ఆదికాండం 36:1-43
36 ఇది ఏశావు చరిత్ర. ఇతనికి ఎదోము+ అనే పేరు కూడా ఉంది.
2 ఏశావు ఆదా,+ అహోలీబామా అనే కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆదా హిత్తీయుడైన ఏలోను కూతురు;+ అహోలీబామా+ హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కూతురు.
3 ఇష్మాయేలు కూతురు బాశెమతును+ కూడా ఏశావు పెళ్లి చేసుకున్నాడు. ఆమె నెబాయోతు సహోదరి.+
4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది; బాశెమతు రగూయేలును కన్నది.
5 అహోలీబామా యూషును, యాలామును, కోరహును+ కన్నది.
వీళ్లు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు.
6 తర్వాత ఏశావు తన భార్యల్ని, కుమారుల్ని, కూతుళ్లను, తన ఇంటివాళ్లందర్నీ, తన మందను, తనకున్న ఇతర జంతువులన్నిటినీ, కనాను దేశంలో తాను సంపాదించిన ఆస్తంతటినీ+ తీసుకొని తన తమ్ముడు యాకోబు నివసిస్తున్న చోటుకు కొంతదూరంలో ఉన్న మరో ప్రాంతానికి వెళ్లాడు.+
7 వాళ్లకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయంటే, వాళ్లిద్దరూ ఒకేచోట ఉండడం కుదరలేదు; వాళ్ల మందల కారణంగా, వాళ్లు నివసిస్తున్న* ఆ ప్రాంతం వాళ్లిద్దరూ జీవనం సాగించడానికి సరిపోలేదు.
8 కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో+ నివాసం ఏర్పర్చుకున్నాడు. ఈ ఏశావే ఎదోము.+
9 శేయీరు+ కొండ ప్రాంతంలో నివసించే ఎదోమీయుల మూలపురుషుడైన ఏశావు చరిత్ర ఇది.
10 ఇవి ఏశావు కుమారుల పేర్లు: ఏశావు భార్య ఆదా కుమారుడు ఎలీఫజు; ఏశావు భార్య బాశెమతు కుమారుడు రగూయేలు.+
11 ఎలీఫజు కుమారులు: తేమాను,+ ఓమారు, సెపో, గాతాము, కనజు.+
12 ఏశావు కుమారుడైన ఎలీఫజు ఉపపత్ని పేరు తిమ్నా. ఆమె ఎలీఫజుకు అమాలేకును+ కన్నది. వీళ్లు ఏశావు భార్య ఆదా మనవళ్లు.*
13 రగూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీళ్లు ఏశావు భార్య బాశెమతు+ మనవళ్లు.*
14 సిబ్యోను మనవరాలూ, అనా కూతురూ అయిన అహోలీబామా కుమారులు: యూషు, యాలాము, కోరహు. ఏశావు భార్య అహోలీబామా వీళ్లను కన్నది.
15 ఏశావు కుమారుల్లో షేక్‌లు*+ వీళ్లు. ఏశావు పెద్ద కుమారుడైన ఎలీఫజు కుమారులు: షేక్ తేమాను, షేక్ ఓమారు, షేక్ సెపో, షేక్ కనజు,+
16 షేక్ కోరహు, షేక్ గాతాము, షేక్ అమాలేకు. వీళ్లు ఎదోము దేశంలో ఎలీఫజు వంశంలోని షేక్‌లు.+ వీళ్లు ఆదా మనవళ్లు.*
17 ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: షేక్ నహతు, షేక్ జెరహు, షేక్ షమ్మా, షేక్ మిజ్జ. వీళ్లు ఎదోము దేశంలో+ రగూయేలు వంశంలోని షేక్‌లు. వీళ్లు ఏశావు భార్య బాశెమతు మనవళ్లు.*
18 చివరిగా, ఏశావు భార్య అహోలీబామా కుమారులు: షేక్ యూషు, షేక్ యాలాము, షేక్ కోరహు. వీళ్లు అనా కూతురూ, ఏశావు భార్యా అయిన అహోలీబామాకు పుట్టిన షేక్‌లు.
