యెషయా 52:1-15

  • సీయోనూ! లే! (1-12)

    • మంచివార్త తెచ్చేవాళ్ల అందమైన పాదాలు (7)

    • సీయోను కావలివాళ్లు ఏకస్వరంతో కేకలు వేస్తారు (8)

    • యెహోవా పాత్రల్ని మోసేవాళ్లు పవిత్రంగా ఉండాలి (11)

  • యెహోవా సేవకుడు హెచ్చించ​బడతాడు (13-15)

    • వికారంగా మారిన రూపం (14)

52  సీయోనూ! లే!+ లేచి, బలాన్ని+ వస్త్రంలా తొడుక్కో! పవిత్ర నగరమైన యెరూషలేమా, నీ అందమైన వస్త్రాలు వేసుకో!+ ఎందుకంటే, ఇక మీదట సున్నతిలేని వాళ్లెవ్వరూ, అపవిత్రులెవ్వరూ నీలో ప్రవేశించరు.+   యెరూషలేమా, నీ మీదున్న దుమ్ము దులిపేసుకొని, లేచి పైన కూర్చో. బందీగా ఉన్న సీయోను కూతురా, నీ మెడకు ఉన్న కట్లు విప్పేసుకో.+   ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు డబ్బులకు కాకుండా ఊరికే అమ్మబడ్డావు,+డబ్బులు చెల్లించకుండానే నువ్వు తిరిగి కొనబడతావు.”+   సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మొదట్లో నా ప్రజలు పరదేశులుగా నివసించడానికి ఐగుప్తుకు వెళ్లారు;+తర్వాత అష్షూరు ఏ కారణం లేకుండానే వాళ్లను అణచివేసింది.”   “అలాంటప్పుడు నేనిక్కడ ఏంచేయాలి?” అని యెహోవా అంటున్నాడు. “ఎందుకంటే, నా ప్రజల్ని ఊరికే తీసుకెళ్లిపోయారు. వాళ్లమీద ఏలేవాళ్లు విజయగర్వంతో కేకలు వేస్తూ ఉన్నారు”+ అని యెహోవా అంటున్నాడు.“వాళ్లు రోజంతా అదేపనిగా నా పేరును అవమానిస్తున్నారు.+   అందుకే నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు;+మాట్లాడుతున్నది నేనే అని ఆ రోజు వాళ్లు తెలుసుకుంటారు. ఇదిగో, అది నేనే!”   మంచివార్తను తెస్తూ,శాంతిని ప్రకటిస్తూ,+మేలైన విషయాల గురించిన మంచివార్తను తెస్తూ,రక్షణను చాటిస్తూ,“నీ దేవుడు రాజయ్యాడు!”+ అని సీయోనుతో చెప్పేవాళ్ల పాదాలు పర్వతాల మీద ఎంత అందంగా ఉన్నాయి!+   విను! నీ కావలివాళ్లు గొంతెత్తి అరుస్తున్నారు. వాళ్లంతా ఏకస్వరంతో సంతోషంగా కేకలు వేస్తున్నారు,ఎందుకంటే యెహోవా సీయోనును తిరిగి సమకూర్చినప్పుడు వాళ్లు దాన్ని స్పష్టంగా* చూస్తారు.   యెరూషలేము శిథిలాల్లారా,+ సంతోషించండి, ఆనందంగా ముక్తకంఠంతో కేకలు వేయండి,ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని ఓదార్చాడు;+ ఆయన యెరూషలేమును తిరిగి కొన్నాడు.+ 10  దేశాలన్నిటి కళ్లముందు యెహోవా తన పవిత్రమైన బాహువును వెల్లడిచేశాడు;+భూమి కొనల్లో ఉన్నవాళ్లంతా మన దేవుని రక్షణకార్యాల్ని* చూస్తారు.+ 11  వెళ్లండి, వెళ్లండి, అక్కడి నుండి వెళ్లిపోండి,+ అపవిత్రమైన దేన్నీ ముట్టుకోకండి!+ యెహోవా మందిర పాత్రల్ని మోస్తున్న వాళ్లారా,+దాని మధ్య నుండి వెళ్లిపోండి,+ మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి. 12  మీరు కంగారుకంగారుగా బయల్దేరరు,పారిపోవాల్సిన అవసరం కూడా మీకు రాదు,ఎందుకంటే యెహోవాయే మీ ముందు నడుస్తాడు,ఇశ్రాయేలు దేవుడే మీ వెనక కాపలాగా ఉంటాడు. 13  ఇదిగో! నా సేవకుడు+ లోతైన అవగాహనతో పనిచేస్తాడు. ఆయన చాలా పైకి ఎత్తబడతాడు,ఆయన ఉన్నతపర్చబడతాడు, గొప్పగా హెచ్చించబడతాడు.+ 14  ఆయన ఆకారం ఏ మనిషి ఆకారం కన్నా వికృతంగా,ఆయన రూపం ఏ మనిషి రూపం కన్నా వికారంగా మారడం చూసిఎలాగైతే చాలామంది ఆశ్చర్యంతో ఆయన్ని చూస్తూ ఉండిపోయారో, 15  అలాగే ఆయన చాలా దేశాల్ని నిర్ఘాంతపోయేలా చేస్తాడు. రాజులు ఆయన ముందు నోరు మూసుకుంటారు;*+ఎందుకంటే, వాళ్లు తమకు చెప్పబడని వాటిని చూస్తారు,తాము వినని వాటి గురించి ఆలోచిస్తారు.+

అధస్సూచీలు

లేదా “కళ్లారా.”
లేదా “విజయాన్ని.”
లేదా “మౌనంగా ఉండిపోతారు.”