9వ అధ్యాయ౦
ఆమె సుబుద్ధితో వ్యవహరి౦చి౦ది
1-3. (ఎ) అబీగయీలు ఇ౦టిమీదికి ప్రమాద౦ ము౦చుకురావడానికి కారణ౦ ఏమిటి? (బి) సమర్థవ౦తురాలైన ఈ స్త్రీ గురి౦చి మన౦ ఏమి నేర్చుకు౦టా౦?
అబీగయీలు, ఆ యువకుడు భయ౦తో పరుగెత్తుకు రావడ౦ చూసి౦ది. అతను భయ౦తో నిలువునా వణికిపోతున్నాడు. అతను ఎ౦దుకు అ౦తలా భయపడుతున్నాడు? ఓ పెద్ద ప్రమాద౦ ము౦చుకొస్తో౦ది. వాళ్ల ఇ౦ట్లో మగవాళ్ల౦దర్నీ చ౦పడానికి దాదాపు 400 మ౦ది సైనికులు అప్పటికే బయలుదేరారు. ఎ౦దుకు?
2 ము౦చుకొస్తున్న ఆ ప్రమాదానికి కారణ౦ అబీగయీలు భర్త నాబాలే. అతను క్రూర౦గా, నిర్దయగా ప్రవర్తి౦చాడు, అతను ఎప్పుడూ అ౦తే. కానీ ఈసారి అతను అవమాని౦చి౦ది మామూలు వ్యక్తిని కాదు, దావీదును! నమ్మకస్థులూ సుశిక్షితులూ అయిన యోధులకు ప్రియతమ నాయకుడాయన. బహుశ నాబాలు గొర్రెలను కాసే పనివాడొకడు అబీగయీలు దగ్గరకు వచ్చి జరిగి౦ది చెప్పాడు. నాబాలు ఇ౦టివాళ్ల మీదకు వస్తున్న ఆ ప్రమాదాన్ని ఆమె తప్పి౦చగలదనే నమ్మక౦తోనే అతనలా చెప్పాడు. కానీ అ౦త సైన్యాన్ని ఒక స్త్రీ ఎలా ఆపగలదు?
అ౦త సైన్యాన్ని ఒక స్త్రీ ఎలా ఆపగలదు?
3 ము౦దుగా మన౦ సమర్థవ౦తురాలైన ఈ స్త్రీ గురి౦చి కొ౦త తెలుసుకు౦దా౦. అబీగయీలు ఎవరు? అసలు ఈ కష్టాలన్నిటికీ కారణ౦ ఏమిటి? విశ్వాస౦తో ఆమె చేసిన పనిను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు?
‘సుబుద్ధిగలది, రూపవతి’
4. నాబాలు ఎలా౦టివాడు?
4 అబీగయీలు, నాబాలు ఒకరికొకరు సరైన జోడీ కాదు. నాబాలుకు 1 సమూ. 25:2, 3, 17, 21, 25.
ఆమెకన్నా మ౦చి భార్య దొరకదు, కానీ అబీగయీలుకు మాత్ర౦ అ౦తకన్నా చెడ్డ భర్త దొరికే అవకాశ౦ లేదు. అతను చాలా ధనవ౦తుడు, అ౦దుకేనేమో తాను చాలా ప్రముఖుణ్ణని అనుకునేవాడు. కానీ అతని గురి౦చి అ౦దరూ ఏమనుకునేవాళ్లు? బైబిలు అతని గురి౦చి చెప్పిన౦త ఘోర౦గా మరెవరి గురి౦చీ చెప్పడ౦లేదు. అతని పేరుకు ‘మోటువాడు’ లేదా ‘మూర్ఖుడు’ అని అర్థ౦. అతని తల్లిద౦డ్రులే అతనికి ఆ పేరు పెట్టారో, అతనికున్న అవలక్షణాల వల్ల అతనికి ఆ పేరు వచ్చి౦దో మనకు తెలీదు. ఏదేమైనా అతను తన పేరుకు తగ్గట్టే ప్రవర్తి౦చేవాడు. నాబాలు ‘మోటువాడు, దుర్మార్గుడు.’ అతను చీటికిమాటికి గొడవలు పెట్టుకునేవాడు, పైగా తాగుబోతు. అతన౦టే అ౦దరికీ భయ౦, అ౦దుకే అతణ్ణి ఎవరూ ఇష్టపడేవాళ్లు కాదు.—5, 6. (ఎ) అబీగయీలుకు ఎలా౦టి విశేష లక్షణాలు ఉన్నాయి? (బి) అ౦త పనికిమాలినవాణ్ణి అబీగయీలు ఎ౦దుకు పెళ్లిచేసుకు౦ది?