19 వీళ్లంతా ఏశావు కుమారులు, వాళ్ల నుండి వచ్చిన షేక్‌లు. ఈ ఏశావే ఎదోము.+
20 హోరీయుడైన శేయీరు కుమారులు, ఆ దేశ నివాసులు+ వీళ్లు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,+
21 దిషోను, ఏసెరు, దీషాను.+ వీళ్లు ఎదోము దేశంలో హోరీయుల షేక్‌లు, శేయీరు కుమారులు.
22 లోతాను కుమారులు: హోరీ, హేమీము. లోతాను సహోదరి పేరు తిమ్నా.+
23 శోబాలు కుమారులు: అల్వాను, మానహతు, ఏబాలు, షెపో, ఓనాము.
24 సిబ్యోను+ కుమారులు: అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదల్ని కాస్తున్నప్పుడు, అతనికి ఎడారిలో వేడి నీళ్ల ఊటలు కనిపించాయి.
25 అనా పిల్లలు: కుమారుడు దిషోను, కూతురు అహోలీబామా.
26 దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.+
27 ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
28 దీషాను కుమారులు: ఊజు, అరాను.+
29 వీళ్లు హోరీయుల షేక్‌లు: షేక్ లోతాను, షేక్ శోబాలు, షేక్ సిబ్యోను, షేక్ అనా,
30 షేక్ దిషోను, షేక్ ఏసెరు, షేక్ దీషాను.+ వీళ్లు శేయీరు దేశంలో హోరీయుల షేక్‌లు.
31 ఇశ్రాయేలీయుల్ని* ఏ రాజూ పరిపాలించక ముందు ఎదోము దేశంలో పరిపాలించిన రాజులు+ వీళ్లు.+
32 బెయోరు కుమారుడు బెల ఎదోములో పరిపాలించాడు. అతని నగరం పేరు దిన్హాబా.
33 బెల చనిపోయాక, అతని స్థానంలో బొస్రాకు చెందిన జెరహు కుమారుడు యోబాబు రాజయ్యాడు.
34 యోబాబు చనిపోయాక, అతని స్థానంలో తేమానీయుల దేశానికి చెందిన హుషాము రాజయ్యాడు.
35 హుషాము చనిపోయాక, అతని స్థానంలో బెదెదు కుమారుడైన హదదు రాజయ్యాడు. మోయాబు ప్రాంతంలో మిద్యానీయుల్ని+ ఓడించింది అతనే. హదదు నగరం పేరు అవీతు.
36 హదదు చనిపోయాక, అతని స్థానంలో మశ్రేకాకు చెందిన శమ్లా రాజయ్యాడు.
37 శమ్లా చనిపోయాక, నది తీరాన ఉన్న రహెబోతుకు చెందిన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.
38 షావూలు చనిపోయాక, అతని స్థానంలో అక్బోరు కుమారుడైన బయల్-హానాను రాజయ్యాడు.
39 అక్బోరు కుమారుడు బయల్-హానాను చనిపోయాక, అతని స్థానంలో హదరు రాజయ్యాడు. అతని నగరం పేరు పాయు, అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కూతురు. మత్రేదు మేజాహాబు కూతురు.
40 ఇవి వాళ్లవాళ్ల కుటుంబాలవారీగా, ప్రాంతాలవారీగా ఏశావు నుండి వచ్చిన షేక్‌ల పేర్లు: షేక్ తిమ్నా, షేక్ అల్వా, షేక్ యతేతు,+
41 షేక్ అహోలీబామా, షేక్ ఏలా, షేక్ పీనోను,
42 షేక్ కనజు, షేక్ తేమాను, షేక్ మిబ్సారు,
43 షేక్ మగ్దీయేలు, షేక్ ఈరాము. వీళ్లు తమ దేశంలో తమతమ ప్రాంతాల వారీగా ఎదోములోని షేక్‌లు. ఎదోమీయుల మూలపురుషుడు ఏశావు.+
అధస్సూచీలు
^ లేదా “పరదేశులుగా నివసిస్తున్న.”
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ షేక్ అంటే గోత్రపు పెద్ద.
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “ఇశ్రాయేలు కుమారుల్ని.”