కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెషయా పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

 • 1

  • ఒక తండ్రి, తిరుగుబాటు చేసే అతని ​కుమారులు (1-9)

  • మొక్కుబడిగా చేసే ఆరాధన యెహోవాకు అసహ్యం (10-17)

  • “రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం” (18-20)

  • సీయోను మళ్లీ నమ్మకమైన నగరం అవుతుంది (21-31)

 • 2

  • యెహోవా పర్వతం హెచ్చించబడుతుంది (1-5)

   • ఖడ్గాల్ని నాగటి నక్కులుగా చేస్తారు (4)

  • యెహోవా రోజు గర్విష్ఠుల్ని అవమానాలపాలు చేస్తుంది (6-22)

 • 3

  • యూదా నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం (1-15)

  • కవ్వించే సీయోను కూతుళ్లకు తీర్పు తీర్చడం (16-26)

 • 4

  • ఏడుగురు స్త్రీలకు ఒక్క పురుషుడు (1)

  • యెహోవా మొలిపించేవాటి మహిమ గొప్పగా ఉంటుంది (2-6)

 • 5

  • యెహోవా ద్రాక్షతోట గురించిన పాట (1-7)

  • యెహోవా ద్రాక్షతోటకు శ్రమలు (8-24)

  • తన ప్రజల మీద దేవుని కోపం (25-30)

 • 6

  • యెహోవా తన ఆలయంలో ఉన్న దర్శనం (1-4)

   • “యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు” (3)

  • యెషయా పెదాలు శుద్ధి అయ్యాయి (5-7)

  • యెషయాకు నియామకం (8-10)

   • “నేనున్నాను! నన్ను పంపు!” (8)

  • “యెహోవా, ఎంతకాలం పాటు?” (11-13)

 • 7

  • ఆహాజు రాజుకు సందేశం (1-9)

   • షెయార్యాషూబు (3)

  • ఇమ్మానుయేలు గురించిన సూచన (10-17)

  • విశ్వాసఘాతుక ప్రవర్తన పర్యవసానాలు (18-25)

 • 8

  • అష్షూరీయులు దాడి చేస్తారు (1-8)

   • మహేరు-షాలాల్‌-హాష్‌-బజ్‌ (1-4)

  • భయపడకండి—“దేవుడు మాతో ఉన్నాడు!” (9-17)

  • యెషయా, అతని పిల్లలు సూచనలుగా ఉన్నారు (18)

  • ధర్మశాస్త్రం వైపు తిరగండి, చెడ్డదూతల వైపు కాదు (19-22)

 • 9

  • గలిలయ ప్రాంతానికి గొప్ప వెలుగు (1-7)

   • “శాంతికి అధిపతి” అయిన వ్యక్తి పుట్టుక (6, 7)

  • ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవుని చెయ్యి (8-21)

 • 10

  • ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవుని చెయ్యి (1-4)

  • అష్షూరు—దేవుని కోపాన్ని చూపించే కర్ర (5-11)

  • అష్షూరుకు శిక్ష (12-19)

  • యాకోబు శేషం తిరిగొస్తుంది (20-27)

  • దేవుడు అష్షూరుకు తీర్పుతీరుస్తాడు (28-34)

 • 11

  • యెష్షయి చిగురు నీతితో పరిపాలించడం (1-10)

   • తోడేలు, గొర్రెపిల్ల కలిసి నివసిస్తాయి (6)

   • యెహోవా గురించిన జ్ఞానంతో భూమి నిండిపోతుంది (9)

  • శేషాన్ని తిరిగి సమకూర్చడం (11-16)

 • 12

  • కృతజ్ఞతా పాట (1-6)

   • “యెహోవా యెహోవాయే నా శక్తి” (2)

 • 13

  • బబులోను గురించి తీర్పు సందేశం (1-22)

   • యెహోవా రోజు దగ్గర్లో ఉంది! (6)

   • మాదీయులు బబులోనును పడగొడతారు (17)

   • బబులోనులో ఎప్పటికీ ఎవరూ నివసించరు (20)

