కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 9వ పాఠం

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

1. కలిసి జీవించాలనుకునేవాళ్లు పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

మంచివార్త చెప్తున్న యెహోవా సంతోషంగల దేవుడు, కాబట్టి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:11) వివాహ ఏర్పాటును చేసింది ఆయనే. చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలకు, వాళ్ల పిల్లలకు భద్రత ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది. క్రైస్తవులు తమ ప్రాంతంలోని చట్టాల ప్రకారం తమ పెళ్లిని రిజిస్టరు చేయించుకోవాలి.లూకా 2:1, 4, 5 చదవండి.

వివాహ బంధాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? అది స్త్రీపురుషుల మధ్య ఒక శాశ్వత బంధంగా ఉండాలనేది ఆయన కోరిక. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 13:4) విడాకులంటే ఆయనకు అసహ్యం. (మలాకీ 2:16) కానీ భార్యాభర్తల్లో ఒకరు వ్యభిచారం చేసినప్పుడు, రెండో వ్యక్తి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని ఆయన చెప్తున్నాడు.మత్తయి 19:3-6, 9 చదవండి.

2. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి?

ఒకరికొకరు సాటియైన సహాయంగా ఉండేలా యెహోవా పురుషుణ్ణి, స్త్రీని సృష్టించాడు. (ఆదికాండం 2:18) భర్త కుటుంబ శిరస్సు కాబట్టి తన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం, వాళ్లకు దేవుని గురించి బోధించడం ఆయన బాధ్యత. భర్త తన సొంత ప్రయోజనం చూసుకోకుండా భార్య మీద ప్రేమ చూపించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి కాబట్టి, వాళ్ల కాపురం ఆనందంగా సాగిపోవాలంటే ఒకరినొకరు క్షమించుకోవడం చాలా అవసరం.ఎఫెసీయులు 4:31, 32; 5:22-25, 33; 1 పేతురు 3:7 చదవండి.

3. సమస్యలు వస్తే విడిపోవడమే పరిష్కారమా?

వివాహంలో సమస్యలు వస్తే, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఇంకా ఎక్కువగా ప్రేమ చూపించుకోవడానికి కృషి చేయాలి. (1 కొరింథీయులు 13:​4, 5)  వివాహ జీవితంలో సాధారణంగా వచ్చే సమస్యలకు విడిపోవడమే పరిష్కారమని బైబిలు చెప్పట్లేదు.1 కొరింథీయులు 7:10-13 చదవండి.

4. పిల్లలూ, మీరెలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

మీరు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీ యౌవనాన్ని ఆనందించడానికి ఆయన చక్కని సలహాలు ఇస్తున్నాడు. మీ అమ్మానాన్నల మాట వింటూ వాళ్ల తెలివి నుండి, అనుభవం నుండి ప్రయోజనం పొందమని ఆయన చెప్తున్నాడు. (కొలొస్సయులు 3:20) అలాగే తనకు, తన కుమారునికి నచ్చే పనులు చేస్తూ సంతోషంగా ఉండమని కూడా యెహోవా చెప్తున్నాడు.ప్రసంగి 11:9–12:1; మత్తయి 19:13-15; 21:15, 16 చదవండి.

5. తల్లిదండ్రులారా, పిల్లలు సంతోషంగా ఉండాలంటే మీరేం చేయాలి?

మీరు కష్టపడి పనిచేస్తూ మీ పిల్లలకు ఆహారం, ఇల్లు, బట్టలు ఉండేలా చూసుకోవాలి. (1 తిమోతి 5:8) అయితే మీ పిల్లలు నిజంగా సంతోషంగా ఉండాలంటే మీరు వాళ్లకు దేవున్ని ప్రేమించడం, ఆయన ఉపదేశాన్ని వినడం నేర్పించాలి. (ఎఫెసీయులు 6:4) దేవున్ని ప్రేమించే విషయంలో మీ మంచి ఆదర్శం మీ పిల్లల హృదయాల మీద చెరగని ముద్ర వేస్తుంది. మీరు బైబిలు ప్రకారం బోధిస్తే, మీ పిల్లలు సరిగ్గా ఆలోచించడం నేర్చుకుంటారు.ద్వితీయోపదేశకాండం 6:4-7; సామెతలు 22:6 చదవండి.

పిల్లల్ని ప్రోత్సహించడం, మెచ్చుకోవడం మంచిది. అయితే వాళ్లను సరిదిద్దడం, క్రమశిక్షణలో పెట్టడం కూడా ముఖ్యమే. అలాంటి శిక్షణ వల్ల పిల్లలు చెడ్డ పనులకు దూరంగా ఉంటారు, సంతోషం కోల్పోకుండా ఉంటారు. (సామెతలు 22:15) అయితే క్రమశిక్షణ ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా, క్రూరంగా ఉండకూడదు.కొలొస్సయులు 3:21 చదవండి.

ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం యెహోవాసాక్షులు బైబిలు ఆధారంగా ఎన్నో పుస్తకాలు తయారుచేశారు.కీర్తన 19:7, 11 చదవండి.