యెషయా 26:1-21
26 ఆ రోజు యూదా దేశంలో+ ఈ పాట పాడతారు:+
“మనకొక బలమైన నగరం+ ఉంది.
ఆయన, రక్షణను దానికి ప్రాకారాలుగా, కోట గోడలుగా చేస్తాడు.+
2 నీతిగల జనం, నమ్మకమైన ప్రవర్తనగల జనంప్రవేశించేలా నగర ద్వారాలు తెరవండి.+
3 నీ మీద పూర్తిగా ఆధారపడేవాళ్లను* నువ్వు కాపాడతావు;నువ్వు వాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తావు,+ఎందుకంటే వాళ్లు నిన్నే నమ్ముకున్నారు.+
4 ఎల్లప్పుడూ యెహోవా మీద నమ్మకం ఉంచండి,+ఎందుకంటే యెహోవా* యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం.*+
5 ఎత్తైన చోట, అంటే ఉన్నతమైన నగరంలో నివసించేవాళ్లను ఆయన కిందికి దించాడు.
ఆయన దాన్ని కిందికి దించుతాడు,నేల మీదికి రప్పిస్తాడు;ధూళిలోకి విసిరేస్తాడు.
6 పాదం దాన్ని తొక్కుతుంది,కష్టాల్లో ఉన్నవాళ్ల పాదాలు, దీనుల అడుగులు దాన్ని తొక్కుతాయి.”
7 నీతిమంతుల దారి తిన్నగా* ఉంటుంది.
నువ్వు నిజాయితీపరుడివి కాబట్టినీతిమంతుల మార్గాన్ని చదును చేస్తావు.
8 యెహోవా, నీ తీర్పుల మార్గాన్ని మేము అనుసరిస్తున్నప్పుడుమేము నీ మీదే ఆశపెట్టుకుంటున్నాం.
నీ కోసం, నీ పేరు కోసం* మా ప్రాణం తపిస్తోంది.
9 రాత్రిపూట నా ప్రాణం నీ కోసం తపిస్తోంది,అవును, లోలోపల నేను నీ కోసం చూస్తూ ఉన్నాను;+నువ్వు భూమికి తీర్పులు జారీ చేసినప్పుడు,దేశ నివాసులు నీతి+ గురించి నేర్చుకుంటారు.
10 అయితే దుష్టుడి మీద దయ చూపించినాఅతను నీతిని నేర్చుకోడు.+
నిజాయితీపరుల దేశంలో కూడా అతను చెడ్డగానే ప్రవర్తిస్తాడు,+యెహోవా గొప్పతనాన్ని అతను చూడడు.+
11 యెహోవా, నీ చెయ్యి ఎత్తబడి ఉంది, అయినా వాళ్లు దాన్ని చూడరు.+
నీ ప్రజల విషయంలో నీకున్న ఆసక్తిని చూసి వాళ్లు సిగ్గుపడతారు.
అవును, నీ అగ్ని నీ విరోధుల్ని దహించేస్తుంది.
12 యెహోవా, నువ్వు మాకు శాంతిని దయచేస్తావు,+ఎందుకంటే, మేము చేసినవన్నీనువ్విచ్చిన బలంతోనే చేశాం.
13 యెహోవా, మా దేవా, నువ్వు కాకుండా వేరే యజమానులు మమ్మల్ని పరిపాలించారు,+కానీ నీ పేరునే మేము స్మరించుకుంటున్నాం.+
14 వాళ్లు చనిపోయారు; ఇక బ్రతకరు.
వాళ్లు చనిపోయి శక్తిహీనంగా ఉన్నారు, ఇక లేవరు.+
ఎందుకంటే వాళ్లను సమూలంగా నాశనం చేసి, వాళ్ల పేరును పూర్తిగా తుడిచిపెట్టాలనినువ్వు వాళ్ల మీదికి నీ దృష్టి మళ్లించావు.
15 యెహోవా, నువ్వు దేశాన్ని విశాలం చేశావు,దేశాన్ని పెద్దదిగా చేశావు;నిన్ను నువ్వు మహిమపర్చుకున్నావు.+
దేశ సరిహద్దులన్నిటినీ నువ్వు ఎంతగానో విస్తరింపజేశావు.+
16 యెహోవా, కష్టం వచ్చినప్పుడు వాళ్లు నీ వైపు తిరిగారు;నువ్వు వాళ్లను సరిదిద్దినప్పుడు వాళ్లు మౌనంగా, పట్టుదలతో ప్రార్థించారు.+
17 యెహోవా, నీ వల్ల మా పరిస్థితిబిడ్డను కనబోతున్న గర్భిణీ స్త్రీపురిటినొప్పులు వచ్చినప్పుడు వేదనతో కేకలు వేసినట్టు ఉంది.
18 మేము గర్భం ధరించాం, పురిటినొప్పులు పడ్డాం,కానీ గాలిని కన్నట్టే ఉంది.
మేము దేశానికి రక్షణ తీసుకురాలేదు,దేశంలో నివసించడానికి ఎవరూ పుట్టలేదు.
19 “చనిపోయిన నీవాళ్లు బ్రతుకుతారు.
నావాళ్ల శవాలు లేస్తాయి.+
మట్టిలో నివసిస్తున్న వాళ్లారా,+లేవండి, సంతోషంతో అరవండి!
ఎందుకంటే నీ మంచు తెల్లవారుజాము* మంచులా ఉంది,భూమి తనలో ఉన్న మృతుల్ని సజీవుల్ని చేస్తుంది.
20 నా ప్రజలారా, వెళ్లండి, లోపలి గదుల్లోకి ప్రవేశించితలుపులు వేసుకోండి.+
దేవుని కోపం దాటివెళ్లే వరకుకాసేపు దాక్కోండి.+
21 ఎందుకంటే, ఇదిగో! దేశ నివాసుల దోషాన్ని బట్టి వాళ్లను లెక్క అడగడం కోసంయెహోవా తన నివాస స్థలం నుండి వస్తున్నాడు;దేశం తనలో హతులైన వాళ్లను కప్పిపెట్టకుండాతనలో జరిగిన రక్తపాతాన్ని బయటపెడుతుంది.”
అధస్సూచీలు
^ లేదా “స్థిరమైన మనసున్నవాళ్లను” అయ్యుంటుంది.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “బండరాయి.”
^ లేదా “సమతలంగా.”
^ అంటే, నువ్వూ నీ పేరూ జ్ఞాపకం చేసుకోబడాలని, తెలియజేయబడాలని.
^ లేదా “ఔషధ మొక్కల మీది” అయ్యుంటుంది.