 • 14

  • ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తారు (1, 2)

  • బబులోను రాజును ఎగతాళి చేయడం (3-23)

   • మెరిసే నక్షత్రం ఆకాశం నుండి కిందపడుతుంది (12)

  • యెహోవా చెయ్యి అష్షూరును నలగ్గొడుతుంది (24-27)

  • ఫిలిష్తియ గురించి తీర్పు సందేశం (28-32)

 • 15

  • మోయాబు గురించి తీర్పు సందేశం (1-9)

 • 16

  • మోయాబు గురించిన సందేశం కొనసాగుతుంది (1-14)

 • 17

  • దమస్కు గురించి తీర్పు సందేశం (1-11)

  • యెహోవా జనాల్ని గద్దిస్తాడు (12-14)

 • 18

  • ఇతియోపియాకు వ్యతిరేకంగా సందేశం (1-7)

 • 19

  • ఐగుప్తు గురించి తీర్పు సందేశం (1-15)

  • ఐగుప్తు యెహోవాను తెలుసుకుంటుంది (16-25)

   • ఐగుప్తులో యెహోవాకు ఒక బలిపీఠం (19)

 • 20

  • ఐగుప్తుకు, ఇతియోపియాకు వ్యతిరేకంగా ఒక సూచన (1-6)

 • 21

  • సముద్రతీరాన ఉన్న ఎడారి గురించి సందేశం (1-10)

   • కావలిబురుజు మీద నుండి కాపలా కాయడం (8)

   • “బబులోను కూలిపోయింది!” (9)

  • దూమా, ఎడారి మైదానం గురించి సందేశం (11-17)

   • “కావలివాడా, రాత్రి ఎంత సమయమైంది?” (11)

 • 22

  • దర్శన లోయ గురించిన సందేశం (1-14)

  • గృహనిర్వాహకుడైన షెబ్నా స్థానంలోకి ఎల్యాకీము రావడం (15-25)

   • సూచనగా ఉన్న మేకు (23-25)

 • 23

  • తూరుకు వ్యతిరేకంగా సందేశం (1-18)

 • 24

  • యెహోవా దేశాన్ని ఖాళీ చేయిస్తాడు (1-23)

   • సీయోనులో యెహోవా రాజయ్యాడు (23)

 • 25

  • దేవుని ప్రజల మీద సమృద్ధిగా దీవెనలు (1-12)

   • శ్రేష్ఠమైన ద్రాక్షారసంతో యెహోవా విందు (6)

   • మరణం ఇక ఉండదు (8)

 • 26

  • నమ్మకం, రక్షణ గురించి పాట (1-21)

   • యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం (4)

   • భూమ్మీది ప్రజలు నీతిని నేర్చుకుంటారు (9)

   • “చనిపోయిన నీవాళ్లు బ్రతుకుతారు” (19)

   • లోపలి గదుల్లోకి ప్రవేశించి దాక్కోండి (20)

 • 27

  • లివ్యాతన్‌ను యెహోవా చంపేస్తాడు (1)

  • ఇశ్రాయేలును ద్రాక్షతోటతో పోలుస్తూ పాట (2-13)

 • 28

  • ఎఫ్రాయిము తాగుబోతులకు శ్రమ! (1-6)

  • యూదా యాజకులు, ప్రవక్తలు తూలడం (7-13)

  • “మరణంతో ఒప్పందం” (14-22)

   • సీయోనులో అమూల్యమైన మూలరాయి (16)

   • యెహోవా చేసే అసాధారణమైన పని (21)

  • యెహోవా తెలివైన క్రమశిక్షణ గురించి ఉదాహరణలు (23-29)

 • 29

  • అరీయేలుకు శ్రమ! (1-16)

   • కేవలం పెదవులతో ఘనపర్చడం తప్పు (13)

  • చెవిటివాళ్లు వింటారు; గుడ్డివాళ్లు చూస్తారు (17-24)

 • 30

  • ఐగుప్తు సహాయం పూర్తిగా వ్యర్థం (1-7)

