న్యాయాధిపతులు 5:1-31
5 ఆ రోజున దెబోరా,+ అబీనోయము కుమారుడైన బారాకుతో+ కలిసి ఇలా పాడింది:+
2 “స్వచ్ఛందంగా యుద్ధానికి వెళ్లిన ఇశ్రాయేలీయుల్ని బట్టి,+తమ వెంట్రుకలు విరబోసుకున్న* యోధుల్ని బట్టియెహోవాను స్తుతించండి!
3 రాజులారా, వినండి! పాలకులారా, ఆలకించండి!
నేను యెహోవాకు పాటలు పాడతాను.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను+ స్తుతిస్తూ పాటలు పాడతాను.*+
4 యెహోవా, నువ్వు శేయీరు నుండి వెళ్లినప్పుడు,+నువ్వు ఎదోము ప్రాంతం నుండి బయల్దేరినప్పుడు,భూమి వణికింది, ఆకాశం నీటిని కుమ్మరించింది,మేఘాలు నీటిని కుమ్మరించాయి.
5 యెహోవా ఎదుట* పర్వతాలు కరిగిపోయాయి,*+చివరికి సీనాయి కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా+ ఎదుట* కరిగిపోయింది.+
6 అనాతు కుమారుడైన షమ్గరు+ రోజుల్లో,యాయేలు+ రోజుల్లో, దారులు నిర్మానుష్యం అయ్యాయి;ప్రయాణికులు వేరే దారుల్లో వెళ్లారు.
7 ఇశ్రాయేలు గ్రామాల్లో ఎవ్వరూ లేరు;దెబోరానైన+ నేను బయల్దేరే వరకు,
నేను ఇశ్రాయేలులో ఒక తల్లిగా లేచే వరకు ఎవ్వరూ లేరు.+
8 వాళ్లు కొత్త దేవుళ్లను ఎంచుకున్నారు;+అప్పుడు ద్వారాల దగ్గర యుద్ధం జరిగింది.+
40,000 మంది ఇశ్రాయేలీయుల మధ్య,ఒక్క డాలు గానీ, ఈటె గానీ కనిపించలేదు.
9 ప్రజలతో కలిసి స్వచ్ఛందంగా వెళ్లిన+ఇశ్రాయేలు సైన్యాధికారుల+ పక్షాన నేను ఉన్నాను.
యెహోవాను స్తుతించండి!
10 లేత రంగు గాడిదల మీద ప్రయాణించే వాళ్లారా,నాణ్యమైన తివాచీల మీద కూర్చునే వాళ్లారా,దారిలో నడిచే వాళ్లారా,ఆలోచించండి!
11 నీళ్లున్న చోట్లలో, పశువులకు నీళ్లు తోడే వాళ్ల మాటలు వినబడుతున్నాయి;అక్కడ వాళ్లు యెహోవా నీతికార్యాల్ని,ఇశ్రాయేలు గ్రామాల్లోని ఆయన ప్రజలు చేసిన నీతికార్యాల్ని చెప్పుకుంటున్నారు,
అప్పుడు యెహోవా ప్రజలు ద్వారం దగ్గరికి వెళ్లారు.
12 దెబోరా,+ మేలుకో! మేలుకో!
మేలుకొని ఒక పాట పాడు!+
బారాకూ, లే!+ అబీనోయము కుమారుడా, నీ బందీలను తీసుకెళ్లు!
13 అప్పుడు, మిగిలినవాళ్లు ప్రముఖుల దగ్గరికి వచ్చారు;బలవంతులకు వ్యతిరేకంగా యెహోవా ప్రజలు నా దగ్గరికి వచ్చారు.
14 ఎఫ్రాయిము నుండి వచ్చినవాళ్లు లోయలో ఉన్నారు;వాళ్లు నీ వెంట వస్తున్నారు, బెన్యామీనూ, వాళ్లు నీ ప్రజల మధ్య ఉన్నారు.
సైన్యాధికారులు మాకీరు+ నుండి వెళ్లారు,సైనికుల్ని నియమించేవాళ్లు* జెబూలూను నుండి వెళ్లారు.
15 ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వెళ్లారు,ఇశ్శాఖారు దెబోరాతో పాటు వెళ్లినట్టే, బారాకూ+ ఆమెతోపాటు వెళ్లాడు.
అతను లోయ మైదానంలోకి కాలినడకన పంపించబడ్డాడు.+
రూబేను కుటుంబాల వాళ్లు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోయారు.
16 మందల కోసం కాపరులు వాయించే పిల్లనగ్రోవి* స్వరం వింటూ+మీరు ఎందుకు రెండు బరువుల మధ్య కూర్చున్నారు?
ఎందుకంటే రూబేను కుటుంబాల వాళ్లు ఎటూ తేల్చుకోలేకపోయారు.
