యెషయా 24:1-23

  • యెహోవా దేశాన్ని ఖాళీ చేయిస్తాడు (1-23)

    • సీయోనులో యెహోవా రాజయ్యాడు (23)

24  ఇదిగో! యెహోవా దేశాన్ని* ఖాళీ చేయించి దాన్ని నిర్జనం చేస్తున్నాడు.+ ఆయన దాన్ని తలకిందులు చేసి,+ దాని నివాసుల్ని చెదరగొడతాడు.+   అందరి పరిస్థితి ఒకేలా ఉంటుంది: ప్రజలకు, యాజకుడికి,దాసుడికి, యజమానికి,దాసురాలికి, యజమానురాలికి,అమ్మేవాడికి, కొనేవాడికి,అప్పు ఇచ్చేవాడికి, అప్పు తీసుకునేవాడికి,వడ్డీ తీసుకునేవాడికి, వడ్డీ కట్టేవాడికి అందరికీ ఒకేలా జరుగుతుంది.+   దేశం పూర్తిగా ఖాళీ చేయబడుతుంది;అది పూర్తిగా దోచుకోబడుతుంది,+ఎందుకంటే యెహోవా ఈ మాట చెప్పాడు.   దేశం శోకిస్తోంది;*+ అది పాడైపోతోంది. పండే భూమి బీడుబారిపోతోంది; అది వాడిపోతోంది. దేశంలోని ప్రముఖులు కృశించి​పోతున్నారు.   నివాసులు దేశాన్ని కలుషితం చేశారు,+వాళ్లు ఆజ్ఞలు మీరారు,+నియమాలు మార్చారు,+శాశ్వతమైన* ఒప్పందానికి*+ కట్టుబడి ఉండలేదు.   అందుకే శాపం దేశాన్ని మింగేస్తోంది,+దాని నివాసులు దోషులుగా ఎంచ​బడుతున్నారు. దానివల్లే దేశ నివాసుల సంఖ్య తగ్గి​పోయింది,చాలా కొద్దిమందే మిగిలారు.+   కొత్త ద్రాక్షారసం దుఃఖిస్తోంది,* ద్రాక్షవల్లి వాడిపోతోంది,+హృదయం సంతోషంగా ఉన్నవాళ్లంతా నిట్టూరుస్తున్నారు.+   కంజీరల* సంతోషనాదం ఆగిపోయింది;ఉల్లసించేవాళ్ల శబ్దం ఇక వినబడడం లేదు;వీణల* సంతోషనాదం ఆగిపోయింది.+   వాళ్లు పాటలు లేకుండా ద్రాక్షారసం ​తాగుతున్నారు,మద్యం తాగేవాళ్లకు అది చేదుగా అనిపిస్తోంది. 10  నిర్జనమైన పట్టణం కూలగొట్టబడింది;+ఎవరూ ప్రవేశించకుండా ప్రతీ ఇంటి తలుపు మూసేయబడింది. 11  వాళ్లు ద్రాక్షారసం కోసం వీధుల్లో కేకలు వేస్తున్నారు. సంతోషమంతా కనుమరుగైపోయింది;దేశంలోని ఆనందమంతా ఆవిరైపోయింది.+ 12  నగరం శిథిలమైపోయింది;నగర ద్వారం రాళ్లకుప్పగా మారింది.+ 13  జనాల మధ్య దేశం పరిస్థితి ఒలీవ చెట్టునుండి పండ్లను రాలగొట్టినప్పటిలా,+ద్రాక్షల కోత ముగిసి పరిగె ఏరుకునేటప్పటిలా ఉంటుంది.+ 14  వాళ్లు తమ గొంతెత్తిసంతోషంతో కేకలు వేస్తారు. పడమటి* నుండి వాళ్లు యెహోవా ​గొప్పతనాన్ని చాటిస్తారు.+ 15  అందుకే వాళ్లు తూర్పు* ప్రాంతంలో+ యెహోవాను మహిమపరుస్తారు;సముద్ర ద్వీపాల్లో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరును మహిమపరుస్తారు.+ 16  భూమి అంచుల నుండి ఇలా పాటలు వినబడుతున్నాయి: “నీతిమంతుడైన దేవునికి+ మహిమ* ​కలగాలి!” కానీ నేనిలా అన్నాను: “నేను క్షీణించి​పోతున్నాను, క్షీణించిపోతున్నాను! అయ్యో, నాకు శ్రమ! మోసగాళ్లు మోసపూరితంగా ప్రవర్తించారు;వాళ్లు మోసంతో మోసపూరితంగా ప్రవర్తించారు.”+ 17  దేశ నివాసీ! నీ కోసం విపరీతమైన భయం, గోతులు, ఉచ్చులు ​వేచివున్నాయి.+ 18  భయం పుట్టించే శబ్దం విని పారిపోతున్న వ్యక్తి గోతిలో పడతాడు,గోతిలో నుండి పైకి వచ్చే వ్యక్తి ఉచ్చులో చిక్కుకుంటాడు.+ ఆకాశ తూములు* తెరవబడతాయి,నేల పునాదులు కంపిస్తాయి. 19  భూమి బద్దలైపోయింది;అది కుదిపేయబడింది;అది విపరీతంగా కంపిస్తోంది.+ 20  బాగా తాగిన వ్యక్తిలా భూమి ​తూలుతోంది,గాలికి గుడిసె ఊగినట్టు అది ​అటూఇటూ ఊగుతోంది. దాని పాపం దాని మీద చాలా బరువుగా ఉంది,+అది మళ్లీ లేవడం వీలుకాని విధంగా ​పడిపోతుంది. 21  ఆ రోజు యెహోవా, పైనున్న స్థలాల్లోని సైన్యం మీదికి,కిందున్న భూరాజుల మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు. 22  ఖైదీలను గుంటలోకి సమకూర్చినట్టు,వాళ్లను సమకూర్చి,చెరసాలలో వేసి, దాన్ని మూసేస్తారు;చాలా రోజుల తర్వాత ఆయన వాళ్ల​మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు. 23  నిండు చంద్రుడు చీకటి అవుతాడు,ప్రకాశించే సూర్యుడు వెలవెలబోతాడు,+ఎందుకంటే సైన్యాలకు అధిపతైన యెహోవా సీయోను పర్వతం+ మీద, యెరూషలేములో రాజయ్యాడు;+ఆయన తన ప్రజల పెద్దల* ముందు మహిమతో పరిపాలిస్తాడు.+

అధస్సూచీలు

లేదా “భూమిని.”
లేదా “ఎండిపోతోంది” అయ్యుంటుంది.
లేదా “పురాతన.”
లేదా “నిబంధనకు.”
లేదా “ఎండిపోతోంది” అయ్యుంటుంది.
అంటే, గిలకల తప్పెట.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అక్ష., “సముద్రం.”
అక్ష., “వెలుగు.”
లేదా “అలంకారం.”
లేదా “ప్రవాహ ద్వారాలు.”
అక్ష., “తన పెద్దల.”