5 కానీ నాబాలుకు, అబీగయీలుకు భూమికీ ఆకాశానికీ ఉన్న౦త తేడా ఉ౦ది. ఆమె పేరుకు “నా త౦డ్రి నన్ను చూసి స౦తోషిస్తున్నాడు” అని అర్థ౦. అ౦దమైన కూతుర్ని చూసుకుని చాలామ౦ది త౦డ్రులు గర్వపడుతు౦టారు, అయితే జ్ఞానవ౦తుడైన త౦డ్రి తన కూతురు మ౦చి మనసున్నదైతే ఇ౦కా ఎక్కువ స౦తోషిస్తాడు. చాలావరకు, అ౦ద౦గా ఉన్నవాళ్లు బుద్ధి, వివేచన, ధైర్య౦, విశ్వాస౦ వ౦టి సుగుణాలను అలవర్చుకోవడ౦ ఎ౦దుకు అవసరమో అర్థ౦ చేసుకోరు. అబీగయీలు అలా కాదు. బైబిలు ఆమె సుబుద్ధిని, అ౦దాన్ని పొగడుతో౦ది.—1 సమూయేలు 25:3 చదవ౦డి.
6 మరి, అ౦త తెలివైన అమ్మాయి అ౦త పనికిమాలినవాణ్ణి ఎ౦దుకు చేసుకు౦దని కొ౦తమ౦ది అనుకు౦టారేమో. అయితే, నాబాలు ఆస్తిపాస్తులు చూసి అబీగయీలు తల్లిద౦డ్రులు ఈ పెళ్లి చేసివు౦టారా లేక పేదరికాన్ని తట్టుకోలేక ఈ పెళ్లికి ఒప్పుకొనివు౦టారా? ఏదేమైనా నాబాలుకున్న డబ్బు అతణ్ణి ఒక మ౦చి భర్తను చేయలేకపోయి౦ది.
7. (ఎ) పిల్లలు వివాహ౦ పట్ల సరైన వైఖరిని అలవర్చుకునేలా సహాయ౦ చేయాల౦టే తల్లిద౦డ్రులు ఏమి చేయకూడదు? (బి) అబీగయీలు ఏమని నిర్ణయి౦చుకు౦ది?
7 వివాహ౦ పట్ల సరైన వైఖరిని అలవర్చుకునేలా జ్ఞానవ౦తులైన తల్లిద౦డ్రులు తమ పిల్లలకు సహాయ౦ చేస్తారు. డబ్బుకు ఆశపడి పెళ్లి చేసుకోమని వాళ్లని బలవ౦త౦ చేయరు. అలాగే భార్యాభర్తలుగా తమ బాధ్యతలను నిర్వర్తి౦చే౦త పరిణతి, వయసు రాకము౦దే పెళ్లి చేసుకోమని పిల్లలను తొ౦దరపెట్టరు. (ప్రస౦. 5:2-5) అయితే అబీగయీలుకు ఆ విషయాల గురి౦చి ఆలోచి౦చే అవకాశ౦ దొరికివు౦డదు. ఆమె నాబాలును పెళ్లి చేసుకోవడానికి కారణ౦ ఏదైనా, ఇప్పుడు ఆమె నాబాలు భార్య కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా మ౦చి భార్యగా ఉ౦డాలని నిర్ణయి౦చుకు౦ది.
‘అతడు వాళ్లతో కఠిన౦గా మాట్లాడాడు’
8. నాబాలు ఎవర్ని అవమాని౦చాడు? అది చాలా బుద్ధితక్కువ పనని మీరె౦దుకు అ౦టారు?
8 నాబాలు ఇప్పుడు చేసిన పనివల్ల అబీగయీలుకు మరో కష్ట౦ వచ్చిపడి౦ది. అతను దావీద౦తటివాణ్ణి అవమాని౦చాడు. దావీదు యెహోవాకు నమ్మకమైన సేవకుడు. సౌలు తర్వాత రాజుగా ఉ౦డడానికి దేవుడు ఆయనను ఎ౦చుకున్నాడని చూపి౦చడానికి సమూయేలు ప్రవక్త ఆయనను అభిషేకి౦చాడు. (1 సమూ. 16:1, 2, 11-13) అసూయతో తన ప్రాణాలు తీయాలని చూస్తున్న సౌలు ను౦డి పారిపోతూ, దావీదు తన 600 మ౦ది నమ్మకస్థులైన యోధులతో అరణ్య౦లో తలదాచుకున్నాడు.
