యిర్మీయా 50:1-46

  • బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-46)

    • బబులోను నుండి పారిపోండి (8)

    • ఇశ్రాయేలీయులు తిరిగొస్తారు (17-19)

    • బబులోను జలాలు ఎండిపోతాయి (38)

    • బబులోను నిర్జనంగా తయారౌతుంది (39, 40)

50  బబులోను గురించి, కల్దీయుల దేశం గురించి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్యం:+   “దేశాల మధ్య చాటించండి, ప్రకటించండి. ధ్వజం* ఎత్తి చాటించండి. ఏదీ దాచకండి! ఇలా చెప్పండి: ‘బబులోను పట్టబడింది.+ బేలు అవమానాలపాలు అయ్యాడు.+ మెరోదకు బెదిరిపోయాడు. ఆమె ప్రతిమలు అవమానాలపాలు అయ్యాయి. ఆమె అసహ్యమైన విగ్రహాలు* బెదిరిపోయాయి.’   ఎందుకంటే ఉత్తర దిక్కు నుండి ఒక దేశం ఆమె మీదికి వచ్చింది.+ అది ఆమె దేశాన్ని భయంకరంగా మారుస్తోంది;అందులో ఎవరూ నివసించట్లేదు. మనుషులు పారిపోయారు, జంతువులు పారిపోయాయి;వాళ్లు ఇక లేరు.”  “ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి వస్తారు.+ వాళ్లు ఏడుస్తూ నడుస్తారు,+ అందరూ కలిసి తమ దేవుడైన యెహోవా నిర్దేశాన్ని వెదుకుతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.  “వాళ్లు సీయోను వైపు తిరిగి సీయోనుకు దారి అడుగుతూ,+ ‘రండి, ఎప్పటికీ మరవబడని శాశ్వత ఒప్పందం ద్వారా యెహోవాకు కట్టుబడి ఉందాం’+ అని అంటారు.  నా ప్రజలు తప్పిపోయిన గొర్రెల మంద అయ్యారు.+ వాటి కాపరులే వాటిని తప్పుదారి పట్టించారు.+ వాళ్లు పర్వతాల మీదికి వాటిని తీసుకొచ్చారు. అవి పర్వతాల మీద, కొండల మీద తిరుగుతూ తమ విశ్రాంతి స్థలాన్ని మర్చిపోయాయి.  వాటిని చూసిన వాళ్లంతా వాటిని మింగేశారు.+ వాళ్ల శత్రువులు, ‘మేము నిర్దోషులం. వాళ్లు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు; నీతి నివసించే స్థలం, తమ పూర్వీకుల నిరీక్షణ అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు’ అని అన్నారు.”   “బబులోను నుండి పారిపోండి,కల్దీయుల దేశం నుండి వెళ్లిపోండి,+మంద ముందు నడిచే మేకపోతుల్లా, పొట్టేళ్లలా ఉండండి.   ఎందుకంటే ఇదిగో నేను ఉత్తర దేశం నుండి గొప్పగొప్ప జనాల సమూహాన్ని రేపి,వాటిని బబులోను మీదికి రప్పిస్తున్నాను.+ వాళ్లు యుద్ధ పంక్తులు తీరి ఆమె మీదికి వస్తారు; ఆమె పట్టబడుతుంది. వాళ్ల బాణాలు యోధుల బాణాల్లాంటివి,అవి కరుణ లేకుండా పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేస్తాయి;+అవి గురి తప్పవు. 10  కల్దీయ దేశం దోపుడుసొమ్ము అవుతుంది.+ దాన్ని కొల్లగొట్టే వాళ్లంతా పూర్తిగా తృప్తి చెందుతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 11  “ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని దోచుకుంటున్నప్పుడు+మీరు సంతోషిస్తూ, ఉల్లసిస్తూ ఉన్నారు.