17 గిలాదు యొర్దాను అవతలే నిలిచిపోయాడు;+దాను ఎందుకు ఓడల దగ్గరే ఉండిపోయాడు?+
ఆషేరు సముద్రతీరం దగ్గర ఖాళీగా కూర్చున్నాడు,అతను తన ఓడరేవుల దగ్గరే ఉండిపోయాడు.+
18 జెబూలూను వాళ్లు, అలాగే నఫ్తాలి వాళ్లు,కొండలమీద+ తమ ప్రాణాలకు తెగించారు.+
19 రాజులు వచ్చారు, యుద్ధం చేశారు;అప్పుడు కనాను రాజులు తానాకులో,మెగిద్దో నీళ్ల దగ్గర+ యుద్ధం చేశారు.+
వాళ్లు వెండిని దోపుడుసొమ్ముగా అస్సలు తీసుకెళ్లలేదు.+
20 ఆకాశం నుండి నక్షత్రాలు యుద్ధం చేశాయి;అవి తమ కక్ష్యల నుండి సీసెరాకు వ్యతిరేకంగా పోరాడాయి.
21 కీషోను వాగు వాళ్లను కొట్టుకుపోయింది,+కీషోను వాగు పురాతన వాగు.
నా ప్రాణమా,* నువ్వు శక్తిమంతుల్ని అణగదొక్కావు.
22 అతని యుద్ధ గుర్రాలు భీకరంగా దౌడు తీస్తుంటే,గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి.+
23 యెహోవా దూత ఇలా అన్నాడు, ‘మేరోజును శపించు,అవును, దాని నివాసుల్ని శపించు,
ఎందుకంటే వాళ్లు యెహోవాకు సహాయంగా రాలేదు,బలవంతులతో కలిసి యెహోవాకు సహాయంగా రాలేదు.’
24 కేనీయుడైన హెబెరు+ భార్య యాయేలు+స్త్రీలందరిలో ఎక్కువగా ఆశీర్వదించబడినది;డేరాల్లో నివసిస్తున్న స్త్రీలందరిలో ఆమె ఎక్కువగా ఆశీర్వదించబడినది.
25 అతను నీళ్లు అడిగాడు; ఆమె అతనికి పాలు తెచ్చి ఇచ్చింది.
అందమైన ఒక పెద్ద గిన్నెలో మీగడ పాలు* ఇచ్చింది.+
26 ఆమె తన చేతితో డేరా మేకును,కుడిచేతితో పనివాడి చెక్కసుత్తిని అందుకుంది.
ఆమె సీసెరాను సుత్తితో కొట్టింది, అతని తలను చితగ్గొట్టింది,అతని కణతల్ని పగలగొట్టి, పొడిచింది.+
27 ఆమె పాదాల మధ్య అతను కుప్పకూలాడు, కదలకుండా పడి ఉన్నాడు;ఆమె పాదాల మధ్య అతను కుప్పకూలి, పడిపోయాడు;కుప్పకూలిన చోటే అతను చనిపోయాడు.
28 కిటికీలో నుండి ఒక స్త్రీ బయటికి చూసింది,కిటికీ జాలీలో నుండి సీసెరా తల్లి చూసింది,‘అతని రథం ఇంకా రావట్లేదేంటి?
అతని రథాల చప్పుడు ఇంకా వినిపించడం లేదేంటి?’+
29 ఆమె దగ్గరున్న ప్రముఖ స్త్రీలలో అత్యంత తెలివిగలవాళ్లు ఆమెకు జవాబిస్తారు;అవును, ఆమె కూడా తనలోతాను ఇలా అనుకుంటుంది,
30 ‘వాళ్లు దోపుడుసొమ్మును పంచుకుంటున్నారేమో,ప్రతీ యోధుడికి ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు;సీసెరాకు రంగు వేసిన గుడ్డ, అవును, రంగు వేసిన గుడ్డ;దోచుకునేవాళ్ల మెడల కోసం బుట్టాపని* చేసిన వస్త్రం, రంగు వేసిన గుడ్డ, బుట్టాపని చేసిన రెండు వస్త్రాలుదోపుడుసొమ్ముగా దొరికివుంటాయి.’
31 కాబట్టి, యెహోవా, నీ శత్రువులందరూ నాశనమవ్వాలి,+కానీ నిన్ను ప్రేమించేవాళ్లు సూర్యునిలా ప్రకాశించాలి.”
దేశం ఆ తర్వాత 40 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉంది.+
అధస్సూచీలు
^ ఇది బహుశా దేవునికి చేసుకున్న మొక్కుబడికి లేదా సమర్పణకు సూచన.
^ లేదా “సంగీతం వాయిస్తాను.”
^ అక్ష., “ముఖం ఎదుట.”
^ లేదా “కంపించాయి” అయ్యుంటుంది.
^ అక్ష., “ముఖం ఎదుట.”
^ లేదా “లేఖికుని పరికరాల్ని ఉపయోగించేవాళ్లు” అయ్యుంటుంది.
^ అంటే, ఫ్లూటు.
^ లేదా “మీగడ.”
^ అంటే, ఎంబ్రాయిడరీ.