  • ప్రవచన సందేశాన్ని ప్రజలు తిరస్కరిస్తారు (8-14)

  • నమ్మకం వల్ల బలం పొందడం (15-17)

  • యెహోవా తన ప్రజలమీద అనుగ్రహం చూపిస్తాడు (18-26)

   • యెహోవా మహాగొప్ప ఉపదేశకుడు (20)

   • “ఇదే దారి” (21)

  • యెహోవా అష్షూరు మీద తీర్పు అమలుచేస్తాడు (27-33)

 • 31

  • అసలైన సహాయం దేవుడు చేస్తాడు, మనుషులు కాదు (1-9)

   • ఐగుప్తు గుర్రాలు మాములు జంతువులే (3)

 • 32

  • రాజు, అధిపతులు అసలైన న్యాయం కోసం పరిపాలన చేస్తారు (1-8)

  • చీకూచింతా లేని స్త్రీలకు హెచ్చరిక (9-14)

  • పవిత్రశక్తి కుమ్మరించినప్పుడు దీవెనలు (15-20)

 • 33

  • తీర్పు, నీతిమంతులకు నిరీక్షణ (1-24)

   • యెహోవాయే న్యాయమూర్తి, శాసనకర్త, రాజు (22)

   • ఎవ్వరూ “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు (24)

 • 34

  • జనాల మీద యెహోవా పగతీర్చుకోవడం (1-4)

  • ఎదోము నిర్మానుష్యమౌతుంది (5-17)

 • 35

  • మళ్లీ పరదైసుగా మారుతుంది (1-7)

   • గుడ్డివాళ్లు చూస్తారు; చెవిటివాళ్లు వింటారు (5)

  • తిరిగి కొనబడినవాళ్ల కోసం పవిత్ర మార్గం (8-10)

 • 36

  • సన్హెరీబు యూదా మీదికి రావడం (1-3)

  • రబ్షాకే యెహోవాను దూషిస్తాడు (4-22)

 • 37

  • హిజ్కియా యెషయా ద్వారా దేవుని సహాయం కోరతాడు (1-7)

  • సన్హెరీబు యెరూషలేమును బెదిరించడం (8-13)

  • హిజ్కియా ప్రార్థన (14-20)

  • దేవుడిచ్చిన జవాబును యెషయా తెలియజేస్తాడు (21-35)

  • ఒక దేవదూత 1,85,000 మంది అష్షూరీయుల్ని చంపేస్తాడు (36-38)

 • 38

  • హిజ్కియా అనారోగ్యం, బాగవ్వడం (1-22)

   • కృతజ్ఞతా పాట (10-20)

 • 39

  • బబులోను నుండి సందేశకులు (1-8)

 • 40

  • దేవుని ప్రజలకు ఊరట (1-11)

   • ఎడారిలో ఒక స్వరం (3-5)

  • దేవుని గొప్పతనం (12-31)

   • దేశాలు చేద నుండి జారే నీటిబొట్టులా ఉన్నాయి (15)

   • దేవుడు “భూగోళానికి పైన” నివసిస్తున్నాడు (22)

   • నక్షత్రాలన్నిటినీ పేరు పెట్టి పిలవడం (26)

   • దేవుడు ఎప్పటికీ సొమ్మసిల్లడు (28)

   • యెహోవా మీద ఆశపెట్టుకునేవాళ్లు కొత్త బలం పొందుతారు (29-31)

 • 41

  • జయించే వ్యక్తి సూర్యోదయం వైపు నుండి వస్తాడు (1-7)

  • ఇశ్రాయేలు, దేవుని సేవకుడిగా ఎంచుకోబడ్డాడు (8-20)

   • “నా స్నేహితుడైన అబ్రాహాము” (8)

  • ఇతర దేవుళ్లను సవాలు చేయడం (21-29)

 • 42

  • దేవుని సేవకుడు, ఆయన నియామకం (1-9)

   • ‘నా పేరు యెహోవా’ (8)

  • యెహోవాను స్తుతించడానికి కొత్త పాట (10-17)

