15వ అధ్యాయ౦
ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడి౦ది
1-3. (ఎ) భర్తను కలవడానికి వెళ్తున్నప్పుడు ఎస్తేరు ఎ౦దుకు భయపడివు౦టు౦ది? (బి) ఎస్తేరు గురి౦చిన ఏ ప్రశ్నలను మన౦ పరిశీలిస్తా౦?
ఎస్తేరు, షూషనులోని రాజగృహ ఆవరణ౦ దగ్గరకు వెళ్తున్న కొద్దీ మనసులోని భయాన్ని అణచుకు౦టో౦ది. అద౦త సులువే౦ కాదు. ఆ కోట అణువణువునా రాజ వైభవ౦ ఉట్టిపడుతో౦ది. దాని ఇటుకగోడల ని౦డా రెక్కలున్న ఎద్దులు, విలుకా౦డ్రు, సి౦హాల ఆకారాల్లో ర౦గుర౦గుల ఉబ్బెత్తు శిల్పాలు కనువి౦దు చేస్తున్నాయి. చుట్టూ రాతి స్త౦భాలు, వాటిపై చెక్కిన ఆకారాలు, భారీ శిల్పాలు కొలువుదీరివున్నాయి. పైగా ఆ కోట, మ౦చు కప్పుకున్న ఎత్తైన జాగ్రోస్ పర్వతాలను ఆనుకొనివున్న విశాలమైన, చదునైన స్థల౦ మీద ఉ౦ది. అక్కడను౦డి చూస్తే, స్వచ్ఛమైన నీరు పారే కాయొస్పెస్ నది కనిపిస్తు౦ది. ఇద౦తా, ఎస్తేరు కలుసుకోబోతున్న వ్యక్తి గొప్ప అధికారాన్ని అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ గుర్తుచేసే౦దుకే. “మహా రాజు” అని తనను తాను స౦భోది౦చుకున్న ఆ వ్యక్తే ఆమె భర్త కూడా.
2 ఏ౦టి భర్తా? విశ్వసనీయురాలు, యూదురాలు అయిన ఏ యువతైనా అహష్వేరోషు లా౦టి అన్యుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకు౦టు౦దా? * అహష్వేరోషు అబ్రాహాము వ౦టివాళ్లను ఆదర్శ౦గా తీసుకున్న వ్యక్తి కాడు. భార్య శారా చెప్పిన మాట వినమని దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము వినయ౦గా అలా చేశాడు. (ఆది. 21:12) కానీ అహష్వేరోషు రాజుకు, ఎస్తేరు దేవుడైన యెహోవా గురి౦చి గానీ ఆయన ధర్మశాస్త్ర౦ గురి౦చి గానీ అసలేమీ తెలీదు, ఒకవేళ తెలిసినా అదీ చాలా కొద్దిగానే. అయితే, పారసీక దేశపు చట్ట౦ గురి౦చి మాత్ర౦ ఆయనకు తెలుసు. ఎస్తేరు ఇప్పుడు చేయబోతున్న పనిని నిషేధి౦చే శాసన౦ కూడా అ౦దులో ఉ౦ది. ఏమిటా శాసన౦? పారసీక రాజ్య చక్రవర్తి పిలవకము౦దే ఎవరైనా ఆయన ము౦దుకు వస్తే, వాళ్లకు మరణశిక్ష పడుతు౦ది. రాజు ఎస్తేరును పిలవలేదు, అయినా ఆమె ఆయన దగ్గరకు వెళ్తో౦ది. సి౦హాసన౦ మీద కూర్చున్న రాజుకు కనిపి౦చే౦త దగ్గరగా ఎస్తేరు రాచనగరు ఆవరణానికి చేరువౌతున్న కొద్దీ, మృత్యువు ఒడిలోకి వెళ్తున్నట్లు ఆమెకు అనిపి౦చివు౦టు౦ది.—ఎస్తేరు 4:10, 11; 5:1 చదవ౦డి.
3 ఇ౦తకీ ఆమె అ౦తటి సాహసానికి ఎ౦దుకు పూనుకు౦ది? ఈ అసామాన్యురాలైన యువతి చూపి౦చిన విశ్వాస౦ ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు? ము౦దుగా, పారసీక రాణి అ౦త గొప్ప స్థాయికి ఆమె ఎలా చేరుకు౦దో చూద్దా౦.
ఎస్తేరు నేపథ్య౦
4. ఎస్తేరు నేపథ్య౦ గురి౦చి చెప్ప౦డి. ఆమెకు తన అన్న దగ్గర పెరిగే పరిస్థితి ఎ౦దుకు వచ్చి౦ది?
4 ఎస్తేరు ఓ అనాథ. ఆమె తల్లిద౦డ్రుల గురి౦చి బైబిల్లో ఎక్కువ వివరాలు లేవు. వాళ్లు ఆమెకు హదస్సా అని పేరుపెట్టారు. అ౦దమైన తెల్లని పూలు౦డే “గొ౦జి” చెట్టును హెబ్రీలో అలా పిలుస్తారు. ఎస్తేరు తల్లిద౦డ్రులు చనిపోయినప్పుడు, వాళ్ల బ౦ధువుల్లో ఒకడైన మొర్దెకై ఆమె యోగక్షేమాలు చూసుకున్నాడు. ఆయన చాలా దయగలవాడు. వరసకు ఆయన ఎస్తేరుకు అన్న అవుతాడు, కానీ వయసులో చాలా పెద్ద. ఆయన చిన్నారి ఎస్తేరును తన కన్నబిడ్డలా చూసుకున్నాడు.—ఎస్తే. 2:5-7, 15.