+ పచ్చగడ్డి మీద ఆవుదూడలా గంతులు వేస్తూ ఉన్నారు,మగ గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు. 12  మీ అమ్మ అవమానాలపాలైంది.+ మిమ్మల్ని కన్న తల్లి నిరాశకు గురైంది. ఇదిగో! దేశాల్లో ఆమె అల్పమైనది,అది నీళ్లులేని నిర్జన ప్రాంతం, ఎడారి.+ 13  యెహోవా ఉగ్రత వల్ల దానిలో ఎవ్వరూ నివసించరు;+అది పూర్తిగా నిర్మానుష్యమౌతుంది. బబులోను పక్కగా వెళ్లే వాళ్లంతాఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు, ఆమె తెగుళ్లన్నిటినీ చూసి ఈల వేస్తారు.+ 14  విల్లు వంచే వాళ్లారా, మీరంతా యుద్ధ పంక్తులు తీరిఅన్నివైపుల నుండి బబులోను మీదికి రండి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మీ బాణాలన్నీ ఆమె మీదికి వేయండి,+ఎందుకంటే, ఆమె యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది.+ 15  అన్నివైపుల నుండి ఆమె మీద యుద్ధకేకలు వేయండి. ఆమె లొంగిపోయింది. ఆమె స్తంభాలు పడిపోయాయి, ఆమె ప్రాకారాలు కూలిపోయాయి,+అది యెహోవా చేసే ప్రతీకారం.+ ఆమె మీద పగతీర్చుకోండి. ఆమె చేసినట్టే ఆమెకూ చేయండి.+ 16  బబులోనులో విత్తేవాళ్లు,కోతకాలంలో కొడవలి పట్టుకునేవాళ్లు లేకుండా చేయండి.+ క్రూరమైన ఖడ్గంవల్ల ప్రతీ వ్యక్తి తన సొంత ప్రజల దగ్గరికి తిరిగెళ్లిపోతాడు, ప్రతీ వ్యక్తి తన స్వదేశానికి పారిపోతాడు.+ 17  “ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయిన గొర్రెలు.+ సింహాలు వాటిని చెదరగొట్టాయి. ముందు అష్షూరు రాజు వాళ్లను మింగేశాడు;+ తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు* వాళ్ల ఎముకల్ని నలగ్గొట్టాడు.+ 18  కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను అష్షూరు రాజును శిక్షించినట్టే బబులోను రాజును, అతని దేశాన్ని శిక్షిస్తాను.+ 19  నేను ఇశ్రాయేలును అతని పచ్చిక మైదానానికి తిరిగి తీసుకొస్తాను;+ అతను కర్మెలు మీద, బాషాను మీద మేస్తాడు;+ ఎఫ్రాయిము+ పర్వతాల మీద, గిలాదు+ పర్వతాల మీద తృప్తిగా తింటాడు.’ ” 20  “ఆ రోజుల్లో, ఆ సమయంలోఇశ్రాయేలులో దోషం కోసం వెతికినా కనబడదు,యూదాలో ఏ పాపాలు కనబడవు,ఎందుకంటే, నేను మిగిలిపోనిచ్చిన వాళ్లను క్షమిస్తాను” అని యెహోవా అంటున్నాడు.+ 21  “మెరాతయీము దేశం మీదికి, పెకోదు నివాసుల మీదికి వెళ్లు.+ వాళ్లు హతమవ్వాలి, సమూలంగా నాశనమవ్వాలి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయి. 22  దేశంలో యుద్ధ ధ్వని,గొప్ప నాశన ధ్వని వినిపిస్తోంది. 23  భూమ్మీది దేశాలన్నిటినీ చితగ్గొట్టిన సుత్తి ఎలా విరగ్గొట్టబడి, ముక్కలైంది!+ దేశాల మధ్య బబులోను ఎలా భయంకరంగా తయారైంది!+ 24  బబులోనూ, నేను నీ కోసం ఒక ఉచ్చు పన్నాను, నువ్వు చిక్కుకున్నావు,నీకు ఆ విషయం తెలీదు. నువ్వు దొరికిపోయావు, పట్టబడ్డావు,+ఎందుకంటే, నువ్వు యెహోవాను ఎదిరించావు. 