యెషయా 25:1-12

  • దేవుని ప్రజల మీద సమృద్ధిగా దీవెనలు (1-12)

    • శ్రేష్ఠమైన ద్రాక్షారసంతో యెహోవా విందు (6)

    • మరణం ఇక ఉండదు (8)

25  యెహోవా, నువ్వే నా దేవుడివి. నేను నిన్ను ఘనపరుస్తాను, నీ పేరును స్తుతిస్తాను,ఎందుకంటే నువ్వు అద్భుతమైన పనులు చేశావు,+పురాతన కాలంలో ఉద్దేశించిన* వాటిని+విశ్వసనీయతతో,+ నమ్మకత్వంతో నెరవేర్చావు.   నువ్వు నగరాన్ని రాళ్లకుప్పగా చేశావు,ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలాలుగా మార్చావు. పరదేశుల బురుజు ఇక ఎంతమాత్రం కోటలా లేదు;అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.   అందుకే బలమైన జనం నిన్ను మహిమపరుస్తుంది;నిరంకుశ జనాల నగరం నీకు భయపడుతుంది.+   ఎందుకంటే నువ్వు దీనులకు బలమైన కోటగాకష్టాల్లో ఉన్న పేదవాడికి బలమైన దుర్గంగా,+తుఫాను వచ్చినప్పుడు ఆశ్రయంగా,ఎండలో నీడగా ఉన్నావు.+ నిరంకుశ పాలకుల కోపం, గోడను ఢీకొట్టే తుఫానులా,   ఎండిపోయిన దేశంలోని వేడిలా ఉన్నప్పుడు,అపరిచితుల అల్లకల్లోలాన్ని నువ్వు అణచివేస్తావు. మేఘం నీడ వల్ల వేడి అణచివేయబడినట్టునిరంకుశ పాలకుల పాట అణచివేయబడుతుంది.   సైన్యాలకు అధిపతైన యెహోవా ఈ పర్వతం+ మీద అన్ని జనాలకుశ్రేష్ఠమైన వంటకాలతో విందు ఏర్పాటు చేస్తాడు;+శ్రేష్ఠమైన ద్రాక్షారసంతో,*మూలుగతో నిండిన శ్రేష్ఠమైన వంటకాలతో,వడగట్టిన శ్రేష్ఠమైన ద్రాక్షారసంతో విందు ఏర్పాటు చేస్తాడు.   ఈ పర్వతం మీద, ఆయన అన్ని జనాల మీదున్న ముసుగును,దేశాలన్నిటినీ కప్పుతున్న తెరను తీసేస్తాడు.*   ఇక ఎప్పుడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడు,+సర్వోన్నత ప్రభువైన యెహోవా, ప్రజలందరి ముఖాల మీది కన్నీళ్లను తుడిచేస్తాడు.+ భూమంతటా ఉన్న తన ప్రజల నిందను ఆయన తీసేస్తాడు,యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.   ఆ రోజు వాళ్లు ఇలా చెప్పుకుంటారు: “ఇదిగో! ఈయనే మన దేవుడు!+ మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం,+ఈయనే మనల్ని రక్షిస్తాడు.+ ఈయనే యెహోవా! మనం ఈయన మీద ఆశపెట్టుకున్నాం. ఆయన దయచేసే రక్షణను బట్టి మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం.”+ 10  ఎందుకంటే యెహోవా చెయ్యి ఈ పర్వతం మీద ఉంటుంది,+గడ్డిని తొక్కి ఎరువుకుప్పగా చేసినట్టుమోయాబు దాని స్థలంలో తొక్కబడుతుంది.+ 11  ఈతగాడు ఈతకొట్టడానికి తన చేతులు చాపినట్టుఆయన దానిలోకి తన చేతులు చాపుతాడు,తన చేతుల్ని నేర్పుగా తిప్పుతూదాని అహంకారాన్ని అణచివేస్తాడు.+ 12  ప్రాకారాలుగల నగరాన్ని, దాని ఎత్తైన రక్షణగోడలతో పాటు కూలగొడతాడు;ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు, మట్టిలో కలిపేస్తాడు.

అధస్సూచీలు

లేదా “ఆలోచించిన.”
లేదా “మడ్డి మీద పేరుకున్న చిక్కని ద్రాక్షారసంతో.”
అక్ష., “మింగేస్తాడు.”