యిర్మీయా 14:1-22

  • అనావృష్టి, కరువు, ఖడ్గం (1-12)

  • అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (13-18)

  • ప్రజల పాపాల్ని యిర్మీయా ఒప్పుకోవడం (19-22)

14  అనావృష్టి గురించి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం:+   యూదా ఏడుస్తోంది,+ దాని ద్వారాలు పడిపోయాయి. అవి విచారంతో నేలలోకి దిగిపోతున్నాయి,యెరూషలేము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.   యజమానులు నీళ్ల కోసం సేవకుల్ని పంపిస్తున్నారు. వాళ్లు బావుల* దగ్గరికి వెళ్లి, నీళ్లు లేకపోవడంతో ఖాళీ కూజాలతో తిరిగొస్తున్నారు.వాళ్లు సిగ్గుతో, నిరాశతో తలలు కప్పుకుంటున్నారు.   దేశంలో వర్షం లేక నేల బీటలు వారింది,+రైతులు దిగులుతో తలలు కప్పుకుంటున్నారు.   చివరికి మైదానంలో పిల్లను ఈనిన దుప్పి కూడా గడ్డి లేనందువల్ల దాన్ని వదిలేస్తోంది.   అడవి గాడిదలు చెట్లులేని కొండలమీద నిలబడుతున్నాయి. అవి నక్కల్లా రొప్పుతున్నాయి;పచ్చిక లేకపోవడం వల్ల వాటి కళ్లు క్షీణించిపోతున్నాయి.+   యెహోవా, మా తప్పులే మామీద సాక్ష్యం చెప్తున్నా,నీ పేరు కోసం చర్య తీసుకో.+ ఎందుకంటే మా నమ్మకద్రోహ కార్యాలకు లెక్కేలేదు,+మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం.   ఇశ్రాయేలుకు నిరీక్షణగా ఉన్న దేవా, కష్టకాలంలో రక్షించే దేవా,+నువ్వు దేశంలో అపరిచితుడిలా,కేవలం ఒక రాత్రి బస చేయడానికి ఆగే యాత్రికుడిలా ఎందుకు ఉన్నావు?   నువ్వు ఆశ్చర్యంలో మునిగిపోయిన వ్యక్తిలా,రక్షించలేని శూరుడిలా ఎందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు,+మేము నీ పేరుతో పిలవబడుతున్నాం.+ మమ్మల్ని విడిచిపెట్టకు. 10  ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లకు అటూఇటూ తిరగడమంటే చాలా ఇష్టం;+ వాళ్లు తమ పాదాల్ని అదుపులో పెట్టుకోలేదు. కాబట్టి యెహోవా వాళ్ల విషయంలో సంతోషించట్లేదు. ఇప్పుడు ఆయన వాళ్ల తప్పును గుర్తు చేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి లెక్క అడుగుతాడు.”+ 11  తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఈ ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించకు.+ 12  వాళ్లు ఉపవాసం ఉన్నప్పుడు నేను వాళ్ల మొరల్ని వినను;+ వాళ్లు సంపూర్ణ దహనబలులు, ధాన్యార్పణలు అర్పించినప్పుడు వాటిని బట్టి సంతోషించను;+ నేను వాళ్లను ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నిర్మూలిస్తాను.”+ 13  అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ప్రవక్తలు వాళ్లతో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, కరువు మీ మీదికి రాదు, దేవుడు ఈ స్థలంలో మీకు నిజమైన శాంతిని దయచేస్తాడు’ అని చెప్తున్నారు.”+ 14  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఆ ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్నారు.+ నేను వాళ్లను పంపలేదు, వాళ్లకు ఆజ్ఞాపించలేదు, వాళ్లతో మాట్లాడనూ లేదు.+ వాళ్లు అబద్ధ దర్శనాన్ని, వ్యర్థమైన సోదెను, తమ హృదయాల్లో ఉన్న మోసాన్ని మీకు ప్రవచిస్తున్నారు.+ 15  నేను పంపకపోయినా నా పేరున ప్రవచిస్తూ, ఈ దేశం మీదికి ఖడ్గం గానీ కరువు గానీ రాదని చెప్తున్న ఆ ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు.+ 16  వాళ్లు ఎవరికైతే ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు, అంటే వాళ్లు, వాళ్ల భార్యలు, కుమారులు, కూతుళ్లు కరువు వల్ల, ఖడ్గం వల్ల యెరూషలేము వీధుల్లో పడేయబడతారు, వాళ్లను పాతిపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ ఎందుకంటే, నేను వాళ్లమీదికి తగిన విపత్తును రప్పిస్తాను.’+ 17  “నువ్వు వాళ్లతో ఈ మాట చెప్పాలి:‘రాత్రింబగళ్లు నా కళ్లలో నుండి ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి,+ఎందుకంటే, నా ప్రజల కన్య పూర్తిగా నలగ్గొట్టబడింది, విరగ్గొట్టబడింది,+ఆమెకు చాలా తీవ్రమైన గాయమైంది. 18  నేను పొలంలోకి వెళ్లి చూస్తే,ఖడ్గం వల్ల హతమైనవాళ్లు కనిపిస్తున్నారు!+ నగరంలోకి వస్తే,కరువు బాధితులు+ కనిపిస్తున్నారు! ప్రవక్తలూ యాజకులూ తమకు తెలియని దేశంలో సంచరిస్తున్నారు.’ ”+ 19  నువ్వు యూదాను పూర్తిగా తిరస్కరించావా? సీయోనును అసహ్యించుకున్నావా?+ మేము బాగవ్వలేనంతగా ఎందుకు మమ్మల్ని శిక్షించావు?+ మేము శాంతి కోసం ఎదురుచూశాం, కానీ ఏ మంచీ జరగలేదు,బాగౌతుందని ఎదురుచూశాం, కానీ భయం అలుముకుంది!+ 20  యెహోవా, మా దుష్టత్వాన్ని,మా పూర్వీకుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం.మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం.+ 21  నీ పేరు కోసం, దయచేసి మమ్మల్ని తిరస్కరించకు;+మహిమగల నీ సింహాసనాన్ని నీచంగా చూడకు. నువ్వు మాతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకో, దాన్ని రద్దు చేయకు.+ 22  దేశాలు పూజించే వ్యర్థమైన విగ్రహాల్లో ఏవైనా వర్షాన్ని కురిపించగలవా?కనీసం ఆకాశమైనా దానంతటదే వర్షాన్ని కురిపించగలదా? యెహోవా, మా దేవా, నువ్వు మాత్రమే దాన్ని చేయగలవు.+ మేము నీ మీదే ఆశపెట్టుకున్నాం,ఎందుకంటే నువ్వే ఇవన్నీ చేస్తున్నావు.

అధస్సూచీలు

లేదా “నీటి మడుగుల.”