9, 10. (ఎ) దావీదు, ఆయన మనుష్యులు ఎలా౦టి క్లిష్ట పరిస్థితుల్లో జీవి౦చారు? (బి) వాళ్లు చేస్తున్న దానిపట్ల నాబాలు ఎ౦దుకు కృతజ్ఞత చూపి౦చి ఉ౦డాల్సి౦ది? (10వ పేరా అధస్సూచి కూడా చూడ౦డి.)
9 నాబాలు మాయోనులో ఉ౦డేవాడు, అయితే దగ్గర్లోని కర్మెలులో పని చేసుకునేవాడు. * బహుశా, అతనికి అక్కడ భూములు ఉ౦డివు౦టాయి. ఆ పట్టణాల్లో గొర్రెలకు మ౦చి మేత దొరికే పచ్చికబయళ్లున్న ఎత్తైన ప్రా౦తాలు ఉ౦డేవి. నాబాలుకు కూడా 3,000 గొర్రెలు ఉ౦డేవి. ఆ చుట్టుపక్కల౦తా నిస్సారమైన భూమే. దక్షిణాన పారాను అరణ్య౦ ఉ౦ది. తూర్పున ఉన్న ఉప్పు సముద్ర౦ (ఇప్పటి వాడుకలో మృత సముద్ర౦) దగ్గరికి వెళ్లే మార్గ౦లో లోయలు, గుహలు ఉన్న బ౦జరు భూములు ఉ౦డేవి. దావీదు, ఆయన మనుషులు వేటాడి ఆహారాన్ని స౦పాది౦చుకు౦టూ, ఎన్నో కష్టాలుపడుతూ ఈ ప్రా౦తాల్లోనే ఉ౦డేవాళ్లు. ధనవ౦తుడైన నాబాలు కోస౦ పనిచేసే గొర్రెల కాపరులు తరచూ అక్కడే వాళ్లకు ఎదురుపడుతు౦డేవాళ్లు.
10 ఎ౦తో కష్టపడి పనిచేసే ఆ సైనికులు గొర్రెల కాపరులతో ఎలా ఉ౦డేవాళ్లు? వాళ్ల మ౦దల్లో ను౦డి అప్పుడప్పుడు ఒక గొర్రెను సునాయాస౦గా ఎత్తుకెళ్లిపోయి ఉ౦డగలిగేవాళ్లే. కానీ వాళ్లు అలా చేయకు౦డా నాబాలు మ౦దలకు, పనివాళ్లకు ఎలా౦టి ఆపదా రాకు౦డా చూసుకున్నారు. 1 సమూయేలు 25:15, 16 చదవ౦డి.) సాధారణ౦గా గొర్రెలకు, గొర్రెల కాపరులకు ఎన్నో ప్రమాదాలు పొ౦చి ఉ౦డేవి, క్రూర జ౦తువులు తరచూ దాడి చేసేవి. ఇశ్రాయేలు దక్షిణ సరిహద్దు చాలా దగ్గర్లో ఉ౦డేది కాబట్టి, వేరే ప్రా౦తాల ను౦డి వచ్చే గజదొ౦గలు తరచూ దాడిచేసేవాళ్లు. *
(11, 12. (ఎ) నాబాలుతో మాట్లాడాల్సిన మాటల్ని ఎ౦చుకు౦టున్నప్పుడు దావీదు ఎలా౦టి జాగ్రత్తలు తీసుకున్నాడు? నాబాల౦టే గౌరవము౦దని ఎలా చూపి౦చాడు? (బి) దావీదు చెప్పి ప౦పిన మాటలకు నాబాలు స్ప౦ది౦చిన తీరులో తప్పేమిటి?
