యెషయా 41:1-29

  • జయించే వ్యక్తి సూర్యోదయం వైపు నుండి వస్తాడు (1-7)

  • ఇశ్రాయేలు, దేవుని సేవకుడిగా ఎంచుకోబడ్డాడు (8-20)

    • “నా స్నేహితుడైన అబ్రాహాము” (8)

  • ఇతర దేవుళ్లను సవాలు చేయడం (21-29)

41  “ద్వీపాల్లారా, మౌనంగా ఉండి నేను చెప్పేది వినండి;దేశాలు మళ్లీ బలం పుంజుకోవాలి. అవి నా దగ్గరికి రావాలి; తర్వాత అవి మాట్లాడాలి.+ తీర్పు కోసం మనం సమావేశమౌదాం రండి.   దేశాల్ని అతని చేతికి అప్పగించాలని,రాజుల్ని అతనికి లోబర్చాలని+సూర్యోదయం* వైపు నుండి ఒక వ్యక్తిని బయల్దేరజేసింది ఎవరు?+న్యాయం జరిగించడానికి తన పాదాల దగ్గరికి* అతన్ని పిలిచింది ఎవరు? అతని ఖడ్గం ముందు వాళ్లను మట్టికరిపించేది ఎవరు?అతని విల్లు ముందు వాళ్లను గాలికి ఎగిరే కొయ్యకాలుగా* చేసేది ఎవరు?   తన పాదాలు ఎప్పుడూ నడవని త్రోవల్లోఅతను ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్లను తరుముతూ వెళ్తాడు.   మొదటి నుండి తరాల్ని రప్పిస్తూఈ పనికి పూనుకొని దాన్ని చేసింది ఎవరు? నేనే, యెహోవాను, నేను మొదటివాణ్ణి;+చివరివాళ్లతో కూడా నేను ఇలాగే ఉంటాను.”+   అది చూసి ద్వీపాలు భయపడిపోయాయి. భూమి కొనలు వణకడం మొదలుపెట్టాయి. అవి కలుసుకొని ముందుకు వస్తున్నాయి.   ప్రతీ వ్యక్తి తన తోటివాడికి సహాయం చేస్తున్నాడు,తన సహోదరునితో, “ధైర్యంగా ఉండు” అని చెప్తున్నాడు.   చేతిపనివాడు కంసాలిని+ బలపరుస్తున్నాడు;సుత్తితో సాగగొట్టేవాడుదాగలి* మీద కొట్టేవాడిని బలపరుస్తున్నాడు. అతను టంకం పని* గురించి, “అది బాగుంది” అంటున్నాడు. తర్వాత అది ఒరిగి పడిపోకుండా మేకులతో దాన్ని బిగిస్తారు.   “అయితే ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి,+యాకోబూ, నేను నిన్ను ఎంచుకున్నాను,+నువ్వు నా స్నేహితుడైన అబ్రాహాము సంతానం,*+   నేను భూమి అంచుల నుండి నిన్ను చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాను,+భూమి సుదూర ప్రాంతాల నుండి నిన్ను పిలిచాను. నేను నీతో ఇలా అన్నాను: ‘నువ్వు నా సేవకుడివి;+నేను నిన్ను ఎంచుకున్నాను; నేను నిన్ను తిరస్కరించలేదు.+ 10  భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+ ఆందోళనపడకు,* ఎందుకంటే నేను నీ దేవుణ్ణి.+ నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను,+నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.’ 11  ఇదిగో! నీ మీద కోపగించుకునే వాళ్లంతా సిగ్గుపడతారు, అవమానాలపాలు అవుతారు.+ నీతో పోరాడేవాళ్లు లేకుండా పోతారు, నాశనమౌతారు.+ 12  నీతో పోరాడేవాళ్ల కోసం నువ్వు వెతుకుతావు, కానీ వాళ్లు నీకు కనిపించరు;నీతో యుద్ధం చేసేవాళ్లు ఉనికిలో లేకుండా పోతారు, ఎక్కడా ఉండరు.+ 13  ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను,‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.+ 14  పురుగులాంటి* యాకోబూ,+ భయపడకు,ఇశ్రాయేలు జనమా, నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ అంటున్నాడు. 15  “ఇదిగో! నేను నిన్ను నూర్చే పనిముట్టులా చేశాను,+పదునైన కొత్త నూర్చే పరికరంలా చేశాను. నువ్వు పర్వతాల్ని తొక్కి పిండి చేస్తావు,కొండల్ని పొట్టులా చేస్తావు. 16  నువ్వు వాటిని తూర్పారబడతావు,అవి గాలికి కొట్టుకుపోతాయి;సుడిగాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు,+ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి బట్టి గొప్పలు చెప్పుకుంటావు.”