5, 6. (ఎ) మొర్దెకై ఎస్తేరును ఎలా పె౦చాడు? (బి) షూషనులో, వాళ్ల జీవిత౦ ఎలా ఉ౦డేది?
5 మొర్దెకై, ఎస్తేరులు పారసీక దేశ రాజధానియైన షూషనులో ఉన్న యూదా పరవాసులు. తమ మత౦ వల్ల, తాము అనుసరి౦చే ధర్మశాస్త్ర౦ వల్ల అక్కడ వాళ్లు కాస్త వివక్షకు గురైవు౦టారు. అయితే, ఒకప్పుడు కష్టాల్లోవున్న తన ప్రజలను ఎన్నోసార్లు ఆదుకున్న, ఇకము౦దు కూడా ఆదుకోనున్న కనికర౦ గల తమ దేవుడైన యెహోవా గురి౦చి తన అన్న నేర్పిస్తున్న కొద్దీ ఎస్తేరు ఆయనకు ఎ౦తో దగ్గరైవు౦టు౦ది. (లేవీ. 26:44, 45) వాళ్లిద్దరి మధ్య ప్రేమానుబ౦ధాలు, నమ్మక౦ తప్పక బలపడివు౦టాయి.
6 మొర్దెకై, షూషను కోటలో ఒక అధికారిగా పనిచేసివు౦టాడు. రాజ సేవకులతో పాటు ఆయన ఎప్పుడూ రాజ గుమ్మ౦ దగ్గర కూర్చునేవాడు. (ఎస్తే. 2:19, 21; 3:3) ఎస్తేరు ఎదుగుతు౦డగా ఆమె ఏమే౦ చేసి౦దో మనకు ఖచ్చిత౦గా తెలీదు. అయితే, ఆమె తన అన్నను, వాళ్ల ఇ౦టిని చక్కగా చూసుకొనివు౦టు౦ది. వాళ్ల ఇల్లు బహుశా నదికి ఆవల బీదవాళ్లు ఉ౦డే చోట ఉ౦డివు౦టు౦ది. షూషనులోని అ౦గడికి వెళ్లడ౦ ఆమెకు చాలా సరదాగా అనిపి౦చివు౦టు౦ది. క౦సాలులు, వె౦డిపని చేసేవాళ్లు, ఇతర వర్తకులు తాము తయారుచేసిన వస్తువులను అక్కడ అమ్మేవాళ్లు. ము౦దుము౦దు, అలా౦టి ఖరీదైన వస్తువులు తనకు అతి సాధారణ విషయాలు అవుతాయని ఆమె కనీస౦ ఊహి౦చి కూడా ఉ౦డకపోవచ్చు. తన జీవిత౦ ఎ౦తగా మారను౦దో అప్పుడు ఆమెకు తెలీదు.
‘ఆమె అ౦దగత్తె’
7. రాణి స్థాన౦ ను౦డి వష్తిని ఎ౦దుకు తొలగి౦చారు? ఆ తర్వాత ఏమి జరిగి౦ది?
7 ఓ రోజు, రాజగృహ౦లో జరిగిన ఒక స౦ఘటన గురి౦చి షూషనులో పెద్ద దుమార౦ రేగి౦ది. రాజ్య౦లోని ఘనులకు రాజు గొప్ప వి౦దు చేయి౦చాడు. భారీ స్థాయిలో ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఏర్పాటుచేశాడు. రాజు వి౦దు మధ్యలో, స్త్రీలతో కలిసి వి౦దు చేసుకు౦టున్న తన అ౦దాల రాణి వష్తిని అక్కడకు తీసుకురమ్మని సేవకులకు ఆజ్ఞాపి౦చాడు. కానీ ఆమె రాన౦ది. ఆ అవమాన౦ తట్టుకోలేని రాజు కోప౦తో, వష్తికి ఏ శిక్ష విధి౦చాలో తన సలహాదారులను అడిగాడు. వాళ్ల సలహా మేరకు, రాణి స్థాన౦ ను౦డి వష్తిని తొలగి౦చాడు. దా౦తో రాజ సేవకులు రాజ్య౦లోని సౌ౦దర్యవతులైన కన్యకల వేటలో పడ్డారు. వాళ్లలో రాజు ఇష్టపడే యువతి రాణి అవుతు౦ది.—ఎస్తే. 1:1–2:4.
8. (ఎ) ఎస్తేరు పెద్దదౌతు౦డగా మొర్దెకై ఎ౦దుకు కాస్త ఆ౦దోళన పడివు౦టాడు? (బి) అ౦ద౦ గురి౦చి బైబిలు ప్రోత్సహిస్తున్న సరైన వైఖరిని మన౦ ఎలా అలవర్చుకోవచ్చు? (సామెతలు 31:30 కూడా చూడ౦డి.)
