యిర్మీయా 18:1-23

  • కుమ్మరి చేతిలో బంకమట్టి (1-12)

  • యెహోవా ఇశ్రాయేలుకు వీపు చూపిస్తాడు (13-17)

  • యిర్మీయా మీద కుట్ర; అతని మొర (18-23)

18  యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “నువ్వు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు,+ అక్కడ నీకు నా మాటలు వినిపిస్తాను.”  కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అతను సారె* మీద పనిచేస్తున్నాడు.  అతను బంకమట్టితో చేస్తున్న పాత్ర అతని చేతుల్లో పాడైంది, అప్పుడు ఆ మట్టితో ఏ పాత్ర చేయడం అతనికి మంచిదని* అనిపించిందో ఆ పాత్రను చేశాడు.  అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఈ కుమ్మరి చేసినట్టే నేను మీకు చేయలేనా?’ అని యెహోవా అంటున్నాడు. ‘ఇదిగో! కుమ్మరి చేతిలో బంకమట్టి ఎలా ఉందో, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరూ నా చేతిలో అలానే ఉన్నారు.+  నేను ఒక దేశం గానీ రాజ్యం గానీ పెల్లగించబడుతుందని, కూలగొట్టబడుతుందని, నాశనం చేయబడుతుందని చెప్పినప్పుడు+  ఆ దేశం తన దుష్టత్వాన్ని విడిచిపెడితే, నేను కూడా దాని మీదికి తీసుకురావాలనుకున్న విపత్తు విషయంలో నా మనసు మార్చుకుంటాను.*+  అయితే ఒక దేశం గానీ రాజ్యం గానీ కట్టబడుతుందని, నాటబడుతుందని నేను చెప్పినప్పుడు 10  అది నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తే, నా మాట వినకపోతే, నేను దానికి చేయాలనుకున్న మంచి విషయంలో నా మనసు మార్చుకుంటాను.’* 11  “దయచేసి ఇప్పుడు నువ్వు యూదా ప్రజలకు, యెరూషలేము నివాసులకు ఇలా చెప్పు: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “నేను మీకు వ్యతిరేకంగా ఒక విపత్తును సిద్ధం చేస్తున్నాను, ఒక పథకాన్ని రూపొందిస్తున్నాను. దయచేసి మీ చెడు మార్గాల నుండి వెనక్కి తిరగండి; మీ మార్గాల్ని, పనుల్ని సరిచేసుకోండి.” ’ ”+ 12  కానీ వాళ్లు ఇలా అన్నారు: “అలా కాదు,+ మేము మా సొంత ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం, మేమంతా మా దుష్ట హృదయాన్నే మొండిగా అనుసరిస్తాం.”+ 13  కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: “దయచేసి దేశాల్ని అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.+ 14  లెబానోను బండల మీద మంచు లేకుండా పోతుందా? దూరం నుండి ప్రవహించే చల్లని వాగులు ఎండిపోతాయా? 15  కానీ నా ప్రజలు నన్ను మర్చిపోయారు.+ వాళ్లు వ్యర్థమైనవాటికి బలులు అర్పిస్తున్నారు,+వాళ్లు ఇతరుల్ని తడబడేలా చేస్తూ, పురాతన దారుల్లో నడవకుండా చేస్తున్నారు,+సమతలంగా, చదునుగా లేని* పక్కదారుల్లో నడిపిస్తున్నారు. 16  కాబట్టి వాళ్ల దేశం భయంకరంగా తయారౌతుంది,+దాన్ని చూసి ప్రజలు ఎప్పటికీ ఎగతాళి చేస్తారు, ఈల వేస్తారు.+ ఆ దారిన వెళ్లే ప్రతీ వ్యక్తి దాన్ని చూసి ఆశ్చర్యంతో తల ఊపుతాడు.+ 17  తూర్పు గాలిలా, నేను వాళ్లను శత్రువు ముందు చెదరగొడతాను. విపత్తు రోజున నేను వాళ్లకు నా ముఖాన్ని కాదు వీపునే చూపిస్తాను.”+ 18  అప్పుడు వాళ్లు ఇలా అన్నారు: “రండి, మనం యిర్మీయా మీద కుట్ర పన్నుదాం.+ ఎందుకంటే మన యాజకుల దగ్గర ధర్మశాస్త్రం,* జ్ఞానుల దగ్గర సలహా, ప్రవక్తల దగ్గర వాక్యం ఉండని పరిస్థితి ఎప్పటికీ రాదు. రండి అతనికి వ్యతిరేకంగా మాట్లాడదాం,* అతను చెప్పేది మనం అస్సలు పట్టించుకోవద్దు.” 19  యెహోవా, నామీద దృష్టిపెట్టు,నా వ్యతిరేకులు ఏమంటున్నారో విను. 20  మంచి చేస్తే ప్రతిఫలంగా చెడు చేయవచ్చా? కానీ వాళ్లు నా ప్రాణం తీయడానికి గొయ్యి తవ్వారు.+ నీ కోపాన్ని వాళ్లమీద నుండి తీసేయడానికినేను నీ ముందు నిలబడి వాళ్ల గురించి ఎలా మంచిగా మాట్లాడానో గుర్తుచేసుకో. 21  కాబట్టి వాళ్ల కుమారుల్ని కరువుకు, వాళ్లను ఖడ్గానికి అప్పగించు.+వాళ్ల భార్యలు భర్తల్ని, పిల్లల్ని పోగొట్టుకోవాలి.+ వాళ్ల పురుషులు ప్రాణాంతకమైన తెగులుతో చనిపోవాలి. వాళ్ల యువకులు యుద్ధంలో కత్తితో చంపబడాలి.+ 22  నువ్వు వాళ్లమీదికి హఠాత్తుగా బందిపోటుల్ని రప్పించినప్పుడువాళ్ల ఇళ్లలో నుండి ఆర్తనాదాలు వినిపించాలి. ఎందుకంటే, వాళ్లు నన్ను పట్టుకోవడానికి గొయ్యి తవ్వారు,నా పాదాల కోసం ఉచ్చు పెట్టారు.+ 23  కానీ యెహోవా,నన్ను చంపడానికి వాళ్లు నామీద పన్నే కుట్రలన్నీ నీకు బాగా తెలుసు.+ వాళ్ల దోషాన్ని కప్పేయకు,వాళ్ల పాపాన్ని నీ ముందు నుండి తుడిచేయకు. నువ్వు కోపంతో వాళ్లమీద చర్య తీసుకున్నప్పుడు+వాళ్లు నీ ముందు తడబడి పడిపోవాలి.+

అధస్సూచీలు

లేదా “చక్రం.”
లేదా “సరైనదని.”
లేదా “విచారపడతాను.”
లేదా “విచారపడతాను.”
లేదా “కట్టబడని.”
అక్ష., “నాలుకతో అతన్ని కొడదాం.”
లేదా “ఉపదేశం.”