+ 17  “అవసరంలో ఉన్నవాళ్లు, పేదవాళ్లు నీళ్ల కోసం వెతుకుతున్నారు, కానీ ఎక్కడా నీళ్లు లేవు. దాహంతో వాళ్ల నాలుక ఎండిపోతోంది.+ యెహోవా అనే నేను వాళ్లకు జవాబిస్తాను.+ ఇశ్రాయేలు దేవుడినైన నేను వాళ్లను విడిచిపెట్టను.+ 18  నేను చెట్లులేని కొండల్లో నదులు పారేలా,+ లోయ మైదానాల్లో ఊటలు ప్రవహించేలా చేస్తాను.+ నేను ఎడారిని జమ్ము మడుగులా, నీళ్లులేని దేశాన్ని నీటి ఊటలుగా చేస్తాను.+ 19  ఎడారిలో దేవదారు చెట్టును,తుమ్మ చెట్టును, గొంజి చెట్టును, పైన్‌ చెట్టును నాటుతాను.+ ఎడారి మైదానంలో సరళవృక్షాన్ని,యాష్‌ చెట్టును,* తమాల వృక్షాన్ని నాటుతాను.+ 20  దానివల్ల, యెహోవా చెయ్యి దాన్ని చేసిందని,ఇశ్రాయేలు పవిత్ర దేవుడే దాన్ని కలగజేశాడనిప్రజలందరూ చూసి తెలుసుకుంటారు,శ్రద్ధగా విని అర్థం చేసుకుంటారు.”+ 21  “మీ వ్యాజ్యాన్ని నా ముందు పెట్టండి” అని యెహోవా అంటున్నాడు. “మీ వాదనలు వినిపించండి” అని యాకోబుకు రాజైన దేవుడు అంటున్నాడు. 22  “రుజువులు ప్రవేశపెట్టండి, జరగబోయే వాటి గురించి మాకు తెలియజేయండి. మునుపటి* విషయాల గురించి మాకు చెప్పండి,అప్పుడు మేము వాటి గురించి ఆలోచించి,* వాటివల్ల చివరికి ఏమౌతుందో తెలుసుకుంటాం. లేదా ముందుముందు జరగబోతున్న వాటి గురించి మాకు ప్రకటించండి.+ 23  మీరు దేవుళ్లని మేము తెలుసుకునేలాభవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మాకు చెప్పండి.+ అవును, మంచో చెడో ఏదో ఒకటి చేయండి.అప్పుడు మేము దాన్ని చూసి ఆశ్చర్యపోతాం.+ 24  ఇదిగో! అసలు మీరు ఉనికిలోనే లేరు,మీరు సాధించింది అంటూ ఏమీ లేదు.+ మిమ్మల్ని ఎంచుకునేవాళ్లు అసహ్యులు.+ 25  ఉత్తరం వైపు నుండి నేనొక వ్యక్తిని బయల్దేరజేశాను, అతను వస్తాడు,+సూర్యోదయం* వైపు నుండి వచ్చే వ్యక్తి+ నా పేరును మహిమపరుస్తాడు. అతను బంకమట్టిని తొక్కినట్టు పరిపాలకుల్ని* తొక్కుతాడు,కుమ్మరి బంకమట్టిని తొక్కినట్టు అతను వాళ్లను తొక్కుతాడు. 26  మేము తెలుసుకునేలా మొదటి నుండి దాని గురించి చెప్పిందెవరు?‘అతను సరిగ్గా చెప్పాడు’ అని మేము అనేలా గడిచిన కాలాల నుండి వాటిని ఎవరు చెప్పారు?+ నిజానికి, ఎవరూ దాని గురించి ప్రకటించలేదు! ఎవరూ దాని గురించి చెప్పలేదు! మీ నుండి ఎవరూ ఏమీ వినలేదు!”+ 27  “ఇదిగో! వాళ్లు ఇక్కడ ఉన్నారు!” అని సీయోనుకు మొదట చెప్పింది నేనే.+ మంచివార్త మోసుకొచ్చే వ్యక్తిని నేను యెరూషలేముకు పంపుతాను.+ 28  నేను చూస్తూ వచ్చాను, కానీ ఎవరూ లేరు;వాళ్లలో సలహా ఇచ్చేవాళ్లు ఒక్కరు కూడా లేరు. బదులు చెప్పమని నేను వాళ్లను అడుగుతూ వచ్చాను. 29  ఇదిగో! వాళ్లంతా మాయ.* వాళ్ల పనులన్నీ వట్టివి. వాళ్ల పోత* విగ్రహాలు గాలి లాంటివి, వ్యర్థమైనవి.+

అధస్సూచీలు

లేదా “తూర్పు.”
అంటే, తనను సేవించడానికి.
పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
ఇది, కంసాలివాళ్లు లోహపు వస్తువుల్ని కాల్చి సాగగొట్టే ఇనుప దిమ్మె.
అంటే, లోహాల్ని అతికించడం.
అక్ష., “విత్తనం.”
లేదా “దిగులుపడకు.”
అంటే, ఏమాత్రం సంరక్షణలేని, దీనమైన.
15 మీటర్ల ఎత్తు దాకా పెరిగే ఒక పెద్ద చెట్టు. దానికి లేతపచ్చ ఆకులు, బూడిద రంగు రెమ్మలు ఉంటాయి.
అక్ష., “మొదటి.”
లేదా “వాటి మీద మనసుపెట్టి.”
లేదా “తూర్పు.”
లేదా “ఉప పాలకుల్ని.”
లేదా “అసలు ఉనికిలోనే లేరు.”
లేదా “లోహపు.”