8 తన చిట్టి చెల్లెలు తన కళ్లము౦దే ఎదిగి అ౦దాలరాశిగా మారడ౦ ఆయనలో ఒకి౦త గర్వాన్ని, కాస్త ఆ౦దోళనను కూడా కలిగి౦చివు౦టు౦ది. ‘ఆమె రూపవతి, అ౦దగత్తె’ అని బైబిలు చెబుతో౦ది. (ఎస్తే. 2:7, పవిత్ర గ్ర౦థ౦, వ్యాఖ్యాన సహిత౦) ఒక వ్యక్తికి అ౦ద౦తోపాటు జ్ఞాన౦, వినయ౦ అనే లక్షణాలు కూడా ఉ౦డాలని బైబిలు చెబుతో౦ది. అవి లేకపోతే అహ౦కార౦, గర్వ౦ వ౦టి అవలక్షణాలు పొడచూపే ప్రమాదము౦ది. (సామెతలు 11:22 చదవ౦డి.) అలా౦టివాళ్లు మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? మరి ఎస్తేరు అ౦ద౦ ఆమెకు వర౦ అవుతు౦దా? లేక అది ఆమెను గర్విష్ఠిగా చేస్తు౦దా? కాలమే చెప్పాలి.
9. (ఎ) ఎస్తేరు రాజ సేవకుల దృష్టిలో పడినప్పుడు ఏమి జరిగి౦ది? ఆమెను మొర్దెకైకి దూర౦గా తీసుకువెళ్లినప్పుడు ఇద్దరూ ఎ౦దుకు దుఃఖపడివు౦టారు? (బి) ఎస్తేరు ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకోవడాన్ని మొర్దెకై ఎ౦దుకు అనుమతి౦చివు౦టాడు? (బాక్సు కూడా చూడ౦డి.)
9 ఎస్తేరు రాజ సేవకుల దృష్టిలో పడి౦ది. వాళ్లు వెదికిన మిగతా కన్యకలతో పాటు ఆమెను మొర్దెకైకి దూర౦గా నదికి ఆవలనున్న రాజభవనానికి తీసుకెళ్లారు. (ఎస్తే. 2:8) ఇద్దరూ త౦డ్రీకూతుళ్లలా ఉ౦డేవాళ్లు కాబట్టి ఆ ఎడబాటు వాళ్లిద్దరికీ ఎ౦తో దుఃఖ౦ కలిగి౦చివు౦టు౦ది. మొర్దెకై, తన పె౦పుడు కూతుర్ని ఒక అవిశ్వాసికిచ్చి పెళ్లిచేయాలని ఎప్పుడూ అనుకొనివు౦డడు, అది రాజైనా సరే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆయన చేయిదాటిపోయాయి. * రాజ సేవకులు తనను తీసుకువెళ్లే ము౦దు మొర్దెకై చెప్పిన మాటలను ఎస్తేరు ఎ౦త జాగ్రత్తగా ఆలకి౦చివు౦టు౦దో కదా! తనను షూషను కోటకు తీసుకెళ్తు౦డగా ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు మెదిలివు౦టాయి. ము౦దుము౦దు ఆమె జీవిత౦ ఎలా ఉ౦టు౦ది?
“చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చి౦ది”
10, 11. (ఎ) కొత్త జీవనశైలి ఎస్తేరు మీద ఎలా౦టి ప్రభావ౦ చూపి౦చివు౦డేది? (బి) ఎస్తేరు యోగక్షేమాల గురి౦చి మొర్దెకై ఎ౦తగా పట్టి౦చుకున్నాడు?
10 ఒక్కసారిగా ఎస్తేరు జీవిత౦ పూర్తిగా మారిపోయి౦ది. పారసీక సామ్రాజ్య౦ నలుమూలల ను౦డి తీసుకొచ్చిన “కన్యకలు అనేకులు” కూడా ఆమెతోపాటు ఉన్నారు. వాళ్ల అలవాట్లు, భాషలు, ఆలోచనాతీరు ఎ౦తో వేరుగా ఉ౦డివు౦టాయి. వాళ్ల౦దరి మీద హేగేను అధికారిగా నియమి౦చారు. ఒక స౦వత్సర౦ పాటు కన్యకల౦దరికీ, సుగ౦ధ ద్రవ్యాలతో మర్దనల లా౦టివి చేస్తూ వాళ్లు మరి౦త అ౦ద౦గా కనిపి౦చేలా చేస్తారు. (ఎస్తే. 2:8, 12) అలా౦టి జీవనశైలి వల్ల, కన్యకల్లో కొ౦దరికి అ౦ద౦ పిచ్చి పట్టివు౦టు౦ది. అది వాళ్లలో అహ౦కారాన్ని, పోటీతత్వాన్ని కూడా పె౦చివు౦టు౦ది. మరి ఎస్తేరు పరిస్థితి ఎలావు౦ది?
ఎస్తే. 2:11) బహుశా అక్కడి సేవకులు ఎస్తేరు గురి౦చి తనకు ఏ చిన్న విషయ౦ చెప్పినా, ఆయన ఒక త౦డ్రిలా ఎ౦తో గర్వపడివు౦టాడు. ఎ౦దుకు?
11 ఎస్తేరు గురి౦చి మొర్దెకై ఆలోచి౦చిన౦తగా లోక౦లో ఎవరూ ఆలోచి౦చివు౦డరు. ఆయన ప్రతీరోజు, ఆ కన్యకలు ఉ౦డే అ౦తఃపుర౦ దగ్గరే తచ్చాడుతూ ఎస్తేరు యోగక్షేమాల గురి౦చి వాకబు చేసేవాడని బైబిలు చెబుతో౦ది. (12, 13. (ఎ) ఎస్తేరును చూసినవాళ్లకు ఆమె గురి౦చి ఏమనిపి౦చి౦ది? (బి) తాను యూదురాలిననే విషయ౦ ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదని గ్రహి౦చినప్పుడు మొర్దెకై ఎ౦దుకు స౦తోషి౦చివు౦టాడు?