  • ఇశ్రాయేలు గుడ్డివాడు, చెవిటివాడు (18-25)

 • 43

  • యెహోవా తన ప్రజల్ని తిరిగి సమకూరుస్తాడు (1-7)

  • న్యాయ విచారణలో దేవుళ్లు (8-13)

   • “మీరే నా సాక్షులు” (10, 12)

  • బబులోను నుండి విడుదల (14-21)

  • “మన మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడుకుందాం” (22-28)

 • 44

  • దేవుడు ఎంచుకున్న ప్రజల మీద దీవెనలు (1-5)

  • యెహోవా తప్ప ఏ దేవుడూ లేడు (6-8)

  • మనుషులు చెక్కిన విగ్రహాలు వ్యర్థమైనవి (9-20)

  • యెహోవా ఇశ్రాయేలు విమోచకుడు (21-23)

  • కోరెషు ద్వారా పునరుద్ధరించడం (24-28)

 • 45

  • బబులోనును జయించడానికి కోరెషును అభిషేకించడం (1-8)

  • బంకమట్టి కుమ్మరివాడితో వాదించకూడదు (9-13)

  • ఇతర జనాలు ఇశ్రాయేలును గుర్తిస్తాయి (14-17)

  • సృష్టి విషయంలో, సంగతుల్ని తెలియజేయడంలో దేవుడు నమ్మదగినవాడు (18-25)

   • భూమి నివాస స్థలంగా చేయబడింది (18)

 • 46

  • బబులోనీయుల విగ్రహాలకు, ఇశ్రాయేలు దేవునికి తేడా (1-13)

   • యెహోవా భవిష్యత్తును చెప్తాడు (10)

   • తూర్పు నుండి వేటపక్షి (11)

 • 47

  • బబులోను కూలిపోవడం (1-15)

   • జ్యోతిష్యుల సంగతి బయటపెట్టడం (13-15)

 • 48

  • ఇశ్రాయేలును గద్దించి, శుద్ధిచేయడం (1-11)

  • బబులోను మీద యెహోవా చర్య తీసుకోవడం (12-16ఎ)

  • దేవుని ఉపదేశం ప్రయోజనకరం (16బి-19)

  • “బబులోను నుండి బయటికి వెళ్లండి!” (20-22)

 • 49

  • యెహోవా సేవకుడి నియామకం (1-12)

   • దేశాలకు వెలుగు (6)

  • ఇశ్రాయేలుకు ఓదార్పు (13-26)

 • 50

  • ఇశ్రాయేలు పాపాల వల్ల సమస్యలు (1-3)

  • విధేయుడైన యెహోవా సేవకుడు (4-11)

   • శిష్యునికి ఉండేలాంటి నోరు, చెవి (4)

 • 51

  • సీయోను మళ్లీ ఏదెను తోటలా అవ్వడం (1-8)

  • సీయోనును చేసిన శక్తిమంతుడి నుండి ఓదార్పు (9-16)

  • యెహోవా ఉగ్రతపాత్ర (17-23)

 • 52

  • సీయోనూ! లే! (1-12)

   • మంచివార్త తెచ్చేవాళ్ల అందమైన పాదాలు (7)

   • సీయోను కావలివాళ్లు ఏకస్వరంతో కేకలు వేస్తారు (8)

   • యెహోవా పాత్రల్ని మోసేవాళ్లు పవిత్రంగా ఉండాలి (11)

  • యెహోవా సేవకుడు హెచ్చించ​బడతాడు (13-15)

   • వికారంగా మారిన రూపం (14)

 • 53

  • యెహోవా సేవకుడి వేదన, మరణం, సమాధి చేయడం (1-12)

   • చీదరించబడడం, దూరం పెట్టడం (3)

   • రోగాల్ని, నొప్పుల్ని భరిస్తాడు (4)

   • “వధించడానికి గొర్రెను తీసుకొచ్చినట్టు ఆయన్ని తీసుకొచ్చారు” (7)

   • ఆయన అనేకమంది పాపాల్ని మోశాడు (12)

