ఆమోసు 9:1-15

  • దేవుని తీర్పుల్ని తప్పించుకోలేరు (1-10)

  • దావీదు ఇల్లు నిలబెట్టబడుతుంది (11-15)

9  బలిపీఠానికి పైన యెహోవా ఉండడం నేను చూశాను,+ ఆయన ఇలా అన్నాడు: “స్తంభాల పైభాగాల్ని కొట్టు, పునాదులు కదిలి​పోతాయి. వాటి పైభాగాల్ని నరికేయి, నేను వాళ్లలో చివరి వ్యక్తిని ఖడ్గంతో చంపే​స్తాను. ఒక్కరు కూడా తప్పించుకోలేరు, పారిపోలేరు.+   వాళ్లు నేలను తవ్వి సమాధిలోకి* వెళ్లినా,అక్కడి నుండి నా చెయ్యి వాళ్లను ​బయటికి తెస్తుంది;వాళ్లు ఆకాశానికి ఎక్కిపోయినా,అక్కడి నుండి నేను వాళ్లను కిందికి లాక్కొస్తాను.   వాళ్లు కర్మెలు పర్వత శిఖరం పైన దాక్కున్నా,అక్కడ కూడా నేను వాళ్లను వెదికి ​పట్టుకుంటాను.+ వాళ్లు నా కంటికి కనబడకుండా సముద్రం అడుగున దాక్కున్నా,అక్కడ వాళ్లను కాటేయమని నేను ​సర్పానికి ఆజ్ఞాపిస్తాను.   వాళ్లు తమ శత్రువుల చేతికి చిక్కి ​బందీలుగా వెళ్లినా,అక్కడ నేను ఖడ్గానికి ఆజ్ఞాపిస్తాను, అది వాళ్లను చంపేస్తుంది;+మేలు చేయడానికి కాదు కీడు ​చేయడానికే వాళ్ల మీద నా దృష్టి ​నిలుపుతాను.+   సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా దేశాన్ని* ​తాకుతాడు,అది కరిగిపోతుంది,+ దాని నివాసులందరూ విలపిస్తారు;+దేశమంతా నైలు నదిలా ఉప్పొంగుతుంది,పోటెత్తే ఐగుప్తు దేశపు నైలు నదిలా ​అల్లకల్లోలంగా మారుతుంది.+   ‘ఆకాశంలో తన మెట్లను నిర్మించే దేవుడు,భూమికి పైన తన భవనాన్ని* కట్టే దేవుడు;భూమ్మీద కుమ్మరించడానికిసముద్ర జలాల్ని పిలిచే దేవుడు,+–ఆయన పేరు యెహోవా.’+   ‘ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా దృష్టిలో కూషీయుల లాంటివాళ్లు కాదా?’ అని యెహోవా అంటున్నాడు. ‘నేను ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురాలేదా?+క్రేతు నుండి ఫిలిష్తీయుల్ని,+ కీరు నుండి సిరియన్లను+ బయటికి ​తీసుకురాలేదా?’   ‘ఇదిగో! సర్వోన్నత ప్రభువైన యెహోవా దృష్టి పాపిష్ఠి రాజ్యం మీద ఉంది,ఆయన దాన్ని భూమ్మీద నుండి పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు.+ అయితే నేను యాకోబు ఇంటివాళ్లను సమూలంగా నాశనం చేయను’+ అని యెహోవా అంటున్నాడు.   ‘ఇదిగో! నేను ఆజ్ఞాపిస్తున్నాను,ఒకడు జల్లెడ పట్టినట్టు,దేశాలన్నిటి మధ్య నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లను జల్లెడ పడతాను,+ఒక్క రాయి కూడా నేలమీద పడదు. 10  నా ప్రజల్లో పాపం చేసిన వాళ్లందరూ,“విపత్తు మా దగ్గరికి రాదు, మమ్మల్ని అందుకోలేదు” అని అంటున్న వాళ్లందరూ ఖడ్గం చేత చనిపోతారు.’ 11  ‘ఆ రోజు నేను, పడిపోయిన దావీదు ఇంటిని* నిలబెడతాను,+దాని* పగుళ్లకు మరమ్మతు చేస్తాను,దాని శిథిలాల్ని బాగుచేస్తాను;అది ఒకప్పుడు ఎలా ఉండేదో, మళ్లీ అలా ఉండేలా దాన్ని తిరిగి కడతాను,+ 12  అప్పుడు వాళ్లు ఎదోములో ​మిగిలిపోయిన దాన్ని స్వాధీనం ​చేసుకుంటారు,+నా పేరుతో పిలవబడే దేశాలన్నిటినీ స్వాధీనం చేసుకుంటారు’ అని ఇదంతా చేస్తున్న యెహోవా అంటున్నాడు. 13  ‘ఇదిగో! ఆ రోజులు వస్తున్నాయి’ అని యెహోవా అంటున్నాడు,‘అప్పుడు, కోత కోసేవాళ్ల పని పూర్తికాక ముందే దున్నేవాళ్లు వస్తారు,ద్రాక్షల్ని తొక్కేవాళ్ల పని పూర్తికాక ముందే విత్తనాలు విత్తేవాళ్లు వస్తారు;+పర్వతాల మీద నుండి తియ్యని ​ద్రాక్షారసం కారుతుంది,అది కొండలన్నిటి మీద పారుతుంది.* 14  బందీలుగా ఉన్న నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నేను మళ్లీ సమకూరుస్తాను,+వాళ్లు నిర్మానుష్యం అయిపోయిన నగరాల్ని మళ్లీ కట్టి, వాటిలో నివసిస్తారు,+ద్రాక్షతోటలు నాటుకొని, వాటి ​ద్రాక్షారసం తాగుతారు,తోటలు వేసి, వాటి పండ్లు తింటారు.’+ 15  ‘నేను వాళ్లను వాళ్ల దేశంలో నాటుతాను,నేను వాళ్లకు ఇచ్చిన దేశం నుండివాళ్లు మళ్లీ ఇంకెప్పుడూ పెకిలించబడరు’+ అని మీ దేవుడైన యెహోవా అంటున్నాడు.”

అధస్సూచీలు

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి ​సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “భూమిని.”
లేదా “​గుమ్మటాన్ని; గోపురాన్ని.”
లేదా “డేరాను; గుడిసెను.”
లేదా “వాళ్ల.”
అక్ష., “కొండలన్నీ కరిగిపోతాయి.”