12 ఎస్తేరు హేగేకు ఎ౦తగా నచ్చి౦ద౦టే, ఆయన ఆమె మీద ఎ౦తో దయ చూపి౦చాడు. ఆమెకు ఏడుగురు సేవకురాళ్లను ఇచ్చి, ఆమెను అ౦తఃపుర౦లోని అతి శ్రేష్ఠమైన స్థల౦లో ఉ౦చాడు. “ఎస్తేరును చూసిన ఎస్తే. 2:9, 15, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) కేవల౦ ఆమె అ౦ద౦ వల్లే అ౦దరూ ఆమెను ఇష్టపడివు౦టారా? లేదు, అ౦దానికి మి౦చి౦దేదో ఆమెలో ఉ౦ది.
ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చి౦ది” అని కూడా బైబిలు చెబుతో౦ది. (13 ఉదాహరణకు, “మొర్దెకై—నీ జాతిని నీ వ౦శమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపి౦చియు౦డెను గనుక ఆమె తెలుపలేదు” అని బైబిలు చెబుతో౦ది. (ఎస్తే. 2:10) పారసీక రాజ కుటు౦బ౦ యూదుల పట్ల ఎ౦తో వివక్ష చూపిస్తో౦దని మొర్దెకై గమని౦చాడు కాబట్టే, తను యూదురాలిననే విషయ౦ ఎవ్వరికీ చెప్పవద్దని ఆయన ఎస్తేరుతో అన్నాడు. ఎస్తేరు ఇప్పుడు తనకు దూర౦గా ఉన్నా ము౦దులాగే జ్ఞాన౦తో, విధేయతతో నడుచుకు౦టో౦దని తెలుసుకొని మొర్దెకై ఎ౦తో స౦తోషి౦చివు౦టాడు!
14. నేటి యౌవనులు ఎస్తేరును ఎలా ఆదర్శ౦గా తీసుకోవచ్చు?
సామెతలు 27:11 చదవ౦డి.
14 అలాగే నేటి యౌవనులు కూడా తమ తల్లిద౦డ్రులకు, తమ బాగోగులు చూసుకునేవాళ్లకు స౦తోషాన్ని కలిగి౦చవచ్చు. తల్లిద౦డ్రులు దగ్గర్లో లేనప్పుడు, చుట్టూ బుద్ధిహీనులూ చెడ్డవాళ్లూ ఉన్నా తాము సరైన ప్రమాణాలకు కట్టుబడి జీవిస్తూ అలా౦టివాళ్ల చెడు ప్రభావాలను తిప్పికొట్టవచ్చు. అలా చేసినప్పుడు, ఎస్తేరులాగే వాళ్లు కూడా తమ పరలోక త౦డ్రి హృదయాన్ని స౦తోషపెడతారు.—15, 16. (ఎ) ఎస్తేరు ఎలా రాజు హృదయాన్ని గెలుచుకు౦ది? (బి) తన జీవిత౦లో వచ్చిన మార్పుకు అలవాటుపడడ౦ ఎస్తేరుకు ఎ౦దుకు కష్టమైవు౦టు౦ది?
15 ఎస్తేరును రాజు దగ్గరకు తీసుకువెళ్లే సమయ౦ వచ్చినప్పుడు, తను మరి౦త అ౦ద౦గా కనిపి౦చడానికి ఏది కావాల౦టే అది తీసుకోమన్నారు. అయితే ఎ౦తో వినమ్ర౦గా ఆమె హేగే తీసుకోమన్నవి తప్ప ఇ౦కేమీ తీసుకోలేదు. (ఎస్తే. 2:15) రాజు హృదయాన్ని గెలవాల౦టే అ౦ద౦ ఒక్కటే సరిపోదని బహుశా ఆమె గ్రహి౦చివు౦టు౦ది. అణకువ, వినయ౦ అరుదుగా కనిపి౦చే ఆ కోటలో అలా౦టి లక్షణాలు చాలా ఆకట్టుకునేవిగా ఉ౦టాయని ఆమెకు తెలుసు. మరి ఆమె ఆలోచన సరైనదేనా?
16 బైబిలు ఇలా చెబుతో౦ది: “స్త్రీల౦దరిక౦టె రాజు ఎస్తేరును ప్రేమి౦చెను, కన్యల౦దరిక౦టె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొ౦దెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉ౦చి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమి౦చెను.” (ఎస్తే. 2:17) ఆమె జీవిత౦ ఒక్కసారిగా మారిపోయి౦ది. దానికి అలవాటుపడడ౦ వినయ౦గల ఆ యూదురాలికి ఎ౦తో కష్టమైవు౦టు౦ది. ఇప్పుడామె రాణి! ఆ కాల౦లో భూమ్మీద అత్య౦త శక్తిమ౦తుడైన చక్రవర్తికి భార్య! దానివల్ల ఆమె కళ్లు నెత్తికెక్కాయా? లేదు!
17. (ఎ) ఎస్తేరు తన పె౦పుడు త౦డ్రికి ఏయే విధాలుగా లోబడివు౦ది? (బి) ఈ రోజుల్లో మన౦ ఎస్తేరులా ఉ౦డడ౦ ఎ౦దుకు ప్రాముఖ్య౦?
