యెషయా 27:1-13

  • లివ్యాతన్‌ను యెహోవా చంపేస్తాడు (1)

  • ఇశ్రాయేలును ద్రాక్షతోటతో పోలుస్తూ పాట (2-13)

27  ఆ రోజు యెహోవా కఠినమైన, గొప్పదైన, బలమైన తన ఖడ్గంతో+లివ్యాతన్‌* అనే పాకే సర్పం మీదికి,వంకర సర్పమైన లివ్యాతన్‌ మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు.సముద్రంలోని ఆ భారీ ప్రాణిని ఆయన చంపేస్తాడు.   ప్రజలారా, ఆ రోజు ఆమె* మీద ఈ పాట పాడండి: “పులిసిన ద్రాక్షారసం ఉన్న ద్రాక్షతోట!+   యెహోవా అనే నేను దాన్ని కాపాడుతున్నాను.+ ప్రతీక్షణం దానికి నీళ్లు పెడుతున్నాను.+ ఎవరూ దానికి హాని చేయకుండారాత్రింబగళ్లు దాన్ని సంరక్షిస్తున్నాను.+   నాకు ఏ కోపం లేదు.+ ముళ్లపొదలతో, పిచ్చి మొక్కలతో ఎవరు నామీదికి యుద్ధానికి వస్తారు? నేను వాటిని తొక్కేస్తాను, అన్నిటికీ కలిపి నిప్పంటిస్తాను.   కాబట్టి, అతను నా బలమైన దుర్గాన్ని గట్టిగా పట్టుకోవాలి. అతను నాతో సమాధానపడాలి;నాతో శాంతి కుదుర్చుకోవాలి.”   రాబోయే రోజుల్లో యాకోబు వేళ్లూనుకుంటాడు,ఇశ్రాయేలు చిగిర్చి పూతపూస్తాడు,+వాళ్లు దేశాన్ని పంటతో నింపుతారు.+   అతన్ని కొట్టే వ్యక్తి కొట్టినట్టుగా అతన్ని కొట్టాలా? అతని ప్రజలు వధించబడి హతులైనట్టుగా అతన్ని చంపాలా?   ఆమెను పంపించేసేటప్పుడు నువ్వు గట్టిగా అరిచి ఆమెతో పోరాడతావు. తూర్పు గాలి వీచే రోజున ఆయన తీవ్రమైన కోపంతో ఆమెను వెళ్లగొడతాడు.+   యాకోబు దోషానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం జరుగుతుంది,+అతని పాపం తీసేయబడినప్పుడు అతనికి దక్కే పూర్తి ప్రతిఫలం ఇదే: ఆయన, బలిపీఠం రాళ్లన్నిటినీనలగ్గొట్టిన సున్నపురాళ్లలా చేస్తాడు,పూజా కర్రలు,* ధూపస్తంభాలు ఏవీ మిగలవు. 10  ఎందుకంటే, బలమైన ప్రాకారాలుగల నగరం నిర్జనమైపోతుంది;పచ్చికబయళ్లు ఎడారిలా వదిలేయబడతాయి, విడిచిపెట్టబడతాయి.+ అక్కడే దూడ మేత మేసి పడుకుంటుంది,దాని కొమ్మల్ని తినేస్తుంది.+ 11  దాని చిగుర్లు ఎండిపోయినప్పుడుస్త్రీలు వచ్చి వాటిని విరిచేసి,వాటితో నిప్పు అంటిస్తారు. ఎందుకంటే ఈ ప్రజలకు అవగాహన లేదు.+ అందుకే వాళ్ల సృష్టికర్త వాళ్లమీద కరుణ చూపించడు,వాళ్లను రూపొందించిన దేవుడు వాళ్లమీద అనుగ్రహం చూపించడు.+ 12  ఇశ్రాయేలు ప్రజలారా, ఆ రోజు యెహోవా, ప్రవహించే నదీ* కాలువ నుండి ఐగుప్తు వాగు*+ వరకు ఉన్న పండ్లను రాలగొడతాడు, ఒక్కో పండును ఏరి సమకూర్చినట్టు మిమ్మల్ని సమకూరుస్తాడు.+ 13  ఆ రోజు గొప్ప బూర* ఊదబడుతుంది;+ అష్షూరు దేశంలో నశించిపోతున్నవాళ్లు,+ ఐగుప్తు దేశంలో చెదిరిపోయినవాళ్లు+ యెరూషలేములోని పవిత్ర పర్వతం దగ్గరికి వచ్చి యెహోవాకు వంగి నమస్కారం చేస్తారు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
ఇశ్రాయేలును సూచిస్తుందని తెలుస్తోంది. అది ఇక్కడ ఒక స్త్రీగా, ద్రాక్షతోటగా వర్ణించబడింది.
పదకోశం చూడండి.
అంటే, యూఫ్రటీసు.
పదకోశం చూడండి.
అక్ష., “కొమ్ము.”