యిర్మీయా 47:1-7

  • ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం (1-7)

47  ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం.+ ఫరో గాజాను ఓడించక ముందు అది వచ్చింది.  యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! ఉత్తర దిక్కు నుండి జలాలు వస్తున్నాయి. అవి వరదలై పారతాయి. దేశం మీద, దానిలో ఉన్నవాటన్నిటి మీద,నగరం మీద, దాని నివాసుల మీద ప్రవహిస్తాయి. మనుషులు ఆర్తనాదాలు పెడతారు,దేశంలో నివసిస్తున్న వాళ్లంతా విలపిస్తారు.   అతని మగ గుర్రాల డెక్కల చప్పుడు,అతని యుద్ధ రథాల ధ్వని,అతని చక్రాల శబ్దం వినబడినప్పుడుతండ్రులు తమ కుమారుల కోసం కూడా వెనక్కి తిరిగి చూడరు,వాళ్ల చేతులు చచ్చుబడిపోతాయి,   ఎందుకంటే వస్తున్న ఆ రోజు ఫిలిష్తీయులందర్నీ నాశనం చేస్తుంది;+తూరు,+ సీదోనులతో+ సంధి చేసుకున్న మిగతా దేశాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే యెహోవా ఫిలిష్తీయుల్ని,కఫ్తోరు*+ ద్వీపం నుండి వచ్చిన వాళ్లలో మిగిలినవాళ్లను నాశనం చేస్తాడు.   గాజా తల బోడి అవుతుంది.* అష్కెలోను నిశ్శబ్దమైంది.+ వాటి లోయ మైదానంలో మిగిలినవాళ్లారా,ఎంతకాలం మీరు మీ శరీరాల్ని కోసుకుంటూ ఉంటారు?+   యెహోవా ఖడ్గమా!+ ఎంతకాలం నువ్వు నిమ్మళించవు? తిరిగి నీ ఒరలోకి వెళ్లు. విశ్రాంతి తీసుకో, మౌనంగా ఉండు.   యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు,అది ఎలా మౌనంగా ఉంటుంది? అష్కెలోను మీద, సముద్రతీర ప్రాంతం మీద+ఆయన దాన్ని నియమించాడు.”

అధస్సూచీలు

అంటే, క్రేతు.
అంటే, వాళ్లు దుఃఖంతో, అవమానంతో గుండు చేసుకుంటారు.