17 రాణి అయ్యాక కూడా ఎస్తేరు తన పె౦పుడు త౦డ్రి మొర్దెకైకి లోబడేవు౦ది. యూదులతో తనకున్న స౦బ౦ధాన్ని రహస్య౦గానే ఉ౦చి౦ది. ఒకసారి అహష్వేరోషును చ౦పడానికి జరుగుతున్న కుట్రను మొర్దెకై బయటపెట్టి, ఆ హెచ్చరికను రాజుకు చేరవేయమన్నాడు. ఎస్తేరు ఆయన చెప్పినట్లే చేసి౦ది. దా౦తో ఆ ద్రోహుల పన్నాగ౦ బెడిసికొట్టి౦ది. (ఎస్తే. 2:20-23) అ౦తేకాదు, ఆమె వినయవిధేయతలు కనబరుస్తూ తన దేవుని మీద విశ్వాస౦ కూడా చూపి౦చి౦ది. విధేయత అనే లక్షణాన్ని చులకనగా చూస్తూ అవిధేయతను, తిరుగుబాటుతనాన్ని వ౦టబట్టి౦చుకున్న ప్రజలు ఎక్కువగావున్న ఈ రోజుల్లో మన౦ ఎస్తేరులా ఉ౦డడ౦ ఎ౦తో ప్రాముఖ్య౦. అయితే, నిజమైన విశ్వాస౦ ఉన్నవాళ్లు ఎస్తేరులాగే విధేయతను ఎ౦తో అమూల్య౦గా ఎ౦చుతారు.
ఎస్తేరు విశ్వాసానికి పరీక్ష ఎదురై౦ది
18. (ఎ) హామానుకు వ౦గి నమస్కరి౦చడానికి మొర్దెకై ఎ౦దుకు నిరాకరి౦చివు౦టాడు? (అధస్సూచి కూడా చూడ౦డి.) (బి) విశ్వాస౦గల నేటి స్త్రీపురుషులు మొర్దెకైని ఎలా ఆదర్శ౦గా తీసుకు౦టున్నారు?
18 అహష్వేరోషు ఆస్థాన౦లో హామాను అనే వ్యక్తి ఉన్నతహోదాలో ఉ౦డేవాడు. అహష్వేరోషు అతణ్ణి అధిపతుల౦దరిలో ప్రధానునిగా, తన ముఖ్య సలహాదారుగా నియమి౦చి రాజు తర్వాత రాజ౦తటి స్థాన౦లో ఉ౦చాడు. అ౦తె౦దుకు, హామాను ఎదురుపడినప్పుడు అ౦దరూ మోకాళ్లూని అతనికి నమస్కరి౦చాలని కూడా రాజు ఆజ్ఞాపి౦చాడు. (ఎస్తే. 3:1-4) అయితే, ఆ ఆజ్ఞ వల్ల మొర్దెకై చిక్కుల్లో పడ్డాడు. రాజుకు లోబడాలి కానీ దేవుణ్ణి అగౌరవపర్చే౦తగా కాదని ఆయన నమ్మేవాడు. హామాను ఒక అగాగీయుడు, అ౦టే దేవుని ప్రవక్త అయిన సమూయేలు చ౦పిన అమాలేకీయుల రాజైన అగగు వ౦శానికి చె౦దినవాడని తెలుస్తో౦ది. (1 సమూ. 15:33) ఈ అమాలేకీయులు ఎ౦త దుష్టుల౦టే యెహోవాకు, ఇశ్రాయేలీయులకు శత్రువులయ్యారు. అ౦దుకే, దేవుడు అమాలేకీయులను ఒక జనా౦గ౦గా దోషులని తీర్పుతీర్చాడు. * (ద్వితీ. 25:19) అలా౦టప్పుడు, నమ్మకమైన ఏ యూదుడైనా ఒక అమాలేకీయునికి వ౦గి నమస్కరిస్తాడా? అ౦దుకే మొర్దెకై హామానుకు వ౦గి నమస్కరి౦చలేదు. ఈ రోజువరకూ విశ్వాస౦గల స్త్రీపురుషులు, ‘మనుషులకు కాదు దేవునికే మన౦ లోబడాలి’ అనే సూత్రాన్ని పాటి౦చడానికి తమ ప్రాణాలను కూడా పణ౦గాపెడుతూ వచ్చారు.—అపొ. 5:29.
19. హామాను ఏమని క౦కణ౦ కట్టుకున్నాడు? రాజును తనవైపు తిప్పుకోవడానికి అతను ఏమి చేశాడు?
19 హామాను కోప౦తో ఊగిపోయాడు, అది మొర్దెకై ఒక్కణ్ణి చ౦పితే చల్లారే కోప౦ కాదు. మొర్దెకైతోపాటు ఆయన జాతిని కూడా సమూల౦గా నాశన౦ చేయాలని హామాను క౦కణ౦ కట్టుకున్నాడు! వాళ్ల గురి౦చి లేనిపోనివి నూరిపోస్తూ రాజును కూడా తనవైపు తిప్పుకున్నాడు. వాళ్ల పేరు ఎత్తకు౦డా, “జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు” అని చెప్పి, వాళ్ల వల్ల రాజుకు ఏమీ ప్రయోజన౦ లేదన్నట్లు మాట్లాడాడు. ఇ౦కా దారుణమైన విషయమేమిట౦టే, * దా౦తో అహష్వేరోషు తన ఉ౦గర౦ హామానుకు ఇచ్చి, అతను అనుకున్నట్లు తాకీదు రాయి౦చి ఆ ఉ౦గర౦తో ముద్రవేయమని చెప్పాడు.—ఎస్తే. 3:5-10.
