యెషయా 50:1-11

  • ఇశ్రాయేలు పాపాల వల్ల సమస్యలు (1-3)

  • విధేయుడైన యెహోవా సేవకుడు (4-11)

    • శిష్యునికి ఉండేలాంటి నోరు, చెవి (4)

50  యెహోవా ఇలా అంటున్నాడు: “నేను పంపించేసిన మీ అమ్మ విడాకుల పత్రం+ ఏది? నా అప్పుల వాళ్లలో ఎవరికి నేను మిమ్మల్ని అమ్మేశాను? ఇదిగో! మీ సొంత తప్పుల్ని బట్టే+ మీరు అమ్మేయబడ్డారు,మీ అపరాధాల వల్లే మీ అమ్మ పంపించేయబడింది.+  2  మరైతే, నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఎవరూ లేరు? నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ పలకలేదు?+ నా చెయ్యి విడిపించలేనంత చిన్నదా?కాపాడే శక్తి నాకు లేదా?+ ఇదిగో! నేను గద్దిస్తే సముద్రం ఎండిపోతుంది;+నేను నదుల్ని ఎడారిగా చేస్తాను.+ దాహం వల్ల వాటి చేపలు చచ్చిపోతాయి,నీళ్లు లేనందువల్ల అవి కుళ్లిపోతాయి.  3  నేను చీకటిని ఆకాశానికి వస్త్రంగా చేస్తాను,+గోనెపట్టను దానికి బట్టలుగా చేస్తాను.”  4  అలసిపోయిన వ్యక్తికి సరైన మాటలతో* ఎలా జవాబివ్వాలో* నాకు తెలిసేలా+సర్వోన్నత ప్రభువైన యెహోవా, శిష్యునికి ఉండేలాంటి* నోటిని* నాకు ఇచ్చాడు.+ ప్రతీ ఉదయం ఆయన నన్ను లేపుతాడు;శిష్యునిలా నేర్చుకోవడానికి ఆయన నా చెవిని మేల్కొల్పుతాడు.+  5  సర్వోన్నత ప్రభువైన యెహోవా నా చెవిని తెరిచాడు,నేను తిరుగుబాటు చేయలేదు,+ వ్యతిరేక దిశలో వెళ్లలేదు.+  6  నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+  7  అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు.+ అందుకే నేను అవమానించబడినట్టు భావించను. అందువల్లే నేను నా ముఖాన్ని చెకుముకిరాయిలా చేసుకున్నాను,+నేను సిగ్గుపర్చబడనని నాకు తెలుసు.  8  నన్ను నీతిమంతుడిగా ప్రకటించే దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఎవరు నా మీద నేరం మోపగలరు?*+ రండి, మనం ముఖాముఖిగా తలపడదాం. నా మీద వ్యాజ్యం ఉన్నది ఎవరికి? అతన్ని నా దగ్గరికి రమ్మనండి.  9  ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నేను దోషినని తీర్పు తీర్చేది ఎవరు? ఇదిగో! వాళ్లంతా వస్త్రంలా పాతబడిపోతారు. చిమ్మెట వాళ్లను తినేస్తుంది. 10  మీలో యెహోవాకు భయపడేది ఎవరు?ఆయన సేవకుడి స్వరాన్ని వినేది ఎవరు?+ ఏమాత్రం వెలుగు లేకుండా కటిక చీకట్లో నడిచింది ఎవరు? అతను యెహోవా పేరు మీద నమ్మకం పెట్టుకోవాలి, తన దేవుని మీద ఆధారపడాలి.* 11  “నిప్పు అంటిస్తున్న మీరంతా,మంటల్ని రేపుతున్న మీరంతా చూడండి!మీరు మీ నిప్పు వెలుగులో,మీరు రాజేసిన మంటల మధ్య నడవండి. నేను మీకు విధించే శిక్ష ఇదే: మీరు విపరీతమైన నొప్పితో పడుకుంటారు.

అధస్సూచీలు

అక్ష., “ఒక మాటతో.”
అక్ష., “నాలుకను.”
లేదా “చక్కగా శిక్షణ పొందిన.”
లేదా “బలపర్చాలో” అయ్యుంటుంది.
లేదా “నాతో పోరాడగలరు?”
లేదా “ఆనుకోవాలి.”