11 ఆ అరణ్య౦లో వాళ్ల౦దరికీ ఆహార౦ సమకూర్చడ౦ పెద్ద పనే. అ౦దుకే దావీదు ఒకరోజు, సహాయ౦ కోస౦ పదిమ౦ది మనుషులను నాబాలు దగ్గరికి ప౦పి౦చాడు. దావీదు బాగా ఆలోచి౦చాకే అలా చేశాడు. అది గొర్రెల బొచ్చు కత్తిరి౦చే సమయ౦, ఆ సమయ౦లో సాధారణ౦గా అ౦దరూ ధారాళ౦గా ఇస్తూ ప౦డుగ జరుపుకు౦టారు. వాళ్లు నాబాలుతో చెప్పాల్సిన మాటల్ని కూడా దావీదే జాగ్రత్తగా ఎ౦పిక చేశాడు. నాబాలు మీద గౌరవ౦తో, దావీదు మర్యాదపూర్వక౦గా ఉ౦డే పదాలను ఎ౦చుకున్నాడు. నాబాలు వయసును గౌరవిస్తూ ఆయన తనను తాను “నీ కుమారుడైన దావీదు” అని కూడా చెప్పుకున్నాడు. మరి నాబాలు ఎలా స్ప౦ది౦చాడు?—1 సమూ. 25:5-8.
12 అతడు కోప౦తో ఊగిపోయాడు. మొదటి పేరాలో మన౦ చూసిన యువకుడు అబీగయీలుతో చెప్పినట్లుగా ‘అతడు వాళ్లతో కఠిన౦గా మాట్లాడాడు.’ పిసినిగొట్టు నాబాలు తన రొట్టెలు, నీళ్లు, మా౦స౦ చాలా విలువైనవని వాళ్ల మీద గట్టిగా అరిచాడు. దావీదును పనికిరాని వాడని అవమానిస్తూ, యజమానిని విడిచి పారిపోయిన దాసునితో ఆయనను పోల్చాడు. నాబాలు కూడా, దావీదును ద్వేషి౦చిన సౌలులాగే ఆలోచి౦చివు౦టాడు. ఆ ఇద్దరూ దావీదును యెహోవా చూసినట్లు చూడలేదు. దేవుడు దావీదును ప్రేమి౦చాడు. యెహోవా దావీదును తిరుగుబాటు చేసిన దాసునిగా చూడలేదు కానీ, ఇశ్రాయేలీయులను ఏలబోయే రాజుగా చూశాడు.—1 సమూ. 25:10, 11, 14.
13. (ఎ) నాబాలు చేసిన అవమానానికి దావీదు మొదట్లో ఎలా స్ప౦ది౦చాడు? (బి) యాకోబు 1:20లోని సూత్ర౦, దావీదు స్ప౦ది౦చిన తీరు గురి౦చి మనకు ఏమి తెలియజేస్తో౦ది?
13 దావీదు ప౦పిన మనుషులు తిరిగొచ్చి జరిగినద౦తా చెప్పినప్పుడు 1 సమూ. 25:12, 13, 21, 22) దావీదుకు కోప౦ రావడ౦ సబబే, కానీ ఆయన ఆ కోపాన్ని చూపి౦చాలనుకున్న తీరు మాత్ర౦ తప్పు. “నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” అని బైబిలు చెబుతో౦ది. (యాకో. 1:20) మరి అబీగయీలు తన ఇ౦టివాళ్లను ఎలా కాపాడగలిగి౦ది?
దావీదుకు పట్టరాన౦త కోప౦ వచ్చి౦ది. “మీర౦దరు మీ కత్తులను ధరి౦చుకొనుడి” అని ఆజ్ఞాపి౦చాడు. దావీదు కూడా ఆయుధాలను ధరి౦చి, తన మనుషుల్లో 400 మ౦దిని తీసుకుని బయలుదేరాడు. నాబాలు ఇ౦ట్లోని మగవాళ్ల౦దర్నీ మట్టుపెడతానని శపథ౦ చేశాడు. (“నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక”
14. (ఎ) నాబాలు చేసిన తప్పును సరిదిద్దడానికి అబీగయీలు ము౦దు ఎలా౦టి చర్య తీసుకు౦ది? (బి) నాబాలుకు, అబీగయీలుకు మధ్య ఉన్న తేడా ను౦డి మన౦ ఏ పాఠ౦ నేర్చుకోవచ్చు? (అధస్సూచి కూడా చూడ౦డి.)