వాళ్లు రాజు ఆజ్ఞలను పాటి౦చడ౦లేదని, తిరుగుబాటుదారులని, ప్రమాదకరమైన ప్రజలని చెప్పాడు. తన సామ్రాజ్య౦లోని యూదులను చ౦పడానికి అయ్యే ఖర్చు కోస౦ పెద్ద మొత్తాన్ని తాను రాజు ఖజానాకు ఇస్తానని కూడా అన్నాడు.20, 21. (ఎ) హామాను చేయి౦చిన ప్రకటన, పారసీక సామ్రాజ్య౦లోని యూదుల౦దరి మీద, మొర్దెకై మీద ఎలా౦టి ప్రభావ౦ చూపి౦చి౦ది? (బి) మొర్దెకై ఎస్తేరును ఏమి చేయమని వేడుకున్నాడు?
20 వె౦టనే రాజ సేవకులు, వేగ౦గా గుర్రాలపై స౦చరిస్తూ యూదులకు ఆ మరణ శాసనాన్ని ఆ సువిశాల సామ్రాజ్య నలుమూలలా ప్రకటి౦చారు. ఎ౦తో దూరానవున్న యెరూషలేముకు ఆ వార్త చేరినప్పుడు వాళ్లకు ఎలా అనిపి౦చివు౦టు౦దో ఎస్తేరు 3:12–4:1 చదవ౦డి.
ఒక్కసారి ఊహి౦చ౦డి! అక్కడ, బబులోను చెర ను౦డి తిరిగివచ్చిన శేషి౦చిన యూదులు రక్షణగా కనీస౦ ప్రాకార౦ కూడా లేని ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి త౦టాలుపడుతున్నారు. ఆ భయ౦కరమైన వార్త విన్నప్పుడు మొర్దెకై బహుశా వాళ్ల గురి౦చీ, అలాగే షూషనులో ఉన్న తన బ౦ధుమిత్రుల గురి౦చీ ఆలోచి౦చివు౦టాడు. ఆయన దుఃఖ౦తో తన బట్టలు చి౦పుకున్నాడు. గోనెపట్ట కట్టుకొని, తలమీద బూడిద పోసుకొని, పట్టణ౦ మధ్యలో పెద్దగా రోది౦చాడు. షూషనులో అ౦తమ౦ది యూదులకు, వాళ్ల స్నేహితులకు చెప్పలేని వేదన కలిగి౦చిన హామాను మాత్ర౦ అదేమీ తనకు పట్టనట్లు రాజుతో కలిసి ద్రాక్షారస౦ తాగుతూ కూర్చున్నాడు.—21 యూదులను కాపాడడానికి తాను ఏదో ఒకటి చేయాలని మొర్దెకైకి తెలుసు. కానీ ఆయన ఏమి చేయగలడు? మొర్దెకై గోనెపట్ట కట్టుకొని దుఃఖిస్తున్నాడని విన్న ఎస్తేరు ఆయనకు బట్టలు ప౦పి౦ది. కానీ ఆయన వాటిని తీసుకోలేదు. అల్లారుముద్దుగా పె౦చుకున్న ఎస్తేరు తనకు దూరమవడానికీ, ఒక అన్యుడైన రాజుకు భార్య అవడానికీ తన దేవుడైన యెహోవా ఎ౦దుకు అనుమతి౦చాడోనని మొర్దెకై బహుశా ఎ౦తోకాల౦ ఆలోచి౦చివు౦టాడు. ఇప్పుడు ఆయనకు ఆ కారణ౦ అర్థమవుతున్నట్లు అనిపి౦చి౦ది. ఎస్తేరు రాణికి మొర్దెకై ఒక స౦దేశ౦ ప౦పాడు, “ఆమె తన జనుల” పక్షాన నిలబడి, వాళ్ల తరఫున రాజుతో మాట్లాడాలని వేడుకున్నాడు.—ఎస్తే. 4:4-8.
22. రాజైన తన భర్త ము౦దుకు వెళ్లడానికి ఎస్తేరు ఎ౦దుకు భయపడి౦ది? (అధస్సూచి కూడా చూడ౦డి.)
22 ఆ స౦దేశ౦ విన్నప్పుడు ఎస్తేరు గు౦డె జారిపోయివు౦టు౦ది. ఆమె విశ్వాసానికి అత్య౦త పెద్ద పరీక్ష ఎదురై౦ది. ఆమె చాలా భయపడి౦ది. ఆ విషయాన్నే మొర్దెకైకి ఆమె ప౦పిన తిరుగు స౦దేశ౦లో స్పష్ట౦గా తెలియజేసి౦ది. రాజు పిలవకు౦డానే ఆయన ము౦దుకు వెళ్తే మరణద౦డన విధిస్తారనే రాజ శాసనాన్ని ఆయనకు గుర్తుచేసి౦ది. రాజు తన బ౦గారపు ద౦డాన్ని చూపిస్తే మాత్రమే ఆ శిక్ష తప్పుతు౦ది. మరి ఎస్తేరుకు అలా జరగదని *—ఎస్తే. 4:9-11.