 • 54

  • గొడ్రాలైన సీయోనుకు చాలామంది కుమారులు (1-17)

   • యెహోవా, సీయోనుకు భర్త (5)

   • సీయోను కుమారులకు యెహోవా బోధిస్తాడు (13)

   • సీయోనుకు వ్యతిరేకంగా ఉన్న ఆయుధాలు విఫలమౌతాయి (17)

 • 55

  • ఉచితంగా తిని, తాగమని పిలుపు (1-5)

  • యెహోవా కోసం, నమ్మదగిన ఆయన మాట కోసం వెదకండి (6-13)

   • దేవుని మార్గాలు మనుషుల మార్గాల కన్నా ఉన్నతమైనవి (8, 9)

   • దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది (10, 11)

 • 56

  • పరదేశులకు, నపుంసకులకు దీవెనలు (1-8)

   • అందరూ ప్రార్థించే మందిరం (7)

  • కావలివాళ్లు గుడ్డివాళ్లు, మూగ కుక్కలు (9-12)

 • 57

  • నీతిమంతుడు, విశ్వసనీయులు నశించిపోవడం (1, 2)

  • ఇశ్రాయేలు ఆధ్యాత్మిక వ్యభిచారం బట్టబయలౌతుంది (3-13)

  • దీనులకు ఓదార్పు (14-21)

   • దుష్టులు అల్లకల్లోలంగా ఉన్న సముద్రం లాంటివాళ్లు (20)

   • దుష్టులకు మనశ్శాంతి ఉండదు (21)

 • 58

  • అసలైన ఉపవాసం, తప్పుడు ఉపవాసం (1-12)

  • విశ్రాంతి రోజును ఆచరించడంలో సంతోషించడం (13, 14)

 • 59

  • పాపాల వల్ల ఇశ్రాయేలు దేవునికి దూరం కావడం (1-8)

  • పాపాలు ఒప్పుకోవడం (9-15ఎ)

  • పశ్చాత్తాపపడిన వాళ్ల తరఫున యెహోవా జోక్యం చేసుకుంటాడు (15బి-21)

 • 60

  • సీయోను మీద యెహోవా మహిమ ప్రకాశిస్తుంది (1-22)

   • గూళ్లకు చేరుకుంటున్న పావురాల్లా (8)

   • రాగికి బదులు బంగారం (17)

   • అల్పుడు వెయ్యిమంది అవుతాడు (22)

 • 61

  • మంచివార్త ప్రకటించడానికి అభిషేకించడం (1-11)

   • “యెహోవా అనుగ్రహ సంవత్సరం” (2)

   • “నీతి వృక్షాలు” (3)

   • పరదేశులు సహాయం చేస్తారు (5)

   • “యెహోవా యాజకులు” (6)

 • 62

  • సీయోను కొత్త పేరు (1-12)

 • 63

  • జనాల మీద యెహోవా పగతీర్చుకోవడం (1-6)

  • గతంలో యెహోవా చూపించిన విశ్వసనీయ ప్రేమ (7-14)

  • పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన (15-19)

 • 64

  • పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన కొనసాగింపు (1-12)

   • యెహోవా ‘మా కుమ్మరి’ (8)

 • 65

  • విగ్రహాల్ని పూజించేవాళ్లకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు (1-16)

   • అదృష్ట దేవత, విధి దేవుడు (11)

   • “నా సేవకులు భోజనం చేస్తారు” (13)

  • కొత్త ఆకాశం, కొత్త భూమి (17-25)

   • ఇళ్లు కట్టుకుంటారు; ద్రాక్షతోటలు నాటుకుంటారు (21)

   • ఎవ్వరూ వృథాగా ప్రయాసపడరు (23)

 • 66

  • నిజమైన ఆరాధన, అబద్ధ ఆరాధన (1-6)

  • సీయోను తల్లి, ఆమె కుమారులు (7-17)

  • యెరూషలేములో ఆరాధించడానికి ప్రజల్ని సమకూర్చడం (18-24)