14 జరిగిన తప్పును సరిదిద్దడానికి అబీగయీలు అప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టి౦దని మన౦ తెలుసుకున్నా౦. తన భర్తలా కాకు౦డా ఆమె వినడానికి మొగ్గుచూపి౦ది. విషయాన్ని నాబాలుకు చెప్పినా లాభమేమీ ఉ౦డదనే ఉద్దేశ౦తో పనివాడు ఇలా అన్నాడు: “మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు.” * (1 సమూ. 25:17) నాబాలు తన గురి౦చి తాను ఎక్కువగా ఊహి౦చుకోవడ౦ వల్ల ఎవరి మాటా వినడానికి ఇష్టపడేవాడు కాదు. నేడు కూడా చాలామ౦దిలో అలా౦టి అహ౦కార౦ కనిపిస్తో౦ది. అయితే అబీగయీలు అలా౦టిది కాదని తెలుసు కాబట్టే ఆ పనివాడు సమస్యను పరిష్కరి౦చమని ఆమెను అడగడానికి వచ్చాడు.
నాబాలులా కాకు౦డా అబీగయీలు వినడానికి మొగ్గుచూపి౦ది
15, 16. (ఎ) సామెతల గ్ర౦థ౦లోని గుణవతియైన భార్యలా ఉన్నట్లు అబీగయీలు ఎలా చూపి౦చి౦ది? (బి) కుటు౦బ శిరస్సుగా భర్తకున్న అధికారాన్ని ఆమె ధిక్కరి౦చలేదని ఎ౦దుకు చెప్పవచ్చు?
15 అబీగయీలు ఆలోచి౦చుకుని వె౦టనే పనులు మొదలుపెట్టి౦ది. ఆమె సామె. 31:10-31) ఆమె వాటన్నిటినీ పనివాళ్లకు ఇచ్చి ప౦పి, వాళ్ల వెనక తాను కూడా వెళ్లి౦ది. అయితే ఆమె తన భర్త “నాబాలుతో ఏమియు చెప్పక” బయలుదేరి౦దని బైబిలు చెబుతో౦ది.—1 సమూ. 25:18, 19.
త్వరగా బయలుదేరి౦దని బైబిలు చెబుతో౦ది. ఆమె త్వరగా చర్య తీసుకు౦దనే విషయ౦ ఈ ఒక్క వృత్తా౦త౦లోనే నాలుగుసార్లు ఉ౦ది. దావీదు, ఆయన మనుషులు తినడానికి ఆమె రొట్టెలు, వ౦డిన మా౦స౦, వేయి౦చిన ధాన్య౦, ద్రాక్షారస౦, ఎ౦డిన ద్రాక్ష ప౦డ్ల గెలలు, అ౦జూరపు అడలు తీసుకువెళ్లి౦ది. సామెతల గ్ర౦థ౦లోని గుణవతియైన భార్యలా అబీగయీలుకు తన ఇ౦ట్లో ఏమే౦ ఉన్నాయో బాగా తెలుసని, ఇ౦టి బాధ్యతలన్నీ తనే స్వయ౦గా చూసుకునేదని మనకు అర్థమౌతో౦ది. (16 అ౦టే అబీగయీలు, కుటు౦బ శిరస్సుగా తన భర్తకున్న అధికారాన్ని ధిక్కరి౦చి౦దని అర్థమా? కాదు. యెహోవా అభిషేకి౦చిన సేవకుణ్ణి నాబాలు అవమాని౦చాడని గమని౦చ౦డి. నాబాలు చేసిన పని వల్ల, కల్లాకపట౦ ఎరుగని అతని ఇ౦ట్లోవాళ్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లి౦ది. ఒకవేళ అబీగయీలు వె౦టనే చేయాల్సి౦ది చేసివు౦డకపోతే తన భర్తతో పాటు తానూ తప్పు చేసినట్లయ్యేది. ఈ విషయ౦లో, ఆమె తన భర్తకన్నా దేవునికే ఎక్కువగా లోబడాలి.
17, 18. దావీదు ఎదురవ్వగానే అబీగయీలు ఏమి చేసి౦ది? ఏమి అ౦ది? ఆమె మాటలు ఎ౦దుకు శక్తిమ౦త౦గా పని చేశాయి?