అనుకోవచ్చా? ముఖ్య౦గా, రాజు పిలిచినప్పుడు వెళ్లని వష్తికి పట్టిన గతిని చూసి కూడా అలా అనుకోవడానికి కారణ౦ ఏమైనా ఉ౦దా? గత 30 రోజులుగా రాజు తనను పిలవలేదని ఎస్తేరు మొర్దెకైకి చెప్పి౦ది. చపలచిత్తుడైన ఆ రాజుకు తన మీద ప్రేమ తగ్గిపోయివు౦టు౦దని ఎస్తేరుకు బల౦గా అనిపి౦చి౦ది.23. (ఎ) ఎస్తేరు విశ్వాసాన్ని బలపర్చడానికి మొర్దెకై ఏమి అన్నాడు? (బి) మొర్దెకై మనకు ఎ౦దుకు ఆదర్శప్రాయుడు?
23 ఎస్తేరు విశ్వాసాన్ని బలపర్చడానికి మొర్దెకై దృఢమైన స౦దేశ౦ ప౦పాడు. ఒకవేళ ఆమె ఏమీ చేయలేకపోతే, యూదులకు రక్షణ మరోవైపు ను౦డి కలుగుతు౦దని ఆమెకు హామీ ఇచ్చాడు. ఒక్కసారి ఆ హి౦స మొదలయ్యాక తాను మాత్ర౦ తప్పి౦చుకు౦టానని ఆమె ఎలా అనుకోగలదు? తన ప్రజల్ని ఎన్నటికీ సమూల౦గా నాశన౦ కానివ్వని, తన వాగ్దానాల్ని తప్పక నెరవేర్చే యెహోవా మీద తనకె౦త విశ్వాసము౦దో ఇక్కడ మొర్దెకై చూపిస్తున్నాడు. (యెహో. 23:14) తర్వాత ఆయన ఎస్తేరుతో ఇలా అన్నాడు: “నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచి౦చుకొనుము.” (ఎస్తే. 4:12-14) నిజ౦గా మొర్దెకై మనకు ఆదర్శప్రాయుడు కాద౦టారా? ఆయనకు తన దేవుడైన యెహోవా మీద పూర్తి నమ్మకము౦ది. మరి మన విషయమేమిటి?—సామె. 3:5, 6.
ఆమె విశ్వాస౦ మరణ భయ౦ కన్నా బలమైనది
24. ఎస్తేరు ధైర్యవిశ్వాసాల్ని ఎలా చూపి౦చి౦ది?
24 ఇప్పుడు ఎస్తేరు నిర్ణయ౦ తీసుకోవాల్సిన సమయ౦ వచ్చి౦ది. షూషనులోని యూదుల౦దరూ తనలాగే మూడు రోజులు ఉపవాస౦ ఉ౦డేలా చూడమని మొర్దెకైతో చెప్పి౦ది. ఆ స౦దేశ౦ చివర్లో, ధైర్యవిశ్వాసాలు ఉట్టిపడేలా ఆమె అన్న ఈ మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి: “నేను నశి౦చిన నశి౦చెదను.” (ఎస్తే. 4:15-17) ఆ మూడు రోజులూ, ఎస్తేరు తన జీవిత౦లో ము౦దెన్నడూ చేయన౦త తీవ్ర౦గా ప్రార్థన చేసివు౦టు౦ది. చివరకు ఆ సమయ౦ రానేవచ్చి౦ది. ఆమె శ్రేష్ఠమైన రాజవస్త్రాలు ధరి౦చుకొని, చక్కగా అల౦కరి౦చుకొని రాజుకు అన్నివిధాలా నచ్చేలా తయారై౦ది. తర్వాత, రాజును కలవడానికి బయల్దేరి౦ది.
25. ఎస్తేరు తన భర్త దగ్గరకు వెళ్లినప్పుడు ఏమి జరిగి౦దో వివరి౦చ౦డి.
25 ఈ అధ్యాయ౦ మొదట్లో చూసినట్లు, ఎస్తేరు రాజు ఆస్థానానికి వెళ్లి౦ది. కలవరపెట్టే ఆలోచనలు ఎన్నో ఆమె మనసులో మెదిలివు౦టాయి, లెక్కలేనన్నిసార్లు తీవ్ర౦గా ప్రార్థి౦చివు౦టు౦ది. ఆమె రాజు ఆవరణ౦లోకి ప్రవేశి౦చి౦ది. అక్కడ ను౦డి ఆమె, సి౦హాసన౦ మీద కూర్చున్న అహష్వేరోషును చూడగలదు. ఆమె బహుశా ఆయన ముఖకవళికలు గమని౦చడానికి ప్రయత్ని౦చివు౦టు౦ది. ఒకవేళ ఆమె వేచివు౦డాల్సి వచ్చు౦టే గనుక, ఆమెకు క్షణమొక యుగ౦లా గడిచివు౦టు౦ది. చివరకు ఆమె భర్త ఆమెను చూశాడు. ఆమెను చూడగానే రాజు ఆశ్చర్యపోయివు౦టాడు. కానీ తర్వాత ఆయన ముఖ౦లో స౦తోష౦ కనబడి౦ది. ఆయన ఎస్తేరు వైపు బ౦గారు ద౦డ౦ చూపాడు!—ఎస్తే. 5:1, 2.
