కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 13వ పాఠం

మతం గురించిన మంచివార్త ఏంటి?

మతం గురించిన మంచివార్త ఏంటి?

1. మతాలన్నీ మంచివేనా?

దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లు అన్ని మతాల్లో ఉన్నారు. దేవుడు అలాంటివాళ్లను చూస్తాడు, పట్టించుకుంటాడు. అది నిజంగా మంచివార్త! అయితే, మతం పేరుతో చాలామంది చెడ్డపనులు చేస్తున్నారు. (2 కొరింథీయులు 4:3, 4; 11:13-15) కొన్ని మతాలు ఉగ్రవాదం, యుద్ధం, పిల్లలపై అత్యాచారం వంటివాటికి కూడా మద్దతిస్తున్నాయని వార్తల్లో చూస్తున్నాం. దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లకు ఇది ఎంత బాధ కలిగిస్తుందో కదా!మత్తయి 24:3-5, 11, 12 చదవండి.

నిజమైన మతం దేవున్ని మహిమపరుస్తుంది, కానీ అబద్ధమతం ఆయన్ని బాధపెడుతుంది. అబద్ధమతం బైబిల్లో లేనివాటిని బోధిస్తుంది, దేవుని గురించి, చనిపోయినవాళ్ల గురించి అబద్ధాలు చెప్తుంది. అయితే ప్రజలు తన గురించి సత్యం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు.ప్రసంగి 9:5, 10; 1 తిమోతి 2:3-5 చదవండి.

2. మతం గురించిన మంచివార్త ఏంటి?

దేవున్ని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ సాతాను లోకాన్ని ప్రేమించే మతాలు దేవున్ని మోసం చేయలేవు. (యాకోబు 4:​4) బైబిలు అబద్ధ మతాలన్నిటినీ కలిపి “మహాబబులోను” అంటుంది. ఎందుకంటే, పూర్వం బబులోను అనే నగరంలోనే అబద్ధమతం పుట్టింది. అయితే ప్రజల్ని మోసగించే, అణచివేసే మతాల్ని దేవుడు అకస్మాత్తుగా నాశనంచేసే రోజు చాలా దగ్గర్లో ఉంది.ప్రకటన 17:1, 2, 5, 16, 17; 18:8 చదవండి.

దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లు ప్రపంచంలో ఏ మతంలో ఉన్నా యెహోవా వాళ్లను మర్చిపోలేదు. అలాంటివాళ్లకు ఆయన సత్యం నేర్పిస్తూ వాళ్లను ఐక్యం చేస్తున్నాడు.మీకా 4:2, 5 చదవండి.

 3. దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లు ఏం చేయాలి?

నిజమైన మతం అందర్నీ ఐక్యం చేస్తుంది

సత్యాన్ని, మంచిని ప్రేమించేవాళ్లను యెహోవా పట్టించుకుంటాడు. అబద్ధమతాన్ని విడిచిపెట్టమని ఆయన వాళ్లకు చెప్తున్నాడు. దేవున్ని ప్రేమించేవాళ్లు ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటారు, మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు.ప్రకటన 18:4 చదవండి.

మొదటి శతాబ్దంలో దేవున్ని సంతోషపెట్టాలని కోరుకున్నవాళ్లు అపొస్తలులు చెప్పిన మంచివార్త విని ఎంతో సంతోషించారు. యెహోవా వాళ్లకు ఒక కొత్త జీవన విధానాన్ని, అంటే ఒక సంకల్పంతో, భవిష్యత్తు మీద ఆశతో, ఇంకా సంతోషంగా జీవించడాన్ని నేర్పించాడు. అంతేకాదు తమ జీవితాల్లో యెహోవాకు మొదటిస్థానం ఇచ్చారు. వాళ్లు మనకు మంచి ఆదర్శం.1 థెస్సలొనీకయులు 1:8, 9; 2:13 చదవండి.

అబద్ధమతం నుండి బయటికి వచ్చినవాళ్లను యెహోవా తన ఆరాధకుల కుటుంబంలోకి ప్రేమగా ఆహ్వానిస్తున్నాడు. మీరు ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తే యెహోవాకు స్నేహితులౌతారు, ప్రేమ చూపించే ఆయన ఆరాధకుల కుటుంబంలో ఒకరౌతారు, శాశ్వత జీవితం పొందుతారు.మార్కు 10:29, 30; 2 కొరింథీయులు 6:17, 18 చదవండి.

4. దేవుడు భూమ్మీదున్న వాళ్లందరికీ ఎలా సంతోషం తెస్తాడు?

అబద్ధమతం నాశనం కాబోతుంది అనేది నిజంగా ఒక మంచివార్త. అప్పుడు, ప్రపంచవ్యాప్తంగా దాని గుప్పిట్లో ఉన్న వాళ్లందరూ విడుదలౌతారు. అబద్ధమతం వల్ల ఇక ప్రజలు మోసపోరు, విడిపోరు. అందరూ ఒకేఒక్క సత్యదేవున్ని ఆరాధిస్తారు.ప్రకటన 18:20, 21; 21:3, 4 చదవండి.