యెషయా 58:1-14

  • అసలైన ఉపవాసం, తప్పుడు ఉపవాసం (1-12)

  • విశ్రాంతి రోజును ఆచరించడంలో సంతోషించడం (13, 14)

58  “నీ గొంతెత్తి వీలైనంత బిగ్గరగా చాటించు; మౌనంగా ఉండకు! బూర* శబ్దంలా నీ స్వరాన్ని పెంచు. నా ప్రజలకు వాళ్ల తిరుగుబాటు గురించి,+యాకోబు ఇంటివాళ్లకు వాళ్ల పాపాల గురించి ప్రకటించు.   తామేదో నీతిగా నడుచుకునే జనమైనట్టు,తమ దేవుని న్యాయాన్ని విడిచిపెట్టని జనమైనట్టువాళ్లు ప్రతీరోజు నన్ను వెతుకుతున్నారు,నా మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టం చూపిస్తున్నారు.+ దేవునికి దగ్గరవడం తమకు ఇష్టం అన్నట్టున్యాయంగా తీర్పు చెప్పమని నన్ను అడుగుతున్నారు.+   ‘మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చూడవు?+ మమ్మల్ని మేము బాధించుకున్నప్పుడు నువ్వెందుకు గమనించవు?’ అని అంటున్నారు.+ నేను ఎందుకు చూడట్లేదంటే, మీరు ఉపవాసం ఉన్న రోజు మీరు మీ సొంత పనులు చేసుకుంటున్నారు,*మీ పనివాళ్లను అణచివేస్తున్నారు.+   మీ ఉపవాసం గొడవలతో, కొట్లాటలతో ముగుస్తుంది,దుష్టత్వమనే పిడికిలితో మీరు గుద్దుకుంటారు. మీరు ఇలా ఉపవాసం ఉంటే, పరలోకం నుండి నేను మీ స్వరం వినను.   నేను చెప్పిన ఉపవాసం ఉండాల్సింది ఇలాగేనా?ఒక వ్యక్తి రెల్లులా తన తల వంచుకొనిగోనెపట్టను, బూడిదను తన పరుపుగా చేసుకొనితనను తాను బాధించుకునే రోజు ఉండాల్సింది ఇలాగేనా? దీన్నేనా మీరు ఉపవాసం అని, యెహోవాను సంతోషపెట్టే రోజు అని పిలిచేది?   అది కాదు, నేను చెప్పిన ఉపవాసం ఏమిటంటే: దుష్టత్వపు సంకెళ్లను తీసేయడం,కాడి కట్లను విప్పడం,+అణచివేయబడిన వాళ్లను విడుదల చేయడం,+ప్రతీ కాడిని విరగ్గొట్టడం;   ఆకలిగా ఉన్నవాళ్లతో నీ ఆహారం పంచుకోవడం,+పేదవాళ్లను, ఇల్లు లేనివాళ్లను నీ ఇంట్లోకి తెచ్చుకోవడం,బట్టలు లేని వాళ్లు కనిపించినప్పుడు వాళ్లకు బట్టలు ఇవ్వడం,+నీ సొంతవాళ్లకు ముఖం చాటేయకుండా ఉండడం.   అప్పుడు, నీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది,+నీకు త్వరగా స్వస్థత కలుగుతుంది. నీ నీతి నీ ముందు నడుస్తుంది,యెహోవా మహిమ నీ వెనక కాపలాగా ఉంటుంది.+   అప్పుడు నువ్వు వేడుకుంటావు, యెహోవా నీకు జవాబిస్తాడు;సహాయం కోసం మొరపెడతావు, ఆయన ‘నేనున్నాను!’ అంటాడు. నువ్వు నీ మధ్య నుండి కాడిని తీసేస్తే,వేలెత్తి చూపించడం, ఇతరుల పేరు పాడుచేసేలా అబద్ధాలు చెప్పడం మానేస్తే,+ 10  నీకు నచ్చినదాన్ని ఆకలిగా ఉన్నవాళ్లకు కూడా ఇస్తే,+కష్టాల్లో ఉన్నవాళ్ల బాగోగులన్నీ చూసుకుంటే,నీ వెలుగు చీకట్లో కూడా ప్రకాశిస్తుంది,నీ అంధకారం కూడా మధ్యాహ్నం వెలుగులా ఉంటుంది.+ 11  యెహోవా ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తాడు,ఎండిపోయిన దేశంలో కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు;+నీ ఎముకలకు సత్తువ దయచేస్తాడు,నువ్వు బాగా నీళ్లుపెట్టిన తోటలా తయారౌతావు,+ఎప్పటికీ ఎండిపోని ఊటలా ఉంటావు. 12  నీ కోసం పురాతన శిథిలాల్ని తిరిగి కడతారు,+పాత తరాల నాటి పునాదుల్ని నువ్వు తిరిగి నిలబెడతావు. బీటల్ని బాగుచేసేవాడివని,నివసించడం కోసం దారుల్ని తిరిగి నిర్మించేవాడివని నువ్వు పిలవబడతావు.+ 13  ఒకవేళ నువ్వు విశ్రాంతి రోజును బట్టి, నా పవిత్రమైన రోజున నీ సొంత పనులు చేయకుండా* ఉంటూ,+విశ్రాంతి రోజు చాలా సంతోషకరమైనదని, అది యెహోవాకు పవిత్రమైన రోజని, ఘనపర్చాల్సిన రోజని అంటూ,+నీ సొంత పనులు చేసుకునే బదులు, వట్టి మాటలు మాట్లాడే బదులు ఆ రోజును మహిమపరిస్తే, 14  నువ్వు యెహోవాను బట్టి చాలా సంతోషిస్తావు,నేను భూమ్మీది ఎత్తైన స్థలాల్ని నీ వశం చేస్తాను.+ నీ పూర్వీకుడైన యాకోబు స్వాస్థ్యంలో ఉన్నదాన్ని నువ్వు తినేలా* చేస్తాను,+ ఈ మాట యెహోవా నోటి నుండి వచ్చింది.”

అధస్సూచీలు

అక్ష., “కొమ్ము.”
లేదా “ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు.”
లేదా “నీ ఇష్టాల్ని నెరవేర్చుకోకుండా.”
లేదా “అనుభవించేలా.”