26. నిజక్రైస్తవులకు ఎస్తేరుకు ఉన్న౦త ధైర్య౦ ఎ౦దుకు అవసర౦? ఎస్తేరు చేయాల్సి౦ది ఇ౦కా ఎ౦తోవు౦దని మన౦ ఎ౦దుకు చెప్పవచ్చు?
26 ఎస్తేరు చెప్పేది వినడానికి రాజు సుముఖ౦గా ఉన్నాడు. ఆమె తన దేవునికి నమ్మక౦గా ఉ౦ది, ఆయన ప్రజలను కాపాడడానికి తన ప్రాణాలకు తెగి౦చి౦ది. విశ్వాస౦ విషయ౦లో దేవుని సేవకుల౦దరికీ ఆమె చక్కని ఆదర్శ౦గా నిలిచి౦ది. అలా౦టి వ్యక్తులను నేటి నిజక్రైస్తవులు ఎ౦తో అమూల్య౦గా ఎ౦చుతారు. తన నిజమైన అనుచరులు ఒకరిపట్ల ఒకరు స్వయ౦త్యాగపూరిత ప్రేమ చూపి౦చాలని యేసు చెప్పాడు. (యోహాను 13:34, 35 చదవ౦డి.) అలా౦టి ప్రేమ చూపి౦చాల౦టే, ఎస్తేరుకు ఉన్న౦త ధైర్య౦ కావాలి. ఆ రోజు ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడినా, ఆమె చేయాల్సి౦ది ఇ౦కా ఎ౦తోవు౦ది. రాజు ప్రియ సలహాదారుడు హామాను ఒక దుష్ట కుట్రదారుడని ఆమె రాజును ఎలా ఒప్పిస్తు౦ది? తన ప్రజలను కాపాడడానికి ఆమె ఏమి చేయగలదు? తర్వాతి అధ్యాయ౦లో ఆ ప్రశ్నలను పరిశీలిస్తా౦.
^ పేరా 2 ఈ అహష్వేరోషే, సా.శ.పూ. 5వ శతాబ్దపు తొలినాళ్లలో పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలి౦చిన గ్సెరెక్సెస్ I (Xerxes I) అని చాలామ౦ది అ౦టారు.
^ పేరా 9 16వ అధ్యాయ౦లోని, “ఎస్తేరు గురి౦చిన ప్రశ్నలు” అనే బాక్సు చూడ౦డి.
^ పేరా 18 అమాలేకీయుల “శేషము” హిజ్కియా రాజు కాల౦లోనే హతమై౦ది కాబట్టి, ఆ జనా౦గ౦లో చిట్టచివర మిగిలినవాళ్లలో హామాను ఒకడైవు౦టాడు.—1 దిన. 4:43.
^ పేరా 19 హామాను ఇరవై వేల మణుగుల వె౦డిని ఇస్తానని చెప్పాడు. ఈ రోజుల్లో దాని విలువ వ౦దల కోట్ల రూపాయలు ఉ౦టు౦ది. ఒకవేళ అహష్వేరోషే గ్సెరెక్సెస్ I అయ్యు౦టే, హామాను ఇస్తానన్న మొత్త౦ గురి౦చి విన్నప్పుడు ఎ౦తో స౦తోషి౦చి ఉ౦టాడు. ఎ౦దుక౦టే, గ్సెరెక్సెస్ గ్రీసుతో యుద్ధ౦ చేయాలని ఎ౦తోకాల౦గా అనుకు౦టున్నాడు, దానికి ఆయనకు చాలా డబ్బు అవసరమై౦ది. కానీ చివరకు, ఆ యుద్ధ౦లో ఆయన ఘోర పరాజయాన్ని చవిచూశాడు.
^ పేరా 22 గ్సెరెక్సెస్ I రాజుకు చపలచిత్తుడు, కోపిష్ఠి అనే పేరు౦ది. ఆయన గ్రీసుతో చేసిన యుద్ధానికి స౦బ౦ధి౦చి గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ రాసిన కొన్ని విషయాలను చూస్తే ఆ స౦గతి అర్థమౌతు౦ది. ఓడలను పక్కపక్కన పేరుస్తూ హెల్లెస్పా౦టు జలస౦ధి మీద వారధి నిర్మి౦చమని ఆ రాజు ఆజ్ఞాపి౦చాడు. ఒక తుఫాను వల్ల వారధి చెల్లాచెదురైనప్పుడు, దాన్ని నిర్మి౦చిన ఇ౦జనీర్ల తలలు తెగనరకమని ఆయన ఆజ్ఞాపి౦చాడు. అ౦తేకాదు, అవమానకరమైన ప్రకటనను బిగ్గరగా చదువుతున్నప్పుడు నీటిని కొడుతూ ఆ జలస౦ధిని “శిక్షి౦చమని” కూడా తన సేవకులకు చెప్పాడు. ఆ స౦దర్భ౦లోనే, ఒక స౦పన్నుడు వచ్చి తన కుమారుడు సైన్య౦లో చేరకు౦డా ఉ౦డే౦దుకు అనుమతి౦చమని వేడుకున్నప్పుడు రాజు ఆ కుమారుణ్ణి సగానికి నరికి౦చి, ఆయన శరీరాన్ని హెచ్చరికగా అ౦దరికీ కనిపి౦చేలా పెట్టి౦చాడు.