కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 1వ పాఠం

యెహోవాసాక్షులు ఎలాంటివాళ్లు?

యెహోవాసాక్షులు ఎలాంటివాళ్లు?

డెన్మార్క్‌

తైవాన్‌

వెనిజ్యులా

ఇండియా

యెహోవాసాక్షులు ఎవరైనా మీకు తెలుసా? వాళ్లు మీ ఇరుగుపొరుగున, మీరు పనిచేసే చోట, మీ స్కూల్లో, లేదా కాలేజీలో ఉండవచ్చు. లేదా వాళ్లలో ఒకరు మీతో బైబిలు గురించి మాట్లాడి ఉండవచ్చు. ఇంతకీ మేము ఎవరం? మా నమ్మకాల గురించి వేరేవాళ్లకు ఎందుకు చెప్తాం?

మేము అందరిలాంటి వాళ్లమే. మా సంస్కృతులు వేరు, నేపథ్యాలు వేరు. మాలో కొంతమంది ఒకప్పుడు వేరే మతంలో ఉండేవాళ్లు, ఇంకొంతమంది అసలు దేవున్ని నమ్మేవాళ్లే కాదు. యెహోవాసాక్షులం అయ్యే ముందు మాలో ప్రతీ ఒక్కరం సమయం తీసుకుని బైబిలు బోధల్ని జాగ్రత్తగా పరిశోధించాం. (అపొస్తలుల కార్యాలు 17:11) నేర్చుకున్నవాటి మీద నమ్మకం కుదిరాక, మా అంతట మేమే యెహోవా దేవున్ని ఆరాధించాలని నిర్ణయించుకున్నాం.

మేము బైబిలు చదవడం వల్ల ప్రయోజనం పొందుతాం. అందరిలాగే మాకు కూడా సమస్యలు, బలహీనతలు ఉన్నాయి. అయితే బైబిలు సూత్రాల్ని పాటించడానికి కృషిచేయడం వల్ల మా జీవితాలు చాలా మెరుగయ్యాయి. (కీర్తన 128:1, 2) అందుకే బైబిల్లో మేము నేర్చుకున్న మంచి విషయాలు వేరేవాళ్లకు కూడా చెప్తుంటాం.

మేము దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తాం. బైబిలు ప్రమాణాలు మాకు మేలు చేశాయి, అవి మాకు నిజాయితీ, దయ, తోటివాళ్లను గౌరవించడం నేర్పించాయి. సమాజంలో మంచి పౌరులుగా ఉండడానికి, కుటుంబంలో ఐక్యంగా ఉండడానికి, మంచి నైతిక విలువలతో జీవించడానికి అవి సహాయం చేస్తాయి. “దేవునికి పక్షపాతం లేదని” మేము నమ్ముతాం కాబట్టి, మా ప్రపంచవ్యాప్త సహోదర బృందంలో దేశం, జాతి వంటి తేడాలు ఉండవు. మేము అందరిలాంటి వాళ్లమే అయినా, ఒక గుంపుగా చూస్తే ప్రత్యేకమైన ప్రజలం.​—అపొస్తలుల కార్యాలు 4:13; 10:​34, 35.

  • యెహోవాసాక్షులు అందరిలాంటి వాళ్లే అని ఎందుకు చెప్పవచ్చు?

  • యెహోవాసాక్షులు బైబిలు చదవడం వల్ల ఎలా ప్రయోజనం పొందారు?