యెషయా 62:1-12

  • సీయోను కొత్త పేరు (1-12)

62  సీయోను నీతి తేజోవంతమైన వెలుగులా ప్రకాశించేవరకు,+దాని రక్షణ కాగడాలా మండేవరకు+దాని విషయంలో నేను మౌనంగా ఉండను,+యెరూషలేము విషయంలో నేను ఊరుకోను.  2  “ఓ స్త్రీ, దేశాలు నీ నీతిని చూస్తాయి,+రాజులందరూ నీ మహిమను చూస్తారు.+ యెహోవా స్వయంగా తన నోటితో పెట్టినకొత్త పేరుతో నువ్వు పిలవబడతావు.+  3  నువ్వు యెహోవా చేతిలో సౌందర్య కిరీటంలా,నీ దేవుని అరచేతిలో రాచ తలపాగాలా ఉంటావు.  4  ఇకమీదట నువ్వు వదిలేయబడిన స్త్రీ అని పిలవబడవు,+నీ దేశం నిర్జన ప్రదేశమని పిలవబడదు.+ నువ్వు, ‘దానిలోనే నా సంతోషం ఉంది’ అనే పేరుతో పిలవబడతావు,+నీ దేశం ‘వివాహిత’ అని పిలవబడుతుంది. ఎందుకంటే యెహోవా నిన్ను బట్టి సంతోషిస్తాడు,నీ దేశం వివాహమైన స్త్రీలా ఉంటుంది.  5  యువకుడు కన్యను పెళ్లిచేసుకున్నట్టునీ నివాసులు నిన్ను పెళ్లిచేసుకుంటారు. పెళ్లికుమారుడు పెళ్లికూతురి విషయంలో సంతోషించినట్టునీ దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు.+  6  యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలివాళ్లను నిలబెట్టాను. పగలైనా, రాత్రైనా ఒక్క నిమిషం కూడా వాళ్లు మౌనంగా ఉండకూడదు. యెహోవాను స్తుతించే ప్రజలారా,విశ్రమించకండి,  7  ఆయన యెరూషలేమును స్థిరంగా స్థాపించేవరకు,అవును, దాన్ని భూమికి స్తుతిగా చేసేవరకు+ ఆయనకు ఏమాత్రం విశ్రాంతినివ్వకండి.”  8  యెహోవా తన కుడిచేతితో, తన బలమైన బాహువుతో ఒట్టేసి ఇలా ప్రమాణం చేశాడు: “ఇకమీదట నేను మీ ధాన్యాన్ని మీ శత్రువులకు ఆహారంగా ఇవ్వను,మీరు ఎంతో కష్టపడి తయారుచేసుకున్న కొత్త ద్రాక్షారసాన్ని పరదేశులు తాగరు.+  9  ఎవరైతే ధాన్యాన్ని సమకూర్చారో వాళ్లే దాన్ని తిని యెహోవాను స్తుతిస్తారు;ద్రాక్షారసాన్ని సమకూర్చిన వాళ్లే దాన్ని నా పవిత్ర ప్రాంగణాల్లో తాగుతారు.”+ 10  రండి, నగర ద్వారాల గుండా రండి. ప్రజల కోసం దారిని సిద్ధం చేయండి.+ ఎత్తు చేయండి, రహదారిని ఎత్తు చేయండి. దాని మీదున్న రాళ్లను తీసేయండి.+ జనాల కోసం ధ్వజాన్ని* నిలబెట్టండి.+ 11  ఇదిగో! భూమి అంచుల్లో ఉన్న ప్రజలకు యెహోవా ఇలా చాటించాడు: “సీయోను కూతురుకు ఇలా చెప్పండి:‘ఇదిగో! నీ రక్షణ వస్తోంది.+ ఇదిగో! ఆయనిచ్చే ప్రతిఫలం ఆయన దగ్గరే ఉంది,ఆయనిచ్చే జీతం ఆయన ముందే ఉంది.’ ”+ 12  వాళ్లు పవిత్రమైన ప్రజలు అని, యెహోవా తిరిగి కొన్నవాళ్లు+ అని పిలవబడతారు,నువ్వేమో ‘కోరదగినది’ అని, ‘వదిలేయబడని నగరం’+ అని పిలవబడతావు.

అధస్సూచీలు

లేదా “ధ్వజస్తంభాన్ని.”