యిర్మీయా 27:1-22

  • బబులోను కాడి (1-11)

  • బబులోనుకు లోబడమని సిద్కియాకు చెప్పడం (12-22)

27  యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన ఆరంభంలో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “యెహోవా నాకు ఇలా చెప్పాడు: ‘నీ కోసం కట్లను, కాడి మానుల్ని చేసుకుని నీ మెడమీద పెట్టుకో.  తర్వాత వాటిని యెరూషలేములోని యూదా రాజైన సిద్కియా దగ్గరికి వచ్చిన సందేశకుల ద్వారా ఎదోము+ రాజు దగ్గరికి, మోయాబు+ రాజు దగ్గరికి, అమ్మోనీయుల+ రాజు దగ్గరికి, తూరు+ రాజు దగ్గరికి, సీదోను+ రాజు దగ్గరికి పంపించు.  వాళ్ల యజమానులకు ఈ ఆజ్ఞను చెప్పమను: “ ‘ “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు; మీరు మీ యజమానులకు చెప్పాల్సింది ఇదే:  ‘నా గొప్ప శక్తితో, చాచిన బాహువుతో భూమిని, మనుషుల్ని, నేలమీదున్న జంతువుల్ని చేసింది నేనే; నేను వీటన్నిటినీ నాకు నచ్చిన* వాళ్ల చేతికి అప్పగించాను.+  ఇప్పుడు నేను ఈ దేశాలన్నిటినీ నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాను;+ అతన్ని సేవించేలా చివరికి జంతువుల్ని కూడా నేను అతనికి అప్పగించాను.  అతని దేశం వంతు వచ్చేవరకు దేశాలన్నీ అతనికి, అతని కుమారుడికి, అతని మనవడికి సేవచేస్తాయి;+ అప్పుడు చాలా దేశాలు, గొప్పగొప్ప రాజులు అతన్ని బానిసగా చేసుకుంటారు.’+  “ ‘ “ ‘ఏ దేశమైనా, రాజ్యమైనా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవచేయడానికి, బబులోను రాజు కాడి కింద మెడ వంచడానికి ఒప్పుకోకపోతే నేను ఆ దేశాన్ని ఖడ్గంతో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను;+ అతని ద్వారా వాళ్లను పూర్తిగా నాశనం చేసేవరకు అలా చేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.  “ ‘ “ ‘కాబట్టి, “మీరు బబులోను రాజుకు సేవచేయరు” అని మీ ప్రవక్తలు, సోదెగాళ్లు, కలలు కనేవాళ్లు, ఇంద్రజాలకులు, మాంత్రికులు చెప్తున్న మాటలు వినకండి. 10  ఎందుకంటే వాళ్లు మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. మీరు వాళ్ల మాట వింటే, మీరు మీ దేశం నుండి దూరంగా తీసుకెళ్లబడతారు; నేను మిమ్మల్ని చెదరగొడతాను, మీరు నశించిపోతారు. 11  “ ‘ “ ‘అయితే బబులోను రాజు కాడి కింద మెడను వంచి, అతనికి సేవచేసే జనాన్ని తమ దేశంలోనే ఉండనిస్తాను, వాళ్లు దాన్ని సేద్యం చేసుకుంటూ, అక్కడే నివసిస్తారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ” 12  యూదా రాజైన సిద్కియాతో+ కూడా నేను అలాగే చెప్పాను: “మీరు ప్రాణాలతో ఉండాలంటే, బబులోను రాజు కాడి కింద మెడలు వంచి అతనికి, అతని ప్రజలకు సేవచేయండి.+ 13  బబులోను రాజుకు సేవచేయని దేశాల గురించి యెహోవా చెప్పినట్టు, నువ్వూ నీ ప్రజలూ ఖడ్గం వల్ల,+ కరువు వల్ల,+ తెగులు వల్ల+ ఎందుకు చనిపోవాలి? 14  ‘మీరు బబులోను రాజుకు సేవచేయరు’ అని మీతో చెప్తున్న ప్రవక్తల మాటలు వినకండి.+ ఎందుకంటే, వాళ్లు మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు.+ 15  “ ‘నేను వాళ్లను పంపలేదు, అయినా వాళ్లు నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్నారు. మీరు వాళ్ల మాటలు వింటే, నేను మిమ్మల్ని చెదరగొడతాను, మీరూ మీకు ప్రవచనాలు చెప్తున్న ఆ ప్రవక్తలూ నశించిపోతారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+ 16  యాజకులతో, ప్రజలందరితో నేను ఇలా అన్నాను: “యెహోవా ఇలా అంటున్నాడు: ‘ “ఇదిగో! యెహోవా మందిరంలోని పాత్రలు త్వరలోనే బబులోను నుండి తీసుకురాబడతాయి!” అని ప్రవచిస్తున్న ప్రవక్తల మాటలు వినకండి.+ ఎందుకంటే వాళ్లు మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు.+ 17  వాళ్ల మాటలు వినకండి. బబులోను రాజుకు సేవచేయండి, అప్పుడు మీరు ప్రాణాలతో ఉంటారు.+ ఈ నగరం ఎందుకు పాడైపోవాలి? 18  వాళ్లు నిజంగా ప్రవక్తలైతే, యెహోవా వాక్యం వాళ్ల దగ్గర ఉంటే, యెహోవా మందిరంలో, యూదా రాజు రాజభవనంలో, యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తీసుకెళ్లబడకుండా ఉండేలా వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవాను వేడుకోవాలి.’ 19  “ఎందుకంటే స్తంభాల+ గురించి, సముద్రం*+ గురించి, బండ్ల+ గురించి, ఈ నగరంలో మిగిలిన ఇతర పాత్రల గురించి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు. 20  అవి బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి యెహోయాకీము కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను, యూదా, యెరూషలేముల ప్రముఖులందర్నీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లినప్పుడు పట్టుకెళ్లని పాత్రలు;+ 21  అవును, యెహోవా మందిరంలో, యూదా రాజు రాజభవనంలో, యెరూషలేములో మిగిలిన పాత్రల గురించి, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: 22  ‘ “వాటిని బబులోనుకు తీసుకెళ్తారు,+ నేను వాటిమీద దృష్టిపెట్టే రోజు వరకు అవి అక్కడే ఉంటాయి. తర్వాత నేను వాటిని వెనక్కి తీసుకొచ్చి, ఈ స్థలంలో ఉంచుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”+

అధస్సూచీలు

అక్ష., “నా దృష్టికి సరైనదని అనిపించిన.”
అంటే, ఆలయానికి చెందిన రాగి సముద్రం.