దేవుడు చెప్తున్న మంచివార్త!

దేవుడు చెప్తున్న ఆ మంచివార్త ఏంటి? దాన్ని ఎందుకు నమ్మవచ్చు? మనకు సాధారణంగా వచ్చే బైబిలు ప్రశ్నలకు ఈ బ్రోషుర్‌లో జవాబులు ఉన్నాయి.

ఈ బ్రోషురును ఎలా ఉపయోగించాలి?

మీరు దేవుని వాక్యమైన బైబిల్లో చూసి విషయాలను నేర్చుకునేలా దీన్ని తయారుచేశాం. వచనాలను మీ సొంత బైబిల్లో తెరిచి చూడడం ఎలాగో తెలుసుకోండి.

పాఠం 1

దేవుడు చెప్తున్న మంచివార్త ఏంటి?

దేవుడు చెప్తున్న ఆ మంచివార్త ఏంటో, దాన్ని ఇప్పుడే ఎందుకు తెలుసుకోవాలో, మనం ఏం చేయాలో పరిశీలించండి.

పాఠం 2

దేవుడు ఎవరు?

దేవునికి ఒక పేరు ఉందా? దేవునికి మన మీద శ్రద్ధ ఉందా?

పాఠం 3

బైబిలు నిజంగా దేవుడు ఇచ్చిన పుస్తకమా?

బైబిల్లోని విషయాలు నిజమని ఎందుకు నమ్మవచ్చు?

పాఠం 4

యేసుక్రీస్తు ఎవరు?

యేసు ఎందుకు చనిపోయాడో, విమోచన క్రయధనం అంటే ఏంటో, యేసు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోండి.

పాఠం 5

దేవుడు ఏ ఉద్దేశంతో భూమిని చేశాడు?

దేవుడు భూమిని ఎందుకు చేశాడో, బాధలు ఎప్పుడు పోతాయో, భవిష్యత్తులో భూమికి ఏమౌతుందో, దానిలో ఎవరు ఉంటారో బైబిలు చెప్తుంది.

పాఠం 6

చనిపోయినవాళ్లను మళ్లీ ఎప్పుడైనా చూస్తామా?

చనిపోయినప్పుడు మనకు ఏమౌతుంది? చనిపోయిన మన ప్రియమైనవాళ్లను మళ్లీ ఎప్పుడైనా చూస్తామా?

పాఠం 7

దేవుని రాజ్యం అంటే ఏంటి?

దేవుని రాజ్యానికి రాజు ఎవరు? ఆ రాజ్యం ఏం చేయబోతుంది?

పాఠం 8

దేవుడు చెడుతనాన్ని, బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

చెడు ఎలా మొదలైంది? దేవుడు దాన్ని ఎందుకు తీసేయట్లేదు? బాధలు ఎప్పటికైనా పోతాయా?

పాఠం 9

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

సంతోషంగల దేవుడైన యెహోవా కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. భర్తలకు, భార్యలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు బైబిలు ఇస్తున్న మంచి సలహాలు ఏంటో తెలుసుకోండి.

పాఠం 10

సరైన ఆరాధనను ఎలా గుర్తుపట్టవచ్చు?

సరైన మతం ఒక్కటే ఉందా? సరైన ఆరాధనను గుర్తుపట్టే ఐదు విషయాలు పరిశీలించండి.

పాఠం 11

బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

మనకు నిర్దేశం ఎందుకు అవసరమో, బైబిల్లో రెండు ముఖ్యమైన సూత్రాలు ఏంటో యేసు వివరించాడు.

పాఠం 12

దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా? మనం ఎలా ప్రార్థించాలి? దేవునికి దగ్గరవ్వడానికి ఇంకా ఏం చేయవచ్చు? వంటి ప్రశ్నలకు జవాబు తెలుసుకోండి.

పాఠం 13

మతం గురించిన మంచివార్త ఏంటి?

అందరూ ఐక్యంగా ఒకేఒక్క నిజమైన దేవున్ని ఆరాధించే రోజు ఎప్పటికైనా వస్తుందా?

పాఠం 14

దేవుడు ఒక సంస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు?

నిజ క్రైస్తవులు ఎందుకు, ఎలా సమకూర్చబడ్డారో బైబిలు చెప్తుంది.

పాఠం 15

మీరు దేవుని గురించి ఎందుకు నేర్చుకుంటూ ఉండాలి?

మీరు దేవుని గురించి తెలుసుకోవడం వల్ల వేరేవాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారు? మీరు దేవునితో ఎలాంటి అనుబంధం ఏర్పర్చుకోవచ్చు?