
“తన ప్రజల కాపరులతో పాటు+ వాళ్లను సముద్రం గుండా బయటికి తీసుకొచ్చిన దేవుడు+ ఎక్కడ?
అతనిలో తన పవిత్రశక్తిని ఉంచిన దేవుడు+ ఎక్కడ?
12 మోషే కుడిచేతితో పాటు మహిమగల తన బాహువును పంపించిన దేవుడు+ ఎక్కడ?తనకు శాశ్వతమైన పేరు కలిగేలా+వాళ్ల ముందు నీళ్లను పాయలుగా చేసిన దేవుడు+ ఎక్కడ?
13 మైదానంలో గుర్రం నడిచినట్టువాళ్లు తొట్రుపడకుండా నడిచివెళ్లేలాఉప్పొంగే* జలాల గుండా వాళ్లను నడిపించిన దేవుడు ఎక్కడ?
14 లోయ మైదానంలోకి వెళ్లినప్పుడు పశువులు విశ్రాంతి తీసుకున్నట్టుయెహోవా పవిత్రశక్తి వాళ్లకు విశ్రాంతినిచ్చింది.”+
నీకు ఘనమైన* పేరు తెచ్చుకోవడానికి+నీ ప్రజల్ని నువ్వు అలా నడిపించావు.
15 పరలోకం నుండి, అంటే పవిత్రమైన, మహిమాన్వితమైన*నీ ఉన్నత నివాసం నుండి చూడు.
నీ ఆసక్తి, నీ గొప్ప బలం ఏమయ్యాయి?నీ కనికరం, నీ కరుణ+ నిన్ను కదిలించట్లేదా?+
నా మీద నువ్వు వాటిని చూపించట్లేదు.
16 ఎంతైనా నువ్వే మా తండ్రివి;+అబ్రాహాముకు మేము తెలియకపోయినా,ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తుపట్టకపోయినాయెహోవా, నువ్వే మా తండ్రివి.
ప్రాచీనకాలం నుండి మా విమోచకుడు అనే పేరు నీకుంది.+
17 యెహోవా, నీ మార్గాల నుండి మమ్మల్ని ఎందుకు తప్పిపోనిస్తున్నావు?*
నీకు భయపడకుండా ఉండేలా మా హృదయాల్ని ఎందుకు కఠినం కానిస్తున్నావు?*+
నీ సేవకుల కోసం,నీ స్వాస్థ్యపు గోత్రాల కోసం తిరిగి రా.+
18 అది నీ పవిత్ర ప్రజల స్వాధీనంలో కొంతకాలం పాటే ఉంది.
మా శత్రువులు నీ పవిత్రమైన స్థలాన్ని తొక్కారు.+
19 మేము చాలా ఎక్కువకాలం పాటు,నువ్వు ఎప్పుడూ పరిపాలించని ప్రజల్లా, నీ పేరుతో పిలవబడని ప్రజల్లా ఉన్నాం.
అధస్సూచీలు
^ లేదా “ముదురు ఎరుపు” అయ్యుంటుంది.
^ లేదా “విజయాన్ని.”
^ లేదా “వ్యక్తిగత సందేశకుడు.”
^ లేదా “అగాధ.”
^ లేదా “సుందరమైన.”
^ లేదా “సుందరమైన.”
^ లేదా “తప్పిపోయేలా చేస్తున్నావు?”
^ అక్ష., “చేస్తున్నావు?”