కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం|లోకాంతం దగ్గర్లో ఉందా?

అంతాన్ని చాలామంది తప్పించుకుంటారు—మీరూ తప్పించుకోవచ్చు

అంతాన్ని చాలామంది తప్పించుకుంటారు—మీరూ తప్పించుకోవచ్చు

అంతం వచ్చినప్పుడు నాశనం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు . . . ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు.” (మత్తయి 24:21, 22) చాలామంది తప్పించుకుంటారని దేవుడు మాటిస్తున్నాడు: “లోకము . . . గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.

లోకాంతాన్ని తప్పించుకుని నిరంతరం జీవించాలంటే మీరేమి చేయాలి? ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను కూడపెట్టుకోవాలా? కాదుగానీ, మనం ఆధ్యాత్మిక విషయాలపై మనసు పెట్టాలని దేవుడు చెప్తున్నాడు. “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతురు 3:10-12) ఇక్కడ “ఇవన్నియు” అంటే ఏమిటో పేతురు పుస్తకంలోని ముందున్న మాటలను చూస్తే మనకు అర్థమౌతుంది. అవి ఈ చెడిపోయిన లోక ప్రభుత్వాలు, దేవున్ని వద్దని ఈ లోక ప్రభుత్వాలకు మద్దతిస్తున్న వాళ్లు. వాళ్లు లయమైపోతారు లేదా అంతమౌతారు. కాబట్టి, ఏవేవో వస్తువులు కూడపెట్టుకున్నంత మాత్రాన అంతాన్ని తప్పించుకోలేము.

మన ప్రాణాలను కాపాడుకోవాలంటే యెహోవా దేవుని పట్ల భక్తితో ఉంటూ, ఆయనకు నచ్చిన విధంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. (జెఫన్యా 2:3) మనం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన కాలంలో జీవిస్తున్నామనే సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రజలు ఈ సూచనలను చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. మనం వాళ్లలా కాకుండా “దేవుని దినపు రాకడ” కోసం కనిపెట్టుకుంటూ ఉందాం. మీకిష్టమైతే, రాబోయే అంతాన్ని తప్పించుకోవడానికి ఏమి చేయాలో యెహోవాసాక్షులు దేవుని వాక్యం నుండి మీకు చూపిస్తారు. ▪ (w15-E 05/01)