కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 14వ పాఠం

దేవుడు ఒక సంస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు?

దేవుడు ఒక సంస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు?

1. దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా ఎందుకు ఎంచుకున్నాడు?

దేవుడు తన సేవకుడైన అబ్రాహాము వంశస్థుల్ని ఒక జనంగా ఏర్పాటుచేసి, వాళ్లకు కొన్ని నియమాలు ఇచ్చాడు. దేవుడు ఆ జనాన్ని “ఇశ్రాయేలు” అని పిలిచాడు. సత్యారాధనకు, తన వాక్యానికి సంరక్షకులుగా వాళ్లను నియమించాడు. (కీర్తన 147:19, 20) కాబట్టి వాళ్ల ద్వారా అన్నిదేశాల ప్రజలు దీవెనలు పొందగలుగుతారు.ఆదికాండం 22:18 చదవండి.

దేవుడు ఇశ్రాయేలీయుల్ని తనకు సాక్షులుగా ఎంచుకున్నాడు. వాళ్ల చరిత్ర చూస్తే, దేవుని నియమాలకు లోబడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో అర్థమౌతుంది. (ద్వితీయోపదేశకాండం 4:6) అలా ఇశ్రాయేలీయుల ద్వారా మిగతావాళ్లు నిజమైన దేవున్ని తెలుసుకోగలుగుతారు.యెషయా 43:10, 12 చదవండి.

2. దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఎందుకు ఎంచుకున్నాడు?

కొంతకాలానికి ఇశ్రాయేలీయులు దేవుని అనుగ్రహం కోల్పోయారు, అందుకే యెహోవా వాళ్ల స్థానంలో క్రైస్తవ సంఘాన్ని ఎంచుకున్నాడు. (మత్తయి 21:43; 23:37, 38) అప్పట్లో ఇశ్రాయేలీయుల్లా, ఇప్పుడు నిజ క్రైస్తవులు యెహోవాకు సాక్షులుగా ఉన్నారు.అపొస్తలుల కార్యాలు 15:14, 17 చదవండి.

అన్నిదేశాల ప్రజలకు ప్రకటించి శిష్యుల్ని చేయమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 10:7, 11; 24:14; 28:19, 20) అంతం దగ్గర్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పని ముగింపుకు వస్తోంది. ముందెప్పుడూ లేనంతగా, యెహోవా అన్నిదేశాలకు చెందిన లక్షలమందిని సత్యారాధన ద్వారా ఐక్యం చేస్తున్నాడు. (ప్రకటన 7:9, 10) నిజ క్రైస్తవులు కలిసికట్టుగా ఉంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ప్రపంచమంతటా జరిగే యెహోవాసాక్షుల కూటాల్లో అందరూ ఒకేలాంటి బైబిలు ఉపదేశం పొందుతారు.హెబ్రీయులు 10:24, 25 చదవండి.

 3. ఆధునిక కాలంలో యెహోవాసాక్షులు ఎలా మొదలయ్యారు?

1870-1879 మధ్య కొందరు బైబిలు విద్యార్థులు, ఎంతోకాలంగా మరుగున పడిపోయిన బైబిలు సత్యాల్ని వెలికితీయడం మొదలుపెట్టారు. యేసు ప్రకటనా పని కోసం క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. 1931 లో వాళ్లు యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకున్నారు.అపొస్తలుల కార్యాలు 1:8; 2:1, 4; 5:42 చదవండి.

4. యెహోవాసాక్షుల ప్రకటనా పని ఎలా జరుగుతుంది?

మొదటి శతాబ్దంలో ఒక పరిపాలక సభ ఉండేది. వేర్వేరు దేశాల్లోని క్రైస్తవ సంఘాలు దానినుండి ప్రయోజనం పొందేవి. పరిపాలక సభలోని వాళ్లు యేసే సంఘానికి శిరస్సని గుర్తుంచుకునేవాళ్లు. (అపొస్తలుల కార్యాలు 16:​4, 5) నేడు కూడా అనుభవంగల పెద్దలతో తయారైన ఒక పరిపాలక సభ ఉంది. దానినుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పరిపాలక సభ యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్ని పర్యవేక్షిస్తుంది. ఆ బ్రాంచీలు, బైబిలు అధ్యయనాలకు వాడే ప్రచురణల్ని 900 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించి, పంపిణీ చేస్తాయి. అలా పరిపాలక సభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,20,000 కన్నా ఎక్కువ సంఘాలకు బైబిలు ద్వారా ప్రోత్సాహాన్ని, నిర్దేశాన్ని ఇస్తోంది. ప్రతీ సంఘంలో, అర్హతగల పురుషులు పెద్దలుగా లేదా పర్యవేక్షకులుగా సేవచేస్తారు. వాళ్లు “దేవుని మందను” ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటారు.1 పేతురు 5:2, 3 చదవండి.

యెహోవాసాక్షులు ఒక పద్ధతి ప్రకారం మంచివార్త ప్రకటిస్తారు, శిష్యుల్ని చేస్తారు. అపొస్తలుల్లాగే వాళ్లు ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తారు. (అపొస్తలుల కార్యాలు 20:20) అంతేకాదు, సత్యాన్ని ప్రేమించేవాళ్లతో బైబిలు అధ్యయనాలు చేస్తారు. అయితే యెహోవాసాక్షులు కేవలం ఒక మతగుంపు కాదు, వాళ్లంతా ఒక కుటుంబం. వాళ్లకు ఒక ప్రేమగల తండ్రి ఉన్నాడు. వాళ్లు అన్నదమ్ముల్లా, అక్కచెల్లెళ్లలా ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటారు. (2 థెస్సలొనీకయులు 1:3) వాళ్లు యెహోవాను సంతోషపెట్టాలని, ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటారు. అందుకే వాళ్లది భూమ్మీద అత్యంత సంతోషంగల కుటుంబం.కీర్తన 33:12; అపొస్తలుల కార్యాలు 20:35 చదవండి.