యెషయా 60:1-22

  • సీయోను మీద యెహోవా మహిమ ప్రకాశిస్తుంది (1-22)

    • గూళ్లకు చేరుకుంటున్న పావురాల్లా (8)

    • రాగికి బదులు బంగారం (17)

    • అల్పుడు వెయ్యిమంది అవుతాడు (22)

60  “ఓ స్త్రీ, లే!+ లేచి వెలుగు ప్రసరించు, ఎందుకంటే నీకు వెలుగు వచ్చేసింది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తోంది.+   ఇదిగో! చీకటి భూమిని కమ్ముకుంటుంది,కటిక చీకటి దేశాల్ని కప్పేస్తుంది;అయితే యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు,ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.   దేశాలు నీ వెలుగు దగ్గరికి వస్తాయి,+తేజోవంతమైన నీ వైభవం* దగ్గరికి రాజులు+ వస్తారు.+   తల ఎత్తి నీ చుట్టూ చూడు! వాళ్లంతా సమకూర్చబడ్డారు; వాళ్లు నీ దగ్గరికే వస్తున్నారు. నీ కుమారుల్ని చాలా దూరం నుండి తీసుకొస్తున్నారు,+ నీ కూతుళ్లను చంకనెత్తుకొని తీసుకొస్తున్నారు.+   ఆ సమయంలో నువ్వు చూసినదాన్ని బట్టి నీ ముఖం వెలిగిపోతుంది,+నీ గుండె కొట్టుకుంటుంది, ఉప్పొంగుతుంది,ఎందుకంటే, సముద్ర సంపద నీ వైపు తరలించబడుతుంది;దేశాల వనరులు నీ దగ్గరికి వస్తాయి.+   ఒంటెల సమూహాలు,మిద్యాను, ఏయిఫా+ దేశాల లేత మగ ఒంటెలు నీ దేశాన్ని* కప్పేస్తాయి. షేబ దేశ వాసులంతా వస్తారు;వాళ్లు బంగారాన్ని, సాంబ్రాణిని తీసుకొస్తారు. వాళ్లు బహిరంగంగా యెహోవాకు స్తుతులు చెల్లిస్తారు.+   కేదారు+ మందలన్నీ నీ దగ్గరికి సమకూర్చబడతాయి. నెబాయోతు+ పొట్టేళ్లు నీకు సేవలు చేస్తాయి. అవి నా బలిపీఠం మీదికి వస్తాయి, ఆమోదించబడతాయి,+నేను నా మహిమాన్విత* మందిరాన్ని అందంగా చేస్తాను.+   మేఘాల్లా, గూళ్లకు* చేరుకుంటున్న పావురాల్లాఎగురుకుంటూ వస్తున్న వీళ్లు ఎవరు?   ద్వీపాలు నా మీద ఆశపెట్టుకుంటాయి;తర్షీషు ఓడలు ముందు వరుసలో ఉన్నాయి,*వాళ్లు నీ దేవుడైన యెహోవా పేరును, ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి స్తుతించడానికితమ వెండిబంగారాలతో పాటుదూరం నుండి నీ కుమారుల్ని తీసుకొస్తున్నారు;+ఎందుకంటే ఆయన నిన్ను మహిమపరుస్తాడు.*+ 10  పరదేశులు నీ ప్రాకారాల్ని కడతారు,వాళ్ల రాజులు నీకు పరిచారం చేస్తారు.+ఎందుకంటే కోపంలో నేను నిన్ను కొట్టాను,కానీ దయతో నీ మీద కరుణ చూపిస్తాను.+ 11  నీ నగర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి;+దేశాల వనరుల్ని నీ దగ్గరికి తీసుకొచ్చేలాపగలు గానీ, రాత్రి గానీ అవి మూయబడవు,వాళ్ల రాజులు ముందుండి వాటిని తీసుకొస్తారు.+ 12  నిన్ను సేవించని ఏ దేశమైనా, రాజ్యమైనా నాశనమౌతుంది,ఆ దేశాలు సర్వనాశనమౌతాయి.+ 13  నా పవిత్రమైన స్థలాన్ని అందంగా చేయడానికిలెబానోను మహిమ నీ దగ్గరికి వస్తుంది,+సరళవృక్షం, యాష్‌ చెట్టు, తమాల వృక్షం కలిసి వస్తాయి;+నేను నా పాదస్థలాన్ని మహిమపరుస్తాను.+ 14  నిన్ను బాధించినవాళ్ల కుమారులు వచ్చి నీ ముందు వంగి నమస్కారం చేస్తారు;నీ మీద గౌరవం లేనట్టు ప్రవర్తించే వాళ్లంతా నీ పాదాల మీద పడతారు,వాళ్లు నిన్ను యెహోవా నగరం అని,ఇశ్రాయేలు పవిత్ర దేవుని సీయోను అని పిలుస్తారు.+ 15  నువ్వు విడిచిపెట్టబడ్డావు, ద్వేషించబడ్డావు, నీ గుండా ఎవరూ వెళ్లలేదు,+అయితే నేను నిన్ను శాశ్వతమైన గర్వకారణంగా,తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను.+ 16  నువ్వు దేశాల పాలు తాగుతావు,+రాజుల చనుపాలు తాగుతావు;+యెహోవానైన నేనే నీ రక్షకుణ్ణని,యాకోబు శక్తిమంతుడే నీ విమోచకుడని+ నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. 17  నేను రాగికి బదులు బంగారాన్ని,ఇనుముకు బదులు వెండిని,కలపకు బదులు రాగిని,రాళ్లకు బదులు ఇనుమును తీసుకొస్తాను;శాంతిని నీకు పర్యవేక్షకులుగా,నీతిని నీ మీద అధికారులుగా నియమిస్తాను.+ 18  నీ దేశంలో దౌర్జన్యం అనే మాట గానీ,నీ సరిహద్దుల లోపల నాశనం, వినాశనం అనే మాటలు గానీ ఇక వినిపించవు.+ నువ్వు నీ ప్రాకారాల్ని రక్షణ అని,+ నీ నగర ద్వారాల్ని స్తుతి అని పిలుస్తావు. 19  ఇక మీదట పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు,చంద్రుడి కాంతి నీకు వెలుగు ఇవ్వదు,ఎందుకంటే, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు,+నీ దేవుడే నీకు సొగసుగా ఉంటాడు.+ 20  ఇక మీదట నీ సూర్యుడు అస్తమించడు,నీ చంద్రుడు క్షీణించిపోడు,ఎందుకంటే, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు,+నువ్వు దుఃఖించే రోజులు ముగిసిపోతాయి.+ 21  నీ ప్రజలందరూ నీతిమంతులుగా ఉంటారు;వాళ్లు శాశ్వతంగా దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. నాకు మహిమ* తెచ్చుకోవడానికి+వాళ్లు నేను నాటిన మొక్క, నా చేతి పని.+ 22  మీలో అల్పుడు వెయ్యిమంది అవుతాడు,అందరికన్నా తక్కువవాడు బలమైన జనం అవుతాడు. యెహోవానైన నేనే తగిన సమయంలో ఈ పనిని త్వరపెడతాను.”

అధస్సూచీలు

లేదా “నీ ఉదయకాంతి.”
అక్ష., “నిన్ను.”
లేదా “సుందరమైన.”
ఇవి పక్షుల కోసం మనుషులు చేసిన గూళ్లు.
లేదా “మొదట్లో ఉన్నట్టే ఉన్నాయి.”
లేదా “అందంగా చేస్తాడు.”
లేదా “సౌందర్యం.”