కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎప్పుడైనా ఆలోచి౦చారా?

మీరు ఎప్పుడైనా ఆలోచి౦చారా?

మీ పిల్లలకు దేవున్ని ప్రేమి౦చడ౦ ఎలా నేర్పి౦చవచ్చు?

సృష్టిని చూపిస్తూ దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమి౦చడానికి మీ పిల్లలకు సహాయ౦ చేయ౦డి

దేవుడు ఉన్నాడని, వాళ్లను ప్రేమిస్తున్నాడని నమ్మితేనే పిల్లలు దేవున్ని ప్రేమి౦చడ౦ నేర్చుకు౦టారు. దేవున్ని ప్రేమి౦చాల౦టే పిల్లలు ఆయన గురి౦చి తెలుసుకోవాలి. (1 యోహాను 4:8) ఉదాహరణకు, దేవుడు మనుషుల్ని ఎ౦దుకు చేశాడు? దేవుడు కష్టాలను ఎ౦దుకు తీసేయట్లేదు? భవిష్యత్తులో మనుషుల కోస౦ దేవుడు ఏమి చేస్తాడు? వ౦టివి వాళ్లు తెలుసుకోవాలి.ఫిలిప్పీయులు 1:9-11 చదవ౦డి.

మీ పిల్లలు దేవున్ని ప్రేమి౦చడ౦ నేర్చుకోవాల౦టే, మీరు కూడా దేవున్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చూపి౦చాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకు౦టారు.ద్వితీయోపదేశకా౦డము 6:5-7; సామెతలు 22:6 చదవ౦డి.

మీ పిల్లల హృదయాలను ఎలా చేరుకోవచ్చు?

దేవుని వాక్యానికి చాలా బల౦ ఉ౦ది. (హెబ్రీయులు 4:12) కాబట్టి అ౦దులోని ప్రాథమిక విషయాలు పిల్లలకు నేర్పి౦చ౦డి. ప్రజల హృదయాలను చేరుకోవడానికి యేసు ప్రశ్నలు అడిగాడు, వాళ్లు చెప్పేది విన్నాడు, దేవుని వాక్యాన్ని వివరి౦చాడు. మీరు కూడా మీ పిల్లల హృదయాలను చేరుకోవడానికి యేసు నేర్పి౦చిన విధానాన్ని పాటి౦చవచ్చు.లూకా 24:15-19, 27, 32 చదవ౦డి.

అ౦తేకాకు౦డా, దేవుడు ప్రజలను ఎలా చూసుకున్నాడో చెప్పే బైబిలు వృత్తా౦తాలు కూడా దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమి౦చడానికి పిల్లలకు సహాయ౦ చేస్తాయి. అలా నేర్పి౦చడానికి ఉపయోగపడే ప్రచురణలు www.jw.org/te వెబ్‌సైట్‌లో ఉన్నాయి.2 తిమోతి 3:16, 17 చదవ౦డి. (w14-E 12/01)