ఆదికాండం 5:1-32
5 ఇది ఆదాము చరిత్రను తెలిపే వృత్తాంతం. దేవుడు ఆదామును సృష్టించిన రోజున, తన పోలికలో అతన్ని సృష్టించాడు.+
2 ఆయన వాళ్లను పురుషునిగా, స్త్రీగా సృష్టించాడు.+ వాళ్లు సృష్టించబడిన+ రోజున దేవుడు వాళ్లను దీవించి, వాళ్లకు మనుషులు* అని పేరు పెట్టాడు.
3 ఆదాము 130 ఏళ్లు బ్రతికి తన పోలికలో, తనలా ఉన్న కుమారుణ్ణి కని అతనికి షేతు+ అని పేరు పెట్టాడు.
4 షేతును కన్న తర్వాత ఆదాము 800 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
5 ఆదాము మొత్తం 930 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.+
6 షేతు 105 ఏళ్లు బ్రతికి ఎనోషును+ కన్నాడు.
7 ఎనోషును కన్న తర్వాత షేతు 807 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
8 షేతు మొత్తం 912 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
9 ఎనోషు 90 ఏళ్లు బ్రతికి కేయినానును కన్నాడు.
10 కేయినానును కన్న తర్వాత ఎనోషు 815 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
11 ఎనోషు మొత్తం 905 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
12 కేయినాను 70 ఏళ్లు బ్రతికి మహలలేలును+ కన్నాడు.
13 మహలలేలును కన్న తర్వాత కేయినాను 840 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
14 కేయినాను మొత్తం 910 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
15 మహలలేలు 65 ఏళ్లు బ్రతికి యెరెదును+ కన్నాడు.
16 యెరెదును కన్న తర్వాత మహలలేలు 830 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
17 మహలలేలు మొత్తం 895 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
18 యెరెదు 162 ఏళ్లు బ్రతికి హనోకును+ కన్నాడు.
19 హనోకును కన్న తర్వాత యెరెదు 800 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
20 యెరెదు మొత్తం 962 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
21 హనోకు 65 ఏళ్లు బ్రతికి మెతూషెలను+ కన్నాడు.
22 మెతూషెలను కన్న తర్వాత హనోకు 300 ఏళ్లు సత్యదేవునితో* నడుస్తూ ఉన్నాడు. అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.
23 హనోకు మొత్తం 365 ఏళ్లు బ్రతికాడు.
24 హనోకు సత్యదేవునితో నడుస్తూ ఉన్నాడు.+ ఆ తర్వాత అతను ఇక లేడు, ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయాడు.+
25 మెతూషెల 187 ఏళ్లు బ్రతికి లెమెకును+ కన్నాడు.
26 లెమెకును కన్న తర్వాత మెతూషెల 782 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
27 మెతూషెల మొత్తం 969 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
28 లెమెకు 182 ఏళ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కన్నాడు.
29 లెమెకు అతనికి నోవహు*+ అని పేరు పెట్టాడు; “యెహోవా శపించిన ఈ నేల+ వల్ల మనం పడుతున్న ప్రయాస నుండి, వేదనతో కూడిన మన చేతుల కష్టం నుండి ఇతను మనకు ఊరటను* ఇస్తాడు” అని అంటూ అతనికి ఆ పేరు పెట్టాడు.
30 నోవహును కన్న తర్వాత లెమెకు 595 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
31 లెమెకు మొత్తం 777 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.
32 నోవహుకు 500 ఏళ్లు వచ్చిన తర్వాత షేమును,+ హామును,+ యాపెతును+ కన్నాడు.