కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 12వ పాఠం

దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

1. దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా?

ప్రార్థన ద్వారా తనకు దగ్గరవ్వమని యెహోవా అన్నిరకాల ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 65:2) అయితే, ఆయన అందరి ప్రార్థనలు వినడు. ఉదాహరణకు, తన భార్యను బాధపెట్టే భర్త ప్రార్థనలు దేవుడు వినకపోవచ్చు. (1 పేతురు 3:7) ఇశ్రాయేలీయులు అదేపనిగా చెడ్డపనులు చేసినప్పుడు దేవుడు వాళ్ల ప్రార్థనలు వినలేదు. అయితే ఘోరమైన పాపాలు చేసినవాళ్లు కూడా పశ్చాత్తాపపడితే, దేవుడు వాళ్ల ప్రార్థనలు వింటాడు. ప్రార్థన నిజంగా ఒక గొప్ప వరం.యెషయా 1:15; 55:7 చదవండి.

దేవుడు అన్ని ప్రార్థనల్ని వింటాడా? వీడియో చూడండి.

2. మనం ఎలా ప్రార్థించాలి?

యెహోవా మన సృష్టికర్త కాబట్టి మనం ఆయన్నే ఆరాధించాలి, ఆయనకే ప్రార్థించాలి. (మత్తయి 4:10; 6:​9) అంతేకాదు మనం యేసు పేరున ప్రార్థించాలి. ఎందుకంటే మనం అపరిపూర్ణులం, మన పాపాల కోసం యేసు చనిపోయాడు. (యోహాను 14:6) మనం బట్టీపట్టి చేసే ప్రార్థనలు, పుస్తకంలో చూసి చేసే ప్రార్థనలు యెహోవాకు నచ్చవు. మన ప్రార్థనలు హృదయంలో నుండి రావాలని ఆయన కోరుకుంటున్నాడు.మత్తయి 6:7; ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

మనం మనసులో ప్రార్థించుకున్నా మన సృష్టికర్త వినగలడు. (1 సమూయేలు 1:12, 13) నిద్రలేచినప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అలా ఏ సమయంలోనైనా తనకు ప్రార్థించమని ఆయన చెప్తున్నాడు.కీర్తన 55:22; మత్తయి 15:36 చదవండి.

3. క్రైస్తవులు ఎందుకు కూటాలకు వెళ్తారు?

మన చుట్టూ దేవుని మీద విశ్వాసంలేని ప్రజలే ఉన్నారు కాబట్టి మనం దేవునికి దగ్గరవ్వడం అంత తేలిక కాదు. వాళ్లు, భూమ్మీదికి శాంతి తెస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎగతాళి చేస్తారు. (2 తిమోతి 3:1, 4; 2 పేతురు 3:3, 13)  అందుకే ప్రోత్సాహాన్నిచ్చే తోటి విశ్వాసుల సహవాసం మనందరికీ అవసరం.హెబ్రీయులు 10:24, 25 చదవండి.

దేవున్ని ప్రేమించేవాళ్లతో సహవసిస్తే మనం ఆయనకు దగ్గరవ్వగలుగుతాం. యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లినప్పుడు తోటివాళ్ల విశ్వాసం చూసి మనం ప్రోత్సాహం పొందుతాం.రోమీయులు 1:11, 12 చదవండి.

4. దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

బైబిల్లో నేర్చుకున్న విషయాల గురించి లోతుగా ఆలోచిస్తే మీరు యెహోవాకు దగ్గరవ్వవచ్చు. ఆయన పనుల గురించి, సలహాల గురించి, వాగ్దానాల గురించి ఆలోచించండి. ప్రార్థన చేసుకుని ధ్యానించినప్పుడు దేవుని ప్రేమ, తెలివి ఎంత గొప్పవో అర్థమౌతుంది.యెహోషువ 1:8; కీర్తన 1:1-3 చదవండి.

దేవుని మీద విశ్వాసం ఉంటేనే మీరు ఆయనకు దగ్గరవ్వగలరు. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన విశ్వాసం బలంగా ఉండాలంటే, మన నమ్మకాలకు గల కారణాల గురించి ఆలోచిస్తూ ఉండాలి.మత్తయి 4:4; హెబ్రీయులు 11:1, 6 చదవండి.

5. దేవునికి దగ్గరవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

యెహోవా తనను ప్రేమించేవాళ్ల గురించి పట్టించుకుంటాడు. వాళ్ల విశ్వాసాన్ని పాడుచేసే, వాళ్లు శాశ్వత జీవితం పొందకుండా చేసే దేనినుండైనా ఆయన వాళ్లను కాపాడగలడు. (కీర్తన 91:1, 2, 7-10) మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పాడుచేసే వాటికి దూరంగా ఉండమని ఆయన హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, శ్రేష్ఠమైన విధంగా జీవించడం యెహోవా మనకు నేర్పిస్తున్నాడు.కీర్తన 73:27, 28; యాకోబు 4:4, 8 చదవండి.