యెషయా 17:1-14

  • దమస్కు గురించి తీర్పు సందేశం (1-11)

  • యెహోవా జనాల్ని గద్దిస్తాడు (12-14)

17  దమస్కు గురించిన సందేశం:+ “ఇదిగో! దమస్కు నగరంగా ఉండకుండా పోతుంది,అది శిథిలాల కుప్ప అవుతుంది.+   అరోయేరు+ నగరాలు విడిచిపెట్టబడతాయి;అవి మందలు పడుకునే స్థలాలుగా మారిపోతాయి,వాటిని భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.   ఎఫ్రాయిములో+ ప్రాకారాలుగల నగరాలు,దమస్కులో+ రాజ్యం లేకుండాపోతాయి;సిరియాలో మిగిలినవాళ్లుఇశ్రాయేలీయుల* మహిమలా తయారౌతారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.   “ఆ రోజు యాకోబు వైభవం తగ్గిపోతుంది,పుష్టిగా ఉన్న అతని శరీరం* బక్కచిక్కిపోతుంది.   అప్పుడు పరిస్థితి, కోతకోసే వ్యక్తి పొలంలో ధాన్యాన్ని సమకూరుస్తున్నప్పటిలా,అతని బాహువు వెన్నుల్ని కోసినప్పటిలా ఉంటుంది; రెఫాయీము లోయలో+ ఒక వ్యక్తి పరిగెను ఏరుకుంటున్నప్పటిలా ఉంటుంది.   పరిగె మాత్రమే మిగులుతుంది,అది ఒలీవ చెట్టు నుండి పండ్లను రాలగొట్టినప్పటిలా ఉంటుంది: దాని చిటారుకొమ్మ మీద రెండుమూడు ఒలీవ పండ్లు,బాగా కాసే దాని కొమ్మల మీద నాలుగైదు పండ్లు మాత్రమే మిగిలి ఉంటాయి”+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అంటున్నాడు.  ఆ రోజు మనిషి తన సృష్టికర్త వైపు చూస్తాడు, అతని కళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుని వైపు చూస్తాయి.  తన చేతులతో చేసిన+ బలిపీఠాల+ వైపు అతను చూడడు; అంతేకాదు, తన వేళ్లతో చేసినవాటి వైపు అంటే పూజా కర్రల* వైపు గానీ ధూపస్తంభాల వైపు గానీ అతను చూడడు.   ఆ రోజు, కోటలుగల అతని నగరాలు అడవిలో వదిలేయబడిన నివాస స్థలంలా,+ఇశ్రాయేలీయుల ముందు వదిలేయబడిన కొమ్మలా తయారౌతాయి,అది పనికిరాని భూమి అవుతుంది. 10  ఎందుకంటే రక్షకుడైన నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు,+ఆశ్రయదుర్గమైన*+ నీ కోటను నువ్వు గుర్తుచేసుకోలేదు. అందుకే నువ్వు అందమైన* తోటలు వేసి,అందులో అపరిచితుడి* కొమ్మను నాటుతున్నావు. 11  ఆ రోజు నువ్వు దాని చుట్టూ జాగ్రత్తగా కంచె వేశావు,ఉదయం విత్తనాలు మొలకెత్తేలా చేశావు,కానీ వ్యాధి, తీరని వేదన ఉండే రోజున పంట అంతా మాయమైపోతుంది.+ 12  వినండి! చాలా జనాల కోలాహలం వినిపిస్తోంది,వాటి ఘోష సముద్రాల ఘోషలా ఉంది! దేశాల గర్జన వినండి,అది గొప్ప ప్రవాహాల ధ్వనిలా ఉంది! 13  దేశాలు విస్తారమైన జలాల్లా గర్జిస్తాయి. ఆయన వాళ్లను గద్దిస్తాడు, వాళ్లు దూరంగా పారిపోతారు,కొండ ప్రాంతంలోని పొట్టు గాలికి కొట్టుకుపోయినట్టు వాళ్లు కొట్టుకుపోతారు,సుడిగాలికి ముళ్లకొమ్మ గిరగిర తిరిగినట్టు తిరుగుతారు. 14  సాయంకాలం భయం ఆవరిస్తుంది. తెల్లారేసరికి వాళ్లు ఇక ఉండరు. మమ్మల్ని కొల్లగొట్టే వాళ్లకు దక్కే భాగం ఇదే,మమ్మల్ని దోచుకునే వాళ్లకు పట్టే గతి ఇదే.

అధస్సూచీలు

అక్ష., “ఇశ్రాయేలు కుమారుల.”
అక్ష., “అతని శరీరంలోని కొవ్వు.”
పదకోశం చూడండి.
అక్ష., “బండరాయి అయిన.”
లేదా “ఆహ్లాదకరమైన.”
లేదా “అన్యదేవుడి.”