జెకర్యా 4:1-14

  • 5వ దర్శనం: దీపస్తంభం, రెండు ఒలీవ చెట్లు (1-14)

    • ‘మనుషుల శక్తి వల్ల కాదు, నా పవిత్రశక్తి వల్లే’ (6)

    • పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి (10)

4  అంతకుముందు నాతో మాట్లాడిన దేవదూత తిరిగొచ్చి, నిద్రపోతున్న వ్యక్తిని ​లేపినట్టు నన్ను లేపి,  “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. దానికి నేను ఇలా చెప్పాను: “ఇదిగో, పూర్తిగా బంగారంతో చేసిన ఒక దీపస్తంభం+ నాకు కనిపిస్తోంది, దానిపైన ఒక గిన్నె ఉంది. దానిమీద ఏడు దీపాలు ఉన్నాయి,+ అవును ఏడు దీపాలు ఉన్నాయి. దీపస్తంభం మీదున్న ఆ దీపాలకు ఏడు గొట్టాలు ఉన్నాయి.  దాని పక్కన రెండు ఒలీవ చెట్లు ఉన్నాయి.+ అవి ఆ గిన్నెకు కుడి​వైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఉన్నాయి.”  అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి దేన్ని సూచిస్తున్నాయి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను అడిగాను.  అందుకు నాతో మాట్లాడుతున్న ఆ దేవదూత “ఇవి దేన్ని సూచిస్తున్నాయో నీకు తెలీదా?” అని అడిగాడు. దానికి నేను, “నా ప్రభువా, తెలీదు” అన్నాను.  అప్పుడతను నాతో ఇలా అన్నాడు: “జెరుబ్బాబెలుకు యెహోవా చెప్పేదేమిటంటే, ‘ “సైన్యాల వల్లో, మనుషుల శక్తి వల్లో కాదుగానీ+ నా పవిత్రశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.  గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు+ ముందు నువ్వు ఎంతటిదానివి? నువ్వు చదును చేయబడతావు.*+ అతను పైరాయిని తీసుకొస్తున్నప్పుడు, ప్రజలు “ఎంత అద్భుతం! ఎంత అద్భుతం!” అని కేకలు వేస్తారు.’ ”  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాది వేశాయి,+ అతని చేతులే దాన్ని పూర్తి చేస్తాయి.+ అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపించాడని మీరు తెలుసుకుంటారు. 10  పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి.+ ఎందుకంటే ప్రజలు సంతోషిస్తారు, జెరుబ్బాబెలు చేతిలో లంబసూత్రం* చూస్తారు. ఆ ఏడు కళ్లు, భూమంతటా సంచరిస్తున్న యెహోవా కళ్లు.”+ 11  అప్పుడు నేను, “దీపస్తంభానికి కుడివైపు, ఎడమవైపు ఉన్న ఈ రెండు ఒలీవచెట్లు దేన్ని సూచిస్తున్నాయి?” అని అతన్ని అడిగాను.+ 12  రెండోసారి నేను అతన్ని, “రెండు బంగారు గొట్టాల ద్వారా బంగారు ద్రవాన్ని పోస్తున్న ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు దేన్ని సూచిస్తున్నాయి?” అని అడిగాను. 13  అందుకతను, “ఇవి దేన్ని సూచి​స్తున్నాయో నీకు తెలీదా?” అని నన్ను అడిగాడు. దానికి నేను, “నా ప్రభువా, తెలీదు” అన్నాను. 14  అప్పుడతను “ఇవి, సర్వలోక ప్రభువు పక్కన నిల్చున్న ఇద్దరు అభిషిక్తుల్ని సూచి​స్తున్నాయి” అని చెప్పాడు.+

అధస్సూచీలు

లేదా “మైదానం అవుతావు.”
లేదా “మట్టపుగుండు.”