బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఈ పుస్తకం రకరకాల విషయాల గురించి అంటే మనం ఎందుకు బాధలు పడుతున్నాం, చనిపోయాక మనకు ఏమి అవుతుంది, మనం కుటుంబంలో సంతోషంగా ఎలా ఉండవచ్చు లాంటి ఎన్నో విషయాలు గురించి బైబిలు ఏమి చెప్తుందో మీకు నేర్పిస్తుంది.

దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు?

ఈ రోజుల్లో ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయో మీకు అర్థం కాకపోవచ్చు. బాధల్ని, రోగాల్ని, మరణాన్ని తీసివేయడానికి దేవుడు చర్య తీసుకుంటాడని బైబిలు చెప్తుంది.

1వ అధ్యాయం

దేవుడు ఎవరు?

దేవుడు మీ గురించి పట్టించుకుంటాడని మీకు అనిపిస్తుందా? ఆయన వ్యక్తిత్వం గురించి నేర్చుకోండి, ఆయనకు ఎలా స్నేహితులు అవ్వవచ్చో నేర్చుకోండి.

2వ అధ్యాయం

బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం

మీకున్న సమస్యలను తట్టుకోవడానికి బైబిలు మీకు ఎలా సహాయం చేయగలదు?

3వ అధ్యాయం

దేవుడు ఏ ఉద్దేశంతో మనుషుల్ని చేశాడు?

భూమి పరదైసుగా మారినప్పుడు కొత్త లోకంలో జీవితం ఎలా ఉంటుంది?

4వ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు?

యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ ఎందుకు అయ్యాడో, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన ఎందుకు యెహోవాకు ఒక్కగానొక్క కుమారుడో తెలుసుకోండి.

5వ అధ్యాయం

దేవుని గొప్ప బహుమానం​—⁠విమోచన క్రయధనం

విమోచన క్రయధనం అంటే ఏమిటి? దాని నుండి మీరు ఎలా ప్రయోజనం పొందుతారు?

6వ అధ్యాయం

మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తాము?

చనిపోయిన వాళ్లు ఎక్కడ ఉన్నారు? మనుషులు ఎందుకు చనిపోతారు అనే వాటి గురించి బైబిలు ఏమి చెప్తుందో తెలుసుకోండి.

7వ అధ్యాయం

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

మీ ప్రియమైన వాళ్లు ఎవరైనా చనిపోయారా? వాళ్లను మళ్లీ చూడడం సాధ్యమేనా? పునరుత్థానం గురించి బైబిలు ఏమి నేర్పిస్తుందో తెలుసుకోండి.

8వ అధ్యాయం

దేవుని రాజ్యం అంటే ఏంటి?

చాలామందికి ప్రభువు ప్రార్థన తెలుసు. “నీ రాజ్యం రావాలి” అంటే ఏంటి?

9వ అధ్యాయం

లోకాంతం దగ్గర్లో ఉందా?

బైబిలు ముందే చెప్పినట్లు మనం అంతానికి కాస్త ముందు జీవిస్తున్నామని, మన చుట్టూ ఉన్న మనుషులు చేసే పనులు, వాళ్ల స్వభావం ఎలా రుజువు చేస్తుందో పరిశీలిద్దాం.

10వ అధ్యాయం

దేవదూతల గురించిన సత్యం

దేవదూతలు, చెడ్డదూతలు (దయ్యాలు) గురించి బైబిలు చెప్తుంది. ఈ ఆత్మ ప్రాణులు నిజమైనవాళ్లేనా? వాళ్లు మనకు సహాయం లేదా హాని చేస్తారా?

11వ అధ్యాయం

ఎందుకు ఇన్ని బాధలు?

లోకంలో ఉన్న కష్టాలన్నిటికీ చాలామంది దేవున్ని నిందిస్తారు. మీరు ఏమంటారు? బాధలకు కారణం ఏమిటో బైబిలు నేర్పించే విషయాలు తెలుసుకోండి.

12వ అధ్యాయం

మీరు ఎలా దేవునికి స్నేహితులు అవ్వవచ్చు?

యెహోవాను సంతోషపెట్టేలా మనం జీవించగలమా? నిజంగా మీరు ఆయనకు స్నేహితులు అవ్వగలరు.

13వ అధ్యాయం

ప్రాణం అనే బహుమానాన్ని గౌరవించండి

అబార్షన్‌ని, రక్త మార్పిడిని, జంతువుల ప్రాణాన్ని దేవుడు ఎలా చూస్తాడు?

14వ అధ్యాయం

మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు

యేసు చూపించిన ప్రేమను భర్తలు, భార్యలు, తల్లిదండ్రులు, పిల్లలు అనుకరించవచ్చు. ఆయన నుండి మనం ఏమి నేర్చుకోవాలి?

15వ అధ్యాయం

దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటి?

సత్య మతాన్ని అనుసరించే వాళ్లను గుర్తుపట్టడానికి ఉపయోగపడే ఆరు విషయాలు చూడండి.

16వ అధ్యాయం

దేవున్ని ఆరాధించాలని నిర్ణయించుకోండి

మీ నమ్మకాలను వేరేవాళ్లతో చెప్తున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు రావచ్చు? వాళ్లను బాధపెట్టకుండా మీరు ఎలా చెప్పవచ్చు?

17వ అధ్యాయం

ప్రార్థన అనే వరం

మనం ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడా? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, ప్రార్థన గురించి బైబిలు ఏమి చెప్తుందో మీరు అర్థం చేసుకోవాలి.

18వ అధ్యాయం

నేను దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలా?

క్రైస్తవ బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులు అవ్వాలంటే ఏమేమి చేయడం అవసరం? బాప్తిస్మం దేనికి గుర్తుగా ఉందో, దాన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

19వ అధ్యాయం

యెహోవాకు దగ్గరగా ఉండండి

దేవుడు చేసిన వాటన్నిటికీ మనం ప్రేమను, కృతజ్ఞతను ఎలా చూపించగలం?

అదనపు సమాచారం

బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలో ఉన్న పదాల, పదాల సముదాయాల అర్థాలు