25  యెహోవా తన ఆయుధశాలను తెరిచి,తన ఉగ్రతను వెళ్లగక్కే ఆయుధాల్ని బయటికి తెస్తున్నాడు.+ ఎందుకంటే, కల్దీయుల దేశంలోసర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాకు ఒక పని ఉంది. 26  దూర ప్రాంతాల నుండి ఆమె మీదికి రండి.+ ఆమె ధాన్యపు గోదాముల్ని తెరవండి.+ ఆమె దోపుడుసొమ్మును ధాన్యపు కుప్పల్లా పోగుచేయండి. ఆమెను పూర్తిగా నాశనం చేయండి.+ ఆమెకు ఎవ్వరూ మిగలకూడదు. 27  ఆమె ఎద్దులన్నిటినీ* వధించండి;+అవి వధకు వెళ్లాలి. వాళ్లకు శ్రమ, ఎందుకంటే వాళ్ల రోజు,వాళ్లను లెక్క అడిగే సమయం వచ్చేసింది! 28  బబులోను దేశం నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ల శబ్దం వినిపిస్తోంది.వాళ్లు సీయోనులో మన దేవుడైన యెహోవా ప్రతీకారాన్ని,ఆయన ఆలయం గురించిన ప్రతీకారాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు.+ 29  బబులోను మీదికి విలుకాండ్రను, విల్లు వంచే వాళ్లందర్నీ పిలిపించండి.+ఆమె చుట్టూ ముట్టడి వేయండి; ఎవ్వర్నీ తప్పించుకోనివ్వకండి. ఆమె చేసిన పనుల్ని బట్టి ఆమెకు ప్రతీకారం చేయండి.+ ఆమె చేసినట్టే ఆమెకూ చేయండి.+ ఎందుకంటే ఆమె యెహోవాకు వ్యతిరేకంగా,ఇశ్రాయేలు పవిత్ర దేవునికి వ్యతిరేకంగా అహంకారంతో ప్రవర్తించింది.+ 30  కాబట్టి ఆమె యువకులు ఆమె సంతవీధుల్లో పడిపోతారు,+ఆ రోజు ఆమె సైనికులందరూ నశించిపోతారు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 31  “ఎదిరించేవాడా,+ ఇదిగో! నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను”+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ప్రకటిస్తున్నాడు,“నీ రోజు, నేను నిన్ను లెక్క అడిగే సమయం తప్పకుండా వస్తుంది. 32  ఎదిరించేవాడా, నువ్వు తడబడి పడిపోతావు,నిన్ను లేపేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ నేను నీ నగరాలకు నిప్పంటిస్తాను,అది నీ చుట్టూ ఉన్నవాటన్నిటినీ దహించేస్తుంది.” 33  సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అణచివేయబడుతున్నారు,వాళ్లను బందీలుగా తీసుకెళ్లినవాళ్లంతా వాళ్లను గట్టిగా పట్టుకున్నారు.+ వాళ్లను విడిచిపెట్టట్లేదు.+ 34  అయితే వాళ్ల విమోచకుడు బలవంతుడు.+ ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.+ వాళ్ల దేశానికి విశ్రాంతిని ఇవ్వడానికి,+బబులోను నివాసుల్ని కలవరపెట్టడానికి+ఆయన తప్పకుండా వాళ్ల వ్యాజ్యాన్ని వాదిస్తాడు.”+ 35  యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “కల్దీయులకు వ్యతిరేకంగా,బబులోను నివాసులకు, ఆమె అధిపతులకు, జ్ఞానులకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది.+ 36  పనికిరాని మాటలు మాట్లాడేవాళ్లకు* వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది, వాళ్లు తెలివితక్కువగా ప్రవర్తిస్తారు. ఆమె యోధులకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది, వాళ్లు బెదిరిపోతారు.+ 37  వాళ్ల గుర్రాలకు, యుద్ధ రథాలకు,ఆమె మధ్య ఉన్న రకరకాల ప్రజలకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది.వాళ్లు స్త్రీలలా అవుతారు.+ ఆమె సంపదలకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది, అవి దోచుకోబడతాయి.+ 38  ఆమె జలాల మీద ఒక నాశనం ఉంది, అవి ఎండిపోతాయి.+ ఎందుకంటే, అది చెక్కిన విగ్రహాలున్న దేశం,+భయపెట్టే తమ దర్శనాల వల్ల వాళ్లు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. 39  కాబట్టి, ఎడారి ప్రాణులు ఊల వేసే జంతువులతో పాటు నివసిస్తాయి,నిప్పుకోళ్లు దానిలో నివసిస్తాయి.+ అయితే ఇంకెప్పుడూ ప్రజలు దానిలో నివసించరు,తరతరాలపాటు అది ఎప్పటికీ నివాస స్థలంగా ఉండదు.”+ 40  “దేవుడు సొదొమ గొమొర్రాల్ని, వాటి చుట్టుపక్కల పట్టణాల్ని+ నాశనం చేసినప్పుడు జరిగినట్టే,+ అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎవ్వరూ స్థిరపడరు”+ అని యెహోవా అంటున్నాడు. 41  “ఇదిగో! ఉత్తర దిక్కు నుండి ఒక జనం వస్తోంది;భూమి సుదూర ప్రాంతాల నుండి+ఒక గొప్ప దేశం, మహిమగల రాజులు+ లేస్తారు. 42  వాళ్ల దగ్గర విల్లు, ఈటె ఉన్నాయి.+ వాళ్లు క్రూరులు, కరుణ చూపించరు.+ వాళ్లు గుర్రాలమీద స్వారీ చేస్తున్నప్పుడుఆ శబ్దం సముద్ర ఘోషలా ఉంది.+ బబులోను కూతురా, వాళ్లంతా కలిసి యుద్ధ పంక్తులు తీరి నీమీదికి వస్తున్నారు.+ 43  బబులోను రాజు వాళ్ల గురించిన వార్త విన్నాడు,+అతని చేతులు చచ్చుబడిపోయాయి.+ ఆందోళన, ప్రసవిస్తున్న స్త్రీలాంటి వేదన అతన్ని పట్టుకున్నాయి. 44  “ఇదిగో! యొర్దాను పక్కనున్న దట్టమైన పొదల్లో నుండి సింహం వచ్చినట్టు, సురక్షితమైన పచ్చికబయళ్ల మీదికి ఒకవ్యక్తి వస్తాడు, అయితే నేను ఒక్క క్షణంలో వాళ్లను ఆమె దగ్గర నుండి వెళ్లగొడతాను. ఎంచుకోబడిన వ్యక్తిని ఆమె మీద నియమిస్తాను.+ ఎందుకంటే, నాలాంటివాళ్లు ఎవరున్నారు? నన్ను సవాలు చేసేదెవరు? నా ముందు ఏ కాపరి నిలబడగలడు?+ 45  కాబట్టి మనుషులారా, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని,*+ కల్దీయుల దేశానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఆలోచనను వినండి: ఖచ్చితంగా మందలోని గొర్రెపిల్లలు ఈడ్చుకెళ్లబడతాయి. వాళ్లను బట్టి వాటి నివాస స్థలం నిర్జనంగా మారుతుంది.+ 46  బబులోను పట్టబడినప్పుడు, ఆ శబ్దానికి భూమి కంపిస్తుంది,దేశాల మధ్య ఆర్తనాదాలు వినిపిస్తాయి.”+

అధస్సూచీలు

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “ధ్వజస్తంభం.”
అక్ష., “నెబుకద్రెజరు.”
లేదా “కోడెదూడలన్నిటినీ.”
లేదా “అబద్ధ ప్రవక్తలకు.”
లేదా “ఆలోచనను.”