యెషయా 15:1-9

  • మోయాబు గురించి తీర్పు సందేశం (1-9)

15  మోయాబు గురించిన సందేశం:+ మోయాబులోని ఆరు+ రాత్రికిరాత్రే నాశనం చేయబడింది,అందుకే అది నిశ్శబ్దంగా ఉంది. మోయాబులోని కీరు+ రాత్రికిరాత్రే నాశనం చేయబడింది,అందుకే అది నిశ్శబ్దంగా ఉంది.   అతను ఏడ్వడం కోసం గుడికి, దీబోనుకు,+ఉన్నత స్థలాలకు ఎక్కివెళ్లాడు. మోయాబు నెబో+ గురించి, మేదెబా+ గురించి బోరున ఏడుస్తోంది. ప్రతీ తల బోడి చేయబడింది,+ ప్రతీ గడ్డం కత్తిరించబడింది.+   దాని వీధుల్లో వాళ్లు గోనెపట్ట కట్టుకున్నారు. తమ పైకప్పుల మీద, సంతవీధుల్లో దుఃఖిస్తున్నారు;వాళ్లు ఏడుస్తూ కిందికి దిగుతున్నారు.+   హెష్బోను, ఏలాలే+ కేకలు వేస్తున్నాయి;వాటి స్వరం యాహజు+ వరకు వినిపిస్తోంది. అందుకే ఆయుధాలు ధరించిన మోయాబు సైనికులు అరుస్తున్నారు. అతను భయంతో వణికిపోతున్నాడు.   మోయాబు గురించి నా హృదయం విలపిస్తోంది. దాని శరణార్థులు సోయరు+ వరకు, ఎగ్లాత్‌-షలీషియా+ వరకు పారిపోయారు. వాళ్లు లూహీతుకు ఎక్కివెళ్లే మార్గంలో ఏడుస్తూ నడుస్తున్నారు;హొరొనయీముకు వెళ్లే మార్గంలో నడుస్తూ విపత్తును బట్టి కేకలు వేస్తున్నారు.+   ఎందుకంటే నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి;పచ్చగడ్డి ఎండిపోయింది,గడ్డి లేకుండా పోయింది, పచ్చనిదేదీ మిగల్లేదు.   అందుకే వాళ్లు తమ గోదాముల్లో, తమ సంపదల్లో మిగిలినవాటిని మోసుకెళ్తున్నారు;నిరవంజి చెట్ల లోయను* దాటివెళ్తున్నారు.   వాళ్ల రోదన మోయాబు ప్రాంతమంతటా+ మారుమోగుతోంది. ఆ ఏడ్పు ఎగ్లయీము వరకు,బెయేరేలీము వరకు వినిపిస్తోంది.   ఎందుకంటే దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి,నేను దీమోనుకు చేయాల్సింది ఇంకా ఉంది: మోయాబులో తప్పించుకున్న వాళ్ల కోసం,దేశంలో మిగిలివున్న వాళ్ల కోసం నేను ఒక సింహాన్ని రప్పిస్తాను.+

అధస్సూచీలు

లేదా “వాగును.”