కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6వ పాఠం

తోటి క్రైస్తవులతో సహవసించడం వల్ల మేము ఎలా ప్రయోజనం పొందుతున్నాం?

తోటి క్రైస్తవులతో సహవసించడం వల్ల మేము ఎలా ప్రయోజనం పొందుతున్నాం?

మడగాస్కర్‌

నార్వే

లెబనాన్‌

ఇటలీ

చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చినా, వాతావరణం బాలేకపోయినా మేము క్రమం తప్పకుండా కూటాలకు వెళ్తాం. సమస్యలున్నా, రోజంతా పనిచేసి అలసిపోయినా యెహోవాసాక్షులు తోటి విశ్వాసులతో సహవసించడానికి ఎందుకంత కృషిచేస్తారు?

మాకు మేలు జరుగుతుంది. కూటాల్లో కలుసుకునేవాళ్లు ‘ఒకరి గురించి ఒకరు ఆలోచించాలని’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 10:24) అంటే, వాళ్లు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలని, ఇతరుల గురించి పట్టించుకోవాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. సంఘంలోని వాళ్లతో పరిచయం పెంచుకోవడం వల్ల, వాళ్లలో కొందరు మాలాంటి సమస్యల్నే విజయవంతంగా ఎదుర్కొన్నారని, వాటిని అధిగమించడానికి వాళ్లు మాకు సహాయం చేయగలరని తెలుసుకుంటాం.

చిరకాల స్నేహాలు ఏర్పడతాయి. మేము కూటాల్లో కలుసుకునేవాళ్లు కేవలం మాకు పరిచయస్థులు కాదు, చాలా దగ్గరి స్నేహితులు. వేరే సమయాల్లో కూడా మేము సరదాగా సమయం గడుపుతాం. దానివల్ల మేము ఒకరినొకరం మరింత విలువైనవాళ్లుగా చూడగలుగుతాం, ప్రేమతో ఒకరికొకరం ఇంకా దగ్గరవ్వగలుగుతాం. మేము సన్నిహిత స్నేహితులమయ్యాం కాబట్టి, మాలో ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయడానికి ముందుంటాం. (సామెతలు 17:17) సంఘంలో ఉన్న వాళ్లందరితో సహవసించడం ద్వారా, ‘ఒకరి మీద ఒకరికి శ్రద్ధ’ ఉందని చూపిస్తాం.—1 కొరింథీయులు 12:25, 26.

దేవుని ఇష్టాన్ని చేస్తున్న వాళ్లతో స్నేహం చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. అలాంటి స్నేహితులు యెహోవాసాక్షుల్లో మీకు దొరుకుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దయచేసి మాతో సహవసించడం మానేయకండి.

  • కూటాల్లో సహోదరసహోదరీలతో సహవసించడం వల్ల మేము ఎలా ప్రయోజనం పొందుతున్నాం?

  • మీరెప్పుడు మా కూటాలకు వచ్చి మాతో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారు?