జెకర్యా 9:1-17

  • చుట్టుపక్కల దేశాల మీద దేవుని తీర్పు (1-8)

  • సీయోను రాజు వస్తున్నాడు (9, 10)

    • వినయంగల రాజు గాడిద మీద రావడం (9)

  • యెహోవా ప్రజలు విడుదలౌతారు (11-17)

9  దేవుని నుండి వచ్చిన ప్రకటన: “యెహోవా వాక్యం హద్రాకుకు ​వ్యతిరేకంగా ఉంది,దమస్కు దాని లక్ష్యం.+ఎందుకంటే, యెహోవా కళ్లు ​మనుషులందర్నీ,ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ చూస్తున్నాయి;+   అంతేకాదు ఆయన వాక్యం పక్కనున్న హమాతు+ దేశానికి,తూరు,+ సీదోనులకు+ వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే ఇవి చాలా తెలివిగలవి.+   తూరు తన కోసం ఒక ప్రాకారం* ​కట్టుకుంది, అది దుమ్ము అంత విస్తారంగా వెండిని,వీధుల్లోని చెత్త అంత విస్తారంగా ​బంగారాన్ని పోగుచేసుకుంది.+   ఇదిగో! యెహోవా దాని ఆస్తుల్ని ​తీసేసుకుంటాడు,దాని సైన్యాల్ని సముద్రంలో పడేస్తాడు;*+అది అగ్నిలో దహించివేయబడుతుంది.+   అష్కెలోను దాన్ని చూసి భయపడుతుంది;గాజా తీవ్రమైన దుఃఖంలో ​మునిగిపోతుంది,ఎక్రోను పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే అది నమ్ముకున్న దేశం ​అవమానాలపాలు అవుతుంది. గాజాలో రాజు లేకుండాపోతాడు,అష్కెలోను నిర్మానుష్యం అయిపోతుంది.+   అష్డోదులో అక్రమ సంతానం ​స్థిరపడుతుంది,ఫిలిష్తీయుల పొగరును నేను ​అణచివేస్తాను.+   నేను ఫిలిష్తీయుల నోళ్లలో నుండి రక్తపు మరకలున్న వాటిని తీసేస్తాను,వాళ్ల పళ్ల మధ్య నుండి అసహ్యకరమైన వాటిని లాగేస్తాను,వాళ్లలో మిగిలినవాళ్లు మన దేవునికి చెందుతారు;వాళ్లు యూదాలోని షేక్‌లలా* అవుతారు,+ఎక్రోనువాళ్లు యెబూసీయుల్లా అవుతారు.+   నా ఇంటి మీదికి ఎవరూ రాకుండా,నా ఇంటి బయట డేరా వేసుకొని నేను కాపలా ఉంటాను,+అణచివేసే వాళ్లెవ్వరూ మళ్లీ నా ఇంట్లోకి రాలేరు,+ఎందుకంటే, ఇప్పుడు నేను స్వయంగా నా కళ్లతో దాన్ని* చూశాను.   సీయోను కూతురా, ఉల్లసించు. యెరూషలేము కూతురా, విజయోత్సాహంతో కేకలువేయి. ఇదిగో! నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు.+ ఆయన నీతిమంతుడు, రక్షణను ​తీసుకొస్తున్నాడు,*ఆయన వినయస్థుడు,+ గాడిద మీద వస్తున్నాడు,అవును, గాడిదపిల్ల* మీద వస్తున్నాడు.+ 10  నేను ఎఫ్రాయిములో నుండి యుద్ధ రథాల్ని తీసేస్తాను,యెరూషలేములో నుండి గుర్రాల్ని తీసేస్తాను. యుద్ధపు విల్లు తీసేయబడుతుంది. ఆయన దేశాలకు శాంతిని ప్రకటిస్తాడు;+ఆయన పరిపాలన సముద్రం నుండి సముద్రం వరకు,నది* నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.+ 11  ఓ స్త్రీ,* నీ ఒప్పంద* రక్తం ద్వారా,ఖైదీలుగా ఉన్న నీ వాళ్లను నీళ్లు లేని గోతి నుండి నేను బయటికి ​తీసుకొస్తాను.+ 12  ఆశగా ఎదురుచూస్తున్న ఖైదీల్లారా, ​బలమైన దుర్గానికి తిరిగిరండి.+ ఈ రోజు నేను చెప్తున్నాను,‘ఓ స్త్రీ, నేను నిన్ను రెండింతలు దీవిస్తాను.+ 13  నేను యూదాను నా విల్లులా వంచుతాను. ఎఫ్రాయిమూ, నిన్ను విల్లు మీది బాణంలా ఎక్కుపెడతాను,సీయోనూ, నేను నీ కుమారుల్ని ​లేపుతాను,గ్రీసు దేశమా, నీ కుమారుల మీదికి వాళ్లను లేపుతాను,సీయోనూ, నేను నిన్ను యోధుని ఖడ్గంలా చేస్తాను.’ 14  యెహోవా తన ప్రజలకు తోడుగా ​ఉన్నానని స్పష్టంగా చూపిస్తాడు,ఆయన బాణం మెరుపులా దూసుకెళ్తుంది. సర్వోన్నత ప్రభువైన యెహోవా బూర* శబ్దం చేస్తాడు,+ఆయన దక్షిణం నుండి వచ్చే సుడిగాలిలా ముందుకు దూసుకుపోతాడు. 15  సైన్యాలకు అధిపతైన యెహోవా వాళ్లను కాపాడతాడు,వాళ్లు వడిసెల రాళ్లను నాశనం చేస్తారు, లోబర్చుకుంటారు.+ వాళ్లు ద్రాక్షారసం తాగినవాళ్లలా ​సంతోషంగా ఉంటారు, కేకలు వేస్తారు;వాళ్లు ఆలయంలోని గిన్నెల్లా ​నింపబడతారు,బలిపీఠపు మూలలు+ నింపబడినట్టు నింపబడతారు. 16  కాపరి తన మందను కాపాడినట్టుఆ రోజున, వాళ్ల దేవుడైన యెహోవా వాళ్లను కాపాడతాడు.+కిరీటం మీదున్న రత్నాల్లా వాళ్లు ఆయన నేలమీద మెరుస్తారు.+ 17  ఆహా! ఆయన మంచితనం ఎంత గొప్పది!+ఆయన అందం ఎంత గొప్పది! ధాన్యం యువకుల్ని,కొత్త ద్రాక్షారసం కన్యల్ని వర్ధిల్లజేస్తుంది.”+

అధస్సూచీలు

లేదా “కోట.”
లేదా “సముద్రం మీద దాని సైన్యాన్ని నాశనం చేస్తాడు” అయ్యుంటుంది.
షేక్‌ అంటే గోత్రపు పెద్ద.
తన ప్రజల బాధను అని స్పష్టమౌతోంది.
లేదా “విజేయుడు; రక్షించబడినవాడు.”
లేదా “మగ గాడిదపిల్ల.”
అంటే, యూఫ్రటీసు.
అంటే, సీయోను లేదా యెరూషలేము.
లేదా “నిబంధన.”
అక్ష., “కొమ్ము.”