యిర్మీయా 45:1-5

  • బారూకుకు యెహోవా సందేశం (1-5)

45  యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన నాలుగో సంవత్సరంలో+ నేరీయా కుమారుడైన బారూకు+ యిర్మీయా చెప్పిన మాటల్ని ఒక పుస్తకంలో రాసినప్పుడు, యిర్మీయా ప్రవక్త బారూకుతో చెప్పిన మాట ఇది:+  “బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ గురించి ఇలా అంటున్నాడు:  ‘నువ్వు, “అయ్యో నాకు శ్రమ! ఎందుకంటే యెహోవా నా నొప్పికి దుఃఖాన్ని చేర్చాడు! నేను మూలిగీ మూలిగీ అలసిపోయాను, నాకు విశ్రాంతి స్థలమే దొరకలేదు” అని అన్నావు.’  “నువ్వు అతనికి ఇలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! నేను కట్టినదాన్ని పడగొడుతున్నాను, నేను నాటినదాన్ని పెల్లగిస్తున్నాను, దేశమంతటికీ ఇలాగే చేస్తాను.+  కానీ నువ్వు నీకోసం గొప్పవాటిని వెతుకుతున్నావు.* అలాంటివి వెతకడం ఆపేయి.” ’ “ ‘ఎందుకంటే నేను మనుషులందరి మీదికి విపత్తు తీసుకురాబోతున్నాను,+ అయితే నువ్వు వెళ్లే ప్రతీచోట నీ ప్రాణాన్ని నీకు దోపుడుసొమ్ముగా ఇస్తాను’* అని యెహోవా అంటున్నాడు.”+

అధస్సూచీలు

లేదా “గొప్పవాటి కోసం ఎదురుచూస్తున్నావు.”
లేదా “నిన్ను ప్రాణాలతో తప్పించుకోనిస్తాను.”