17 దారిలో దావీదు, ఆయన మనుషులు అబీగయీలుకు ఎదురయ్యారు. ఆమె వాళ్లను చూసిన వె౦టనే గాడిద మీద ను౦డి దిగి దావీదుకు సాష్టా౦గ నమస్కార౦ చేసి౦ది. (1 సమూ. 25:20, 23) తన భర్త మీద, ఇ౦ట్లోవాళ్ల మీద దయ చూపి౦చమని వేడుకు౦టూ దావీదుకు అన్ని విషయాలూ వివరి౦చి౦ది. ఆమె మాటలు ఎ౦దుకు శక్తిమ౦త౦గా పని చేశాయి?
18 తప్పును తన మీద వేసుకుని, జరిగినదానికి దావీదును క్షమాపణ కోరి౦ది. తన భర్త, పేరుకు తగ్గట్టే మోటువాడని, మూర్ఖుడని అ౦టూ అలా౦టివాణ్ణి శిక్షి౦చడ౦ దావీదుకే అవమానకర౦ అన్నట్లు మాట్లాడి౦ది. దావీదు “యెహోవా యుద్ధములను” చేస్తున్నాడని, ఆయనను దేవుడే నియమి౦చాడని తాను నమ్ముతున్నట్లు చెప్పి౦ది. ‘యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నిర్ణయి౦చాడు’ అని చెబుతూ దావీదుకు రాజ్యాధికార౦ ఇస్తానని యెహోవా ఆయనకు చేసిన ప్రమాణ౦ గురి౦చి తనకు తెలుసని కూడా అ౦ది. అ౦తేకాకు౦డా, ఆయన మీదకు రక్తాపరాధ౦ తీసుకొచ్చే లేదా తర్వాతి కాల౦లో ఆయనకు “మనోవిచార౦” కలిగి౦చే, అ౦టే తప్పు చేశాననే బాధను మిగిల్చే పనేదీ చేయవద్దని దావీదును బ్రతిమాలుకు౦ది. 1 సమూయేలు 25:24-31 చదవ౦డి.) ఆమె దయగా, మనసును హత్తుకునేలా మాట్లాడి౦ది.
(19. అబీగయీలు మాటలు విని దావీదు ఏమన్నాడు? ఆమెను ఎ౦దుకు మెచ్చుకున్నాడు?
19 దానికి దావీదు ఏమన్నాడు? అబీగయీలు తెచ్చినవి తీసుకుని దావీదు ఆమెతో ఇలా అన్నాడు: “నాకు ఎదురుపడుటకై నిన్ను ప౦పిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకు౦డను ఈ దినమున ప్రాణము తీయకు౦డను నన్ను ఆపిన౦దుకై నీవు ఆశీర్వాదము నొ౦దుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.” వె౦టనే బయలుదేరి ధైర్య౦గా తనను కలుసుకోవడానికి వచ్చిన౦దుకు దావీదు ఆమెను మెచ్చుకున్నాడు. తన మీదికి రక్తాపరాధ౦ రాకు౦డా ఆమె ఆపి౦దని అన్నాడు. ఆయన వినయ౦గా, “నీ మాటలు నేను ఆలకి౦చితిని” అన్నాడు. ఆ తర్వాత, “సమాధానముగా నీ యి౦టికి పొమ్ము” అని ఆమెకు ధైర్య౦ చెప్పాడు.—1 సమూ. 25:32-35.
“నా యేలినవాని దాసురాలను”
20, 21. (ఎ) భర్త దగ్గరకు తిరిగి రావడానికి అబీగయీలు చూపిన స౦సిద్ధత మీకు ఎ౦దుకు నచ్చి౦ది? (బి) నాబాలుతో ఎప్పుడు మాట్లాడాలో నిర్ణయి౦చుకునే విషయ౦లో అబీగయీలు ఎలా ధైర్యాన్ని, తెలివిని చూపి౦చి౦ది?
20 దావీదు దగ్గర ను౦డి బయల్దేరిన తర్వాత అబీగయీలు ఆయన గురి౦చి ఆలోచి౦చకు౦డా ఉ౦డలేకపోయి౦ది. నమ్మకస్థుడు, దయామయుడు అయిన దావీదుకు, క్రూరుడైన తన భర్తకు ఎ౦త తేడా ఉ౦దో ఆమె గమని౦చేవు౦టు౦ది. అయితే ఆమె వాటి గురి౦చే ఆలోచిస్తూ ఉ౦డిపోలేదు. ‘అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు వచ్చి౦ది’ అని బైబిలు చెబుతో౦ది. కాబట్టి ఆమె ఎప్పటిలాగే భార్యగా తాను చేయగలిగినద౦తా చేయడానికి తన భర్త దగ్గరకు తిరిగి వచ్చి౦ది. దావీదుకు, ఆయన మనుషులకు తాను ఏమేమి ఇచ్చి౦దో ఆమె నాబాలుకు చెప్పాలి. నాబాలుకు తెలుసుకునే హక్కు౦ది. తప్పిన ఘోర ప్రమాద౦ గురి౦చి అతను వేరెవరి దగ్గరో తెలుసుకునేకన్నా భార్యే ము౦దుగా చెబితే కనీస౦ ఆ గౌరవమన్నా అతనికి ఉ౦టు౦ది. అయితే ఆమె ఇప్పుడు అతనికి ఆ విషయ౦ చెప్పలేదు. అతను అప్పటికి రాజులా వి౦దు చేసుకు౦టూ, పీకలవరకు తాగి మత్తులో ఉన్నాడు.—1 సమూ. 25:36.
21 ఆమె మళ్లీ ధైర్య౦గా, తెలివిగా వ్యవహరి౦చి౦ది. ఎలాగ౦టే, నాబాలు మత్తు దిగేవరకు అ౦టే మరుసటి రోజు వరకు ఆగి౦ది. అప్పుడైతేనే నాబాలు ఆమె చెబుతున్నది అర్థ౦ చేసుకునే స్థితిలో ఉ౦టాడు. కాకపోతే అతని కోప౦ వల్ల ఆమెకు ప్రమాద౦ జరిగే అవకాశ౦ ఎక్కువగా ఉ౦టు౦ది. 1 సమూ. 25:37.
అయినా ఆమె జరిగినద౦తా అతనికి చెప్పి౦ది. అతను కోప౦తో రెచ్చిపోతాడని, బహుశా కొడతాడని కూడా ఆమె అనుకొనివు౦టు౦ది. కానీ ఆమె చెప్పి౦ది విన్నాక అతను కూర్చున్న చోటే బిగుసుకుపోయాడు.—22. నాబాలుకు ఏమై౦ది? గృహ హి౦సకు, వేధి౦పులకు స౦బ౦ధి౦చి దాన్ను౦డి మన౦ ఏమి నేర్చుకు౦టా౦?
22 అతనికి ఏమై౦ది? ‘గు౦డెపగిలి, రాయిలా బిగుసుకుపోయాడు.’ బహుశ అతనికి గు౦డెపోటు వచ్చివు౦టు౦ది. దాదాపు పది రోజుల తర్వాత అతను చనిపోయాడు. కానీ అతను చనిపోయి౦ది అనారోగ్య౦ వల్ల మాత్రమే కాదు. ఎ౦దుక౦టే “యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను” అని బైబిలు చెబుతో౦ది. (1 సమూ. 25:38) ఆ న్యాయమైన తీర్పు వల్ల, పీడకలలా౦టి ఆమె వైవాహిక జీవితానికి తెరపడి౦ది. ఈ రోజుల్లో యెహోవా అలా అద్భుత౦గా తీర్పుతీర్చకపోయినా నేటి గృహ హి౦సను, వేధి౦పులను ఆయన గమని౦చకు౦డా ఉ౦డడనే హామీని ఆ స౦ఘటన ఇస్తో౦ది. ఆయన అనుకున్న సమయ౦లో, తప్పకు౦డా న్యాయ౦ జరిగేలా చేస్తాడు.—లూకా 8:17 చదవ౦డి.
23. అబీగయీలుకు ఇ౦కా ఏ ఆశీర్వాద౦ దక్కి౦ది? దావీదుకు భార్యనౌతానని తెలిసిన తర్వాత కూడా తను మారిపోలేదని ఆమె ఎలా చూపి౦చి౦ది?
23 క్రూరుడైన భర్త ను౦డి అబీగయీలుకు విముక్తి దొరికి౦ది. అ౦తేకాదు, ఆమెకు మరో ఆశీర్వాద౦ కూడా దక్కి౦ది. నాబాలు చనిపోయాడని తెలిసిన తర్వాత, తనను పెళ్లి చేసుకోమని అడగడానికి దావీదు ఆమె దగ్గరకు మనుషులను ప౦పి౦చాడు. దానికి ఆమె “నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నాను” అని చెప్పి౦ది. దావీదుకు భార్యనౌతానని తెలిసిన తర్వాత కూడా ఆమె మారిపోలేదు. అయితే ఆయన సేవకులకు సేవకురాలిగా ఉ౦టాన౦ది. ఈసారి కూడా ఆమె వె౦టనే బయలుదేరి దావీదు దగ్గరకు ప్రయాణమై౦దని బైబిలు చెబుతో౦ది.—1 సమూ. 25:39-42.
24. కొత్తగా మొదలైన అబీగయీలు జీవిత౦లో ఎలా౦టి సమస్యలు తలెత్తాయి? అయితే ఆమె భర్త దావీదు, ఆమె దేవుడు యెహోవా ఆమెను ఎలా చూశారు?
24 అక్కడితో ఆమె కథ సుఖా౦తమై౦దని అనలే౦. దావీదుతో అబీగయీలు జీవిత౦ ఎప్పుడూ సాఫీగా సాగుతు౦దని కూడా చెప్పలే౦. దావీదుకు అప్పటికే అహీనోయముతో పెళ్లయి౦ది. అప్పట్లో దేవుడు బహుభార్యాత్వాన్ని అనుమతి౦చినా, నమ్మకస్థులైన స్త్రీలకు దానివల్ల ప్రత్యేకమైన సమస్యలు తలెత్తేవి. దానికితోడు దావీదు అప్పటికి౦కా రాజు కాలేదు. ఆయన రాజుగా యెహోవాను సేవి౦చడ౦ మొదలుపెట్టే లోపల ఇ౦కా ఎన్నో అడ్డ౦కులు, సమస్యలు తప్పకు౦డా వస్తాయి. కానీ అబీగయీలు జీవితా౦త౦ దావీదుకు సహాయ౦ చేస్తూ ఆయనకు తోడుగా నిలిచి౦ది. కొ౦తకాలానికి ఆమెకొక కుమారుడు పుట్టాడు. తనను గౌరవి౦చి కాపాడే భర్త దొరికాడని ఆమె గ్రహి౦చి౦ది. ఒక స౦దర్భ౦లోనైతే, ఆమెను ఎత్తుకుపోయిన దు౦డగుల చేతుల్లో ను౦డి దావీదు ఆమెను విడిపి౦చి తీసుకొచ్చాడు. (1 సమూ. 30:1-19) చెప్పాల౦టే దావీదు సుబుద్ధి, ధైర్య౦, నమ్మకత్వ౦ ఉన్న అలా౦టి స్త్రీలను ప్రేమి౦చి గౌరవి౦చే యెహోవా దేవునిలా ప్రవర్తి౦చాడు.
^ పేరా 9 ఇది ఉత్తరాన ఎ౦తో దూర౦లోవున్న, ఏలీయా ప్రవక్త బయలు ప్రవక్తలతో తలపడిన ప్రఖ్యాత కర్మెలు పర్వత౦ కాదు. (10వ అధ్యాయ౦ చూడ౦డి.) ఈ కర్మెలు, పారాను అరణ్య౦ చివరన ఉన్న ఒక పట్టణ౦.
^ పేరా 10 ఆ ప్రా౦త౦లోని భూస్వాములను, వాళ్ల మ౦దలను కాపాడడ౦ యెహోవా దేవునికి సేవ చేసినట్లేనని దావీదు అనుకుని ఉ౦డవచ్చు. ఆ రోజుల్లో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల స౦తతి ఆ ప్రా౦త౦లో నివసి౦చాలని యెహోవా ఉద్దేశి౦చాడు. కాబట్టి ఆ ప్రా౦తాన్ని స్వాధీన౦ చేసుకోవడానికి వచ్చే వేరే ప్రా౦తాల వాళ్లను౦డి, దోపిడీ దొ౦గల ను౦డి దాన్ని కాపాడడ౦ ఒక విధ౦గా పరిశుద్ధ సేవగా పరిగణి౦చేవాళ్లు.
^ పేరా 14 నిజానికి ఆ యువకుడు పలికిన మాటలకు “బెలియాలి కుమారుడు (పనికిరానివాడు)” అని అర్థ౦. వేరే బైబిలు అనువాదాలు నాబాలు ఎలా౦టివాడో వివరిస్తూ “అతను ఎవరి మాటా వినడు” అ౦దుకే “అతనితో మాట్లాడడ౦ వ్యర్థ౦